గర్భధారణ సమయంలో Rh ను చైతన్యపర్చడం అంటే ఏమిటి?
రెస్సస్ (Rhesus) లేదా Rh కారకం అనేది ఎర్ర రక్త కణాలపై ఉండే ఒక రక్షకపదార్థ జనకం (లేదా ప్రతిరోధకం), ఇది రక్తం గుంపు (బ్లడ్ గ్రూప్) ను Rh సానుకూలంగా (Rh positive గా) చేస్తుంది. Rh కారకం లేకుండా ఉండే వ్యక్తుల్ని “Rh ప్రతికూలురు”గా భావిస్తారు. Rh- పాజిటివ్ తో Rh- నెగిటివ్ రక్తం కలిసినపుడు అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యగా ఫలిస్తుంది, అది ఈ రక్షకపదార్థ జనకానికి (యాంటిజెన్కు) ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరక్షకాలు ఎర్ర రక్త కణాలను నాశనం చేయవచ్చు, దీనివల్ల Rh చైతన్యం (సెన్సిటిజేషన్) ఏర్పడుతుంది. ఈ పరిస్థితి గర్భధారణ సమయంలో Rh పాజిటివ్ బిడ్డను కల్గిన Rh-నెగిటివ్ తల్లికి గర్భధారణ సమయంలో ఏర్పడితే అదే “గర్భధారణలో Rh చైతన్యం” (Rh Sensitization During Pregnancy) గా పిలువబడుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మొదటి గర్భధారణ సమయంలో, ఎటువంటి స్పందన సాధారణంగా ప్రేరేపించబడదు. మొదటి గర్భం 40 వారాలకు దాటి పోతే, ఇది అరుదుగా మావి (placenta)ని నాశనం చేస్తుంది (ప్లాసెంటా అవాంతరం), ఇది రక్తస్రావం అయ్యేలా చేస్తుంది.
అయినప్పటికీ, రెండో గర్భధారణ సమయంలో, శిశువు Rh పాజిటివ్ ఉన్నట్లయితే, నవజాత శిశువు పచ్చకామెర్లు, రక్తహీనతతో బాధపడొచ్చు లేదా అప్పుడప్పుడు మరణం మరియు ఆకస్మిక గర్భస్రావం (ఇరిథ్రోబ్లాస్టోసిస్ట్ ఫోయేటాలీస్ అని పిలవబడే రుగ్మత) కలగొచ్చు. శిశువులో Rh- పాజిటివ్ రక్త కణాలకు తల్లి శరీరం ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది, అందుకే శిశువుకు పచ్చకామెర్లు, రక్తహీనత సంభవిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మొదటి గర్భధారణ సమయంలో తల్లికి Rh- నెగెటివ్ బ్లడ్ గ్రూప్ మరియు గర్భస్థ శిశువు Rh పాజిటివ్ గా ఉన్నప్పుడు, పుట్టినప్పుడు శిశువు మరియు తల్లి రక్తం యొక్క మిళితం ఉంటుంది, ఇది Rh యాంటిజెన్కు తల్లి యొక్క రక్తాన్ని బహిర్గతం చేయడానికి దారితీస్తుంది. అయినప్పటికీ, రెండవ గర్భధారణ సమయంలో, ఈ ప్రక్రియ పునరావృతమైతే, తల్లి శరీరంలో ఇప్పటికే Rh కారకం యాంటిజెన్కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను కలిగి ఉంటుంది మరియు పిండం యొక్క ఎర్ర రక్త కణాలపై దాడులు చేస్తాయి, దీని వలన నష్టం లేదా యాదృచ్ఛిక గర్భస్రావం జరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
స్త్రీ మరియు ఆమె భాగస్వామి యొక్క Rh హోదాతో పాటు తగినంత వైద్య చరిత్ర మూల్యాంకనం చేయబడుతుంది. గర్భవతి Rh నెగటివ్ గా ఉండి ఆమె భాగస్వామి Rh పాజిటివ్ గా ఉంటే, Rh అసంబంధ “(Rh incompatibility)” పరీక్షలు నిర్వహిస్తారు.
తల్లి యొక్క రక్తంలో Rh కారకంతో ప్రతిరోధకాల ఉనికి గురించి ఒక ప్రత్యక్ష కూంబ్స్ పరీక్ష ఒక ఆలోచన ఇస్తుంది. ఒక అనుకూలమైన కంబ్స్ పరీక్ష Rh అననుకూలతను (Rh incompatibility) సూచిస్తుంది.
Rh అననుకూలతకు చికిత్స సాధారణంగా శిశువులకు ఇవ్వబడుతుంది, ఇది రక్త నష్టం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తేలికైన రక్త నష్టం అయినపుడు ఆఖరి త్రైమాసికంలో గాని లేదా 28 వ వారంలోగాని తిరిగి అంచనా వేయడం అవసరమవుతుంది.
రక్తహీనత (రక్త నష్టం) తీవ్రంగా లేదా తీవ్రమవుతోంది అంటే, నెలలకు ముందే కాన్పు (early delivery) అవసరం అవుతుంది, అట్టి పరిస్థితిలో రక్త మార్పిడి అవసరం కావచ్చు.