నిద్ర తగ్గిపోవడం (స్లీప్ డిప్రైవేషన్) అంటే ఏమిటి?
మనిషికి తగినంతగా నిద్ర లేకపోవడాన్నే “నిద్ర తగ్గిపోవడం” గా పరిగణిస్తారు. నిద్రలేమి సమస్య చాలా కారణాల వలన సంభవిస్తుంది. నిద్రలేమి ఒక వ్యాధి కాదు, కానీ అదొక జబ్బు లక్షణం. నిద్ర తగ్గిపోవడం అనేది నిద్ర నమూనాను భంగపరుస్తుంది. నిద్ర తగ్గిపోవడం అనేక వ్యాధులు లేదా జీవిత పరిస్థితుల కారణంగా వ్యక్తిలో సంభవిస్తుంది. నిద్ర తగ్గిపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది కనుక దీన్ని అతి తొందరగా సరిదిద్దుకోవాలి.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
నిద్ర తగ్గిపోవడంతో పాటుగా కనిపించే ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉంటాయి:
- నిద్రపోవటానికి కష్టాలు (అంటే మనిషి నిద్ర రాక సతమతమవడం)
- చికాకు ప్రవర్తన
- సావధానత (శ్రద్ధ) లేకపోవడం
- పెందలాడ లేవడం (waking early)
- తరచుగా పగటిపూట నిద్రమత్తు అనుభవించడం
- నిద్రలోంచి మేల్కొన్న తర్వాత విశ్రాంతి చెందిన అనుభూతి లేకపోవడం
- ఆలోచనలు, అంచనాల్లో తప్పడం
- గురక పెట్టడం
సాధారణంగా మనిషి ఎదుర్కొనే ఐదు నిద్ర రుగ్మతలు:
- నిద్రరాక కష్టాలు పడటం లేదా నిద్రలేమి (insomnia)
- నిరోధక శ్వాస లేదా నిద్రలేమి (స్లీప్ అప్నియా)
- పగటిపూట అధికంగా నిద్రమత్తుకు గురవటం లేదా నిద్రపోవాలనే బలమైన కోరిక (నార్కోలెప్సీ)
- విశ్రాంతి లేని కాళ్ళజబ్బు (లెగ్ సిండ్రోమ్) కారణంగా నియంత్రణ లేని కాళ్ళ కదలికలు
- వేగవంతమైన కంటి కదలికతో కూడిన నిద్ర రుగ్మత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చెదిరిపోయిన నిద్రావస్థకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలోప్రధానమైనవి:
- కార్యాలయంలో అక్రమ పనివేళలు లేదా రాత్రిపూట పనిచేయాల్సి ఉండటం
- అధిక పని గంటలు
- ఆస్తమా
- డిప్రెషన్ లేదా ఆందోళన
- మద్యపానవ్యసనం (ఆల్కహాలిజమ్)
- ఒత్తిడి
- కొన్ని మందులు
- జన్యు చరిత్ర
- వృద్ధాప్యం
నిద్ర తగ్గిపోవడాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వైద్యుడు నిద్ర నమూనా చరిత్ర గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడగవచ్చు మరియు రాత్రి సమయంలో మీ నిద్ర పధ్ధతి గురించి మీ కుటుంబ సభ్యులను అడగవచ్చు. మీ వైద్యుడు మిమ్మల్ని ఓ నిద్ర డైరీని నిర్వహించమని అడగొచ్చు. ఈ డైరీ మీ నిద్రనమూనాను తనిఖీ చేయడానికి మరియు అందించిన సమాచారం ప్రకారం మీ పరిస్థితిని నిర్ధారించడానికి వైద్యుడికి ఉపకరిస్తుంది.
నిద్ర తగ్గిపోవడాన్ని మత్తుమందులతో నిర్వహించుకోవచ్చు, కానీ ఆ మత్తుమందులు తక్కువ సమర్థవంతమైనవిగా అనిపించినట్లైతే ఈ క్రింద పేర్కొన్న విధంగా నాన్-ఫార్మకోలాజికల్ పద్దతులను ప్రయత్నించండి.
స్వీయ సంరక్షణ చిట్కాలు
- మీ అంతట మీరే హాయిగా సేదదీరుతూ ఓ నిద్ర నమూనా పాలనను పాటించడం నేర్చుకోండి
- అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను స్విచ్ ఆఫ్ చెయ్యండి మరియు వాటిని మీ బెడ్ కు దూరంగా ఉంచండి.
- నిద్రను మెరుగుపర్చుకునేందుకు సేదదీరే పద్ధతులను అనుసరించండి
- మీ నిద్రవేళలకు ఓ కాలపట్టిక నిర్ణయించుకుని ఒక నిర్దిష్ట సమయంలో పడుకోవడం మరియు లేవడం అలవాటు చేసుకుని ఆ ప్రకారమే నిద్ర షెడ్యూల్ నిర్వహించండి
- బాగా నిద్ర రావడానికి సహాయపడే ఫలహారాన్ని తినడమో లేక లేదా పాలు తాగడమో చేయండి
- సరిగ్గా నిద్రపోవడానికి ముందు భారీ విందుభోజనం తినకండి, మరియు అదనపు ద్రవాహారాలు తాగకండి
- మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్ టాప్లను పడకపంచంపై ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే ఇవి మీ నిద్రను భంగపరచవచ్చు
- సాయంత్రం పూట ధూమపానం లేదా మద్యపానం మానండి లేదా ఇతర ఉత్ప్రేరకపానీయాలైన టీ మరియు కాఫీ వంటివి సాయంత్రంపూట సేవించడాన్ని మానండి.
- నిద్రను రప్పించుకునేందుకు స్లీపింగ్ మాత్రలపై ఆధారపడటం తగ్గించండి
- పడకగదిలో, మరీ ముఖ్యంగా పడకపై, నిద్ర తప్పించి మరెలాంటి పనిని చేయకుండా ఉండండి.