టోక్సోకారియాసిస్ అంటే ఏమిటి?
టొక్సోకారియాసిస్ అనేది రౌండ్వార్మ్స్ అని పిలవబడే పరాన్నజీవుల (parasites) వలన సంభవించే ఒక అరుదైన సంక్రమణను (ఇన్ఫెక్షన్) సూచిస్తుంది. సాధారణంగా పిల్లులు మరియు కుక్కలు వంటి జంతువులలో ఈ పరాన్నజీవులు ఉంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టోక్సోకారియాసిస్ యొక్క సాధారణ లక్షణాలు:
కొన్ని సందర్భాల్లో, పరాన్నజీవి యొక్క లార్వాలు కాలేయం, ఊపిరితిత్తులు లేదా కళ్ళకు కూడా హాని కలిగించవచ్చు మరియు తీవ్రమైన లక్షణాలకు దారితీయవచ్చు, అవి:
- మూర్చ
- ద్రుష్టి/చూపు సమస్యలు
- కంటి నొప్పి
- శ్వాస సమస్యలు
- చర్మ దద్దుర్లు
- అలసట
చాలామంది వ్యక్తులలో, శరీరంలోకి ప్రవేశించిన కొన్ని నెలలలోనే పరాన్నజీవులు చనిపోవడం వలన ఈ వ్యాధి ఎటువంటి లక్షణాలను చూపించదు. (ఈ పరాన్నజీవుల ఇంక్యూబేషన్ సమయం కొన్ని నెలల వరకు ఉంటుంది)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
టోక్సోకారియాసిస్ ప్రధానంగా కుక్కలు మరియు పిల్లుల వంటి జంతువుల జీర్ణవ్యవస్థలో నివసించే పారాసైటిక్ రౌండ్వార్మ్ ల వలన సంభవిస్తుంది. ఈ పరాన్నజీవుల గుడ్లు ఆ జంతువుల యొక్క మలం ద్వారా మట్టిలోకి ప్రవేశిస్తాయి. కలుషితమైన మట్టి ఆహారం ద్వారా లేదా పరాన్నజీవుల గుడ్లు ఉన్న నీటి ద్వారా మానవుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అది సంక్రమణను కలిగిస్తుంది.
పిల్లలు మట్టి మరియు పెంపుడు జంతువులతో ఎక్కువగా ఆడటం వలన, ఈ వ్యాధి పిల్లలలో చాలా తరచుగా సంభవిస్తుంది. ఈ సంక్రమణ మానవుల ద్వారా వ్యాపించదు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ సంక్రమణ తరచుగా భౌతిక లక్షణాల పరిశీలన ద్వారా నిర్దారించబడుతుంది మరియు రక్త పరీక్షలు సహాయంతో రోగ నిర్ధారణ దృవీకరించబడుతుంది.
సంక్రమణ/ఇన్ఫెక్షన్ అసౌకర్యవంతమైన లక్షణాలను కలిగించినప్పుడు మరియు స్వయంగా దానికదే నయం కానప్పుడు చికిత్స అవసరమవుతుంది.
టోక్సోకారియాసిస్ నిర్వహణ యొక్క అత్యంత సాధారణ చికిత్స విధానం శరీరంలోని పరాన్నజీవి లార్వాను చంపడానికి మందులు ఎక్కించడం. ఈ మందులతో పాటుగా, తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వాపును తగ్గించడానికి స్టెరాయిడ్ మందులు కూడా ఇవ్వవచ్చు. అల్పెండజోల్ (Albendazole) అనేది పరాన్నజీవిని శరీరం నుండి తొలగించడానికి ఉపయోగించే సామాన్యమైన మందు.
ఈ సంక్రమణను నివారించడానికి ప్రాథమిక మార్గం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మరియు పెంపుడు జంతువులను తాకిన తర్వాత లేదా మట్టిలో పని చేసిన తర్వాత వెచ్చని నీరు మరియు సబ్బుతో చేతులను శుభ్రంగా కడగాలి. పిల్లలు తరచుగా వారి నోట్లో తమ చేతులను పెట్టుకోకూడదని వారికి చెప్పాలి.