వేరైన భుజం అంటే ఏమిటి?

మెడకొంకులు లేక కాలర్బోన్ (clavicle) మరియు భుజాస్థి లేక షోల్డర్ బ్లేడ్ (acromion) యొక్కభాగం మధ్య ఉండే సంధిబంధన స్నాయువులు (ligaments) గాయపడడం లేదా తెగిపోవడమో జరిగితే దాన్నే “వేరైన భుజం” గా సూచించవచ్చు. వేరైన భుజం రుగ్మతలో స్నాయువు యొక్క తేలికపాటి సాగుదల (stretch) నుండి స్నాయువు తెగిపోవడం వరకు వైద్య కేసులు ఉండవచ్చు. భుజాస్థి (acromion) మరియు మెడకొంకులు (clavicle) ఒకదానికొకటి వేరుపడిపోయినపుడే “వేరైన భుజం” పరిస్థితి సంభవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వేరైన భుజం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:

  • గాయం అయిన వెంటనే నొప్పి, నొప్పి కీలుభాగంలో అంటిపెట్టుకుని ఉండడం సంభవిస్తుంది
  • గాయమైన వైపున చేతిని కదిలించేందుకు చాలా కష్టం అవుతుంది
  • కీలు (joint) భాగంలో వాపు మరియు గాయాలు
  • సున్నితత్వం
  • కాలర్బోన్ యొక్క వెలుపలి భాగం ఆడుండాల్సిన చోటు నుండి బయటకు వచ్చేసినట్లు అన్పించొచ్చు.
  • బాధిత భాగంలో బుడిపె లేదా వైకల్యం

ప్రధాన కారణాలు ఏమిటి?

వేరైన భుజం సమస్యకు అత్యంత సాధారణ కారణం తీవ్రమైన గాయమవడం. ఈ తీవ్రగాయం నేరుగా భుజానికి దెబ్బ తగలడంవల్ల లేదా పడ్డప్పుడు నేరుగా భుజానికి దెబ్బ తగలడంవల్ల కావచ్చు, కారు ప్రమాదం అవచ్చు లేదా క్రీడా గాయాలైనా కావచ్చు.

దీనికి ప్రమాద కారకాలు ఫుట్బాల్, హాకీ, స్కీయింగ్, వాలీబాల్ మరియు జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వేరైన భుజం రుగ్మత నిర్ధారణలో వైద్య చరిత్ర మరియు భౌతిక పరీక్ష సహాయపడతాయి; ఏమైనప్పటికీ, తేలికైన వైద్య కేసులు X-కిరణాల తోనే గుర్తించబడతాయి.

దీని నిర్ధారణకు కింది పరిశోధనలు ఉంటాయి:

  • ఎక్స్-రేలు 
  • ఎంఆర్ఐ (MRI)
  • అల్ట్రాసోనోగ్రఫీ

ఏ వైపు భుజం దెబ్బ తిందో ఆవైపున చేతితో బరువును ఎత్తి పట్టుకున్నట్లైతే తెగి వేరైన భుజం యొక్క వైకల్యాన్ని స్పష్టంగా గుర్తించాడానికి మరియు రోగ నిర్ధారణకు సహాయపడుతుంది.

వేరైన భుజం యొక్క చికిత్స గాయం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది.

మీ వైద్యుడు నొప్పితో కూడిన వ్యాధిలక్షణాల ఉపశమనం కోసం అనాల్జెసిక్స్ని (లేదా నొప్పినివారిణుల్ని) సూచించవచ్చు. సహజమైన మాన్పుడు ఏర్పడి స్వస్థత కలగడానికి వైద్యం అవసరమవుతుంది మరియు విరుపు ఏర్పడ్డ భుజం కీలు కదలికను పరిమితం చేయటానికి వడిసెల కట్టు (sling) అవసరమవుతుంది. భుజం విరుపు నష్టం యొక్క పరిధిని బట్టి కొన్ని వారాలపాటు విరిగి వేరైన భజం కదలికల్ని పరిమితం చేయడం చాలా అవసరం.

దీని తరువాత ఫిజియోథెరపీ ద్వారా పెడసరాన్ని తగ్గించడానికి మరియు భజం కదలికల శ్రేణిని పెంచడం జరుగుతుంది.

వైద్యం పూర్తి అయి విరిగి వేరైన భుజం బాగా నయమైన తర్వాత 8 నుంచి 12 వారాల వరకు ఎటువంటి భారీ వస్తువులను ఎత్తకుండా ఉండాలని, ఈ సూచనను కచ్చితంగా పాటించాలని వైద్యుడు తప్పకుండా సలహా ఇస్తారు.

తీవ్రమైన కేసుల్లో, అంటే సంబంధించిన భుజం ఎముకలు స్థానభ్రంశం చెందిన సందర్భంలో, శస్త్రచికిత్స అవసరమవచ్చు.

స్వీయ రక్షణ:

  • ప్రయాసతో కూడిన ఎటువంటి బలమైన పనుల్ని లేక భౌతిక చర్యను చేయకండి.
  • మీ భుజానికి వీలైనంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
  • కోల్డ్ కాంప్రెస్సులు (cold compresses) పెట్టడంవల్ల నొప్పి మరియు వాపును తగ్గించడంలో సహాయపడుతాయి.

సంబంధిత వ్యాసాలు

Read more...
Read on app