మెడ వంకర తిరిగడం (టోర్టికోలిస్) అంటే ఏమిటి?
“వంకరగా తిరిగిన మెడ” (టోర్టికాలిస్) అంటే మెడ యొక్క కండరాలు సంకోచించడంవల్ల తల నిరంతరంగా ఒకవైపుకే వాలడం లేదా తిరగడం జరిగే ఓ రుగ్మత. ఈ రుగ్మత లక్షణాలు హఠాత్తుగా ఏర్పడ్డప్పుడు, అలాంటి పరిస్థితిని “తీవ్రమైన టోర్టికోలిస్” అని లేక “వంకరగా తిరిగిన మెడ యొక్క తీవ్రమైన స్థితి” అని పిలువబడుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
టోర్టికోలిస్ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:
- మెడలో పెడసరం
- ఈ రుగ్మతతో ఒకే వైపు వాలిన మెడను మరోవైపు తిప్పేందుకు వీల్లేని అసమర్థత
- తల అదరడం (హెడ్ ట్రెమోర్)
- తలను రుగ్మత లేని ఇంకోవైపు తిప్పడానికి ప్రయత్నిస్తే మెడ తీవ్రంగా లేదా పదునుగా నొప్పి పెట్టడం
- మెడ కండరాలలో వాపు
- తలనొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కింది చర్యలు టోర్టికోలిస్కి కారణమవుతాయి:
- తప్పు భంగిమలో నిద్రించడం
- ఒక భుజంపైనే భారీ బరువులు పెట్టుకుని మోయడం
- మెడ కండరాలను చలికి బహిర్గతం చేయడం
దీర్ఘకాలిక టోర్టికోలిస్ కింది కారకాలవల్ల రావచ్చు:
- జన్యుపరమైన పరిస్థితులు
- వెన్నెముక లేదా నాడీ వ్యవస్థలో సమస్యలు
- మెడకు గాయం
- మెడ కండరాలకు రక్త సరఫరాతో సమస్యలు
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సాధారణంగా, మెడ భాగం యొక్క భౌతిక పరీక్షను టార్కికోలిస్ను నిర్ధారించడానికి డాక్టర్ చేత నిర్వహిస్తారు. డాక్టర్, వ్యక్తి యొక్క తలను అటు ఇటు తిప్పడం, ముందుకు వెనుకకు తిప్పడం మరియు మెడను ముందుకు వెనక్కూ ఒరగబెట్టమని, మెడను విస్తారంగా చాచమని మిమ్మల్ని అడగవచ్చు.
డాక్టర్ కూడా కింద తెల్పిన పరీక్షలను నిర్వహించవచ్చు:
- ఎక్స్-రే
- సిటి (CT) స్కాన్
- రక్త పరీక్షలు (ఈ టోర్టికోలిస్ రుగ్మత లక్షణాలను శరీరంలో కలిగిస్తున్న మరేదైనా ఇతర వ్యాధి ఉనికిని గుర్తించడానికి)
పుట్టినప్పటి నుండీ మెడ వంకరగా తిరిగి ఉన్నట్లయితే, అప్పుడు శస్త్రచికిత్స ద్వారా కురుచగా ఉన్న మెడ కండరాలను సాగతీసి వాటిని సరైన స్థితిలొ అమర్చి మెడ వంకరను సరిచేస్తారు.
తీవ్రమైన టోర్టికోలిస్ ను కింది చర్యల సహాయంతో చికిత్స చేయవచ్చు:
- వేడిని వర్తింపచేయడం
- సాగదీయడం వ్యాయామాలు
- మద్దతు కోసం ఒక మెడ కలుపు ఉపయోగించి
- నొప్పి నివారణ మందులను ఉపయోగించడం
- సర్జరీ (వెన్నెముక గాయం విషయంలో)
తీవ్రమైన టోర్టికోలిస్ (acute torticollis) యొక్క లక్షణాలు గృహ చికిత్సతోనే లేక నొప్పి ఉపశమనం మందులతో వాటంతటవే నయమైపోతాయి. అయినప్పటికీ, నొప్పి మరీ అధ్వాన్నంగా విపరీతంగా ఉంటే, వెంటనే డాక్టర్ను తప్పక సందర్శించాలి.
సాగదీసే వ్యాయామాలు (stretching exercises) మరియు మెడను మంచి భంగిమలో నిర్వహించుకోవడం వంటి నివారణ చర్యలు భవిష్యత్తులో టోర్టికోలిస్ రాకుండా ఉండేందుకు సిఫారసు చేయబడతాయి.