ఒత్తిడికి గురైన స్వరతంత్రులు (వోకల్ కార్డ్స్) అంటే ఏమిటి?
మనిషి మాట్లాడేప్పుడు స్వరపేటిక (larynx or voice box)లోని రెండు కండరకణజాల బంధనాలు (tissue bands) సాగుతూ విస్తరిస్తాయి, సాగుడు గుణం కల్గిన ఈ రెండు కండరకణజాల బంధనాలే స్వరతంత్రులు. ఒక వ్యక్తి గట్టిగా కేకలు పెట్టినపుడు, అరిచినపుడు లేదా కష్టమైన సంగీత స్వరాల్ని (గమనికలు) ఆలపించినపుడు స్వరతంత్రులు ఒత్తిడికి గురవుతాయి. గృహోపశమనాలు (home remedies) మరియు స్వరానికి విశ్రాంతినివ్వడం చేస్తే తిరిగి వేగంగా కోలుకోవడానికి వీలవుతుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వైద్యపరంగా స్వరతంత్రులు ఒత్తిడికి గురవడాన్ని (స్ట్రెయిన్డ్ వోకల్ కోర్డ్స్) “లారింగిటిస్” అని పిలుస్తారు. ఇది సాధారణంగా వ్యక్తి యొక్క కంఠస్వరాన్ని దెబ్బ తీస్తుంది, దీనితో ఆ వ్యక్తి స్వరం గీచుకుపోతుంది, దాంతో గొంతు బొంగురు పోతుంది. గొంతు బొంగురుపోయి స్వరం తగ్గిపోవడం మూలంగా వ్యక్తికి మాట్లాడ్డం కష్టమవుతుంది. ఇది భావవ్యక్తీకరణ సమస్యకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో, స్వరతంత్రులు ఒత్తిడికి గురవడంవల్ల నొప్పికి దారితీస్తాయి. దీనివల్ల కొన్ని రోజుల పాటు స్వరం పూర్తిగా కోల్పోవడం జరిగి మాట్లాడలేకపోవడం కూడా జరగవచ్చు. ఏకకాలంలో మ్రింగడంలో కష్టాలు మరియు చెవి సమస్యల ఇబ్బందులు కూడా కలగొచ్చు .
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
స్వరతంత్రులు ఒత్తిడికి గురవడం అనే రుగ్మతకు సాధారణ కారణాలు గొంతుకను అధికంగా ఉపయోగించడమే. పాటలు పాడుతున్నప్పుడు, నిరంతరంగా ఉపన్యాసాలిస్తున్నపుడు లేదా గట్టిగా కేకలు పెట్టడంవల్ల స్వరతంత్రులు ఒత్తిడికి గురవుతాయి. బలమైన వాసనతో కూడిన (స్ప్రేస్) పిచికారీలు పీల్చుకున్నప్పుడు కూడా స్వర తంత్రులు దెబ్బతింటాయి. స్వర తంత్రుల మీద నూడల్స్ లేదా పగడపుజీవులు (పాలిప్స్) (క్యాన్సర్ కాని కణజాల పెరుగుదలలు) ఉన్నట్లయితే ‘దీర్ఘకాలిక స్వరపేటిక వాపు’ (chronic laryngitis) సంభవిస్తుంది. పార్కిన్సన్ వ్యాధి, బ్యాక్టీరియా లేదా వైరల్ సంక్రమణ, అలెర్జీలు మరియు స్ట్రోక్ వంటి రుగ్మతలు స్వరతంత్రులు ఒత్తిడికి గురవదానికి ఇతర కారణాలుగా ఉన్నాయి.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఒత్తిడికి గురైన స్వరతంత్రుల రుగ్మతను వైద్యుడు శారీరక పరీక్ష చేయడం మరియు వివరణాత్మక చరిత్రను అడిగి తెలుసుకోవడం ద్వారా నిర్ధారిస్తాడు. గొంతులో వెనుక భాగాన్ని అవలోకించి పరీక్షించడానికి ఒక చిన్న అద్దంలాంటి పరికరం “లారెంగోస్కోప్” ను వైద్యుడు ఉపయోగించవచ్చు.
ఈ గొంతు రుగ్మత సాధారణంగా తీవ్రమైనదేమీ కాదు, గొంతుకకు (స్వరానికి) విశ్రాంతినిస్తే తరచుగా ఉపశమనం కలగడానికి సహాయపడుతుంది. దీనిగ్గాను, శోథ నిరోధక మందులు, యాంటీబయాటిక్స్ మరియు అరుదుగా, స్టెరాయిడ్స్ వంటి మందులు ఉపయోగించబడతాయి. వెచ్చని నీటితో పుక్కిలింతలు (gargles) చేయడంవల్ల గొంతులో నొప్పి మరియు వాపు మాయమవుతాయి. తగినంత జలసంకలన చర్య (హైడ్రేషన్) సలహా చేయబడుతుంది. అన్ని సమయాలలోనూ శీతలపానీయాలు, మద్యాన్నితీసుకోవడం మానుకోవాలి. చప్పరించే బిళ్ళలు (throat lozenges) ఈ గొంతు రుగ్మత అసౌకర్యానికి ఉపశమనాన్నివ్వడంలో సహాయపడుతుంది. గొంతు రుగ్మతల విషయంలో తేనే బాగా ఉపశమనాన్ని కల్గించడంలో సహాయపడుతుంది. ఓ గ్లాసు పరిమాణం వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసంతో పాటు మరో టీస్పూన్ తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని తాగడం వల్ల స్వర తంత్రుల చుట్టూ చేరిన శ్లేష్మం తొలగిపోయి గొంతులో ఉపశమనం ఏర్పడటానికి సహాయపడుతుంది.