కళ్ళు ఎర్రబడడం (రెడ్ ఐస్) అంటే ఏమిటి?
కన్ను ఎర్రబడింది అంటే ఇదో రుగ్మత లక్షణం, ఇది కంటికి సంబంధించిన ఎదో సమస్యను సూచిస్తుంది. కళ్ళు ఎర్రబడ్డమనేది తరచుగా చాలా చిన్న సమస్యగానే ఉంటుంది. అయితే, ఇది అపుడపుడూ నొప్పితో కూడుకుని ఉండి ఓ ప్రధాన సమస్యకు సంకేతమివ్వచ్చు. ఇది కండ్లకలక (కాన్జూక్టివిటిస్) అని పిలవబడే సంక్రమణ తర్వాత కలిగే కంటి ఊత లేక మంట వలన కల్గిన రుగ్మత (ఎర్రబడడం) కావచ్చు. ఇంకా సబ్కంజంక్టీవల్ హామరేజ్ (subconjunctival haemorrhage) అని పిలువబడే కంటి లోపలి రక్తస్రావము వల్ల కూడా కళ్ళు ఎర్రబడొచ్చు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎర్రని కళ్ళు యొక్క ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు:
- నొప్పి
- వాపెక్కిన కళ్ళు
- కళ్ళ దురద, కొన్నిసార్లు నీళ్లు కారడం ఉంటుంది.
- తీవ్రమైన తలనొప్పి.
- కాంతికి సున్నితత్వం.
- తీవ్రమైన సందర్భాల్లో, దృష్టిలో మార్పులు కూడా ఫిర్యాదు కావచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కళ్ళు ఎరుపెక్కడానికి కారణాలు:
- కళ్ళు ప్రవేశించే విదేశీ శరీరం (Foreign body), దుష్ప్రభావం (అలెర్జీ) లేదా రోగనిరోధక ప్రతిచర్య.
- చొచ్చుకొచ్చే లేదా చిందరవందరగా ఉండే గాయం.
- రసాయనిక కాల్పుడు గాయాలు (chemical burns).
- కళ్ళలో రక్త నాళాల పగిలిపోవడం.
- వైరల్ లేదా బాక్టీరియల్ అంటువ్యాధులు.
- కాన్జూక్టివిటిస్, చాలజీయాన్ మరియు కరాటిటిస్ వంటి పరిస్థితులు.
- గ్లాకోమా, యువెటిస్ మరియు కార్నియల్ పుండుతో బాధాకరమైన ఎరుపు కళ్ళు కనిపిస్తాయి.
- యాసిరిన్ లేదా వార్ఫరిన్ వంటి మందులు.
- subconjunctival haemorrahage వంటి రక్తస్రావం, ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితితో కూడుకుని ఉంటుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు సంభవించే లక్షణాల పూర్తి చరిత్రను తీసుకుంటాడు. ఈ చరిత్రలో కళ్ళు ఎరుపెక్కడమనేది ఎంతసేపుంటుంది, కళ్ళలో దీని వ్యాప్తి ఎంతవరకు, కళ్ళఎరుపు యొక్క తీవ్రత మరియు సంబంధిత నొప్పి యొక్క తీవ్రత కూడా ఉన్నాయి. అతడు / ఆమె అప్పుడు దీని యొక్క పలు కింది విషయాల్ని అంచనా వేసేందుకు కళ్ళను పరీక్షిస్తారు:
- దృష్టి (విజన్).
- బాహ్య కన్ను కండరాల కదలికలు.
- కంటి ఒత్తిడి.
- చీలిక-దీపం పరీక్ష.
- స్క్రాచ్, రాపిడి లేదా ఎడెమా / కార్నియా యొక్క వాపు.
- కనురెప్ప మరియు టియర్ సాక్ పరీక్ష.
ఎర్రబడ్డ కళ్ళకు నిర్వహణ పూర్తిగా దాని కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు కింది వాటిని కలిగి ఉండవచ్చు:
- ఇంట్లో నిర్వహణ, కిందిచర్యలు వంటివి:
- మూసిన కళ్లపై తడిగుడ్డ సంపీడనం రోజులో కొన్నిసార్లు చేయడం.
- కళ్ళు తాకేందుకు ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, రోజూ తాజా పరుపు బట్టలు మరియు తువ్వాళ్లు ఉపయోగించడం.
- అలెర్జీ కలుగజేసే వాటిని, కళ్ళమంటకు కారణమయ్యేవాటిని నివారించడం.
- కన్ను నుండి విదేశీ శరీరాన్ని (foreign body) తీసివేయడం, ఏదైనా ఉంటే.
- మందులతో కూడిన నిర్వహణ కలిగి ఉంటుంది:
- సంక్రమణ సందర్భాలలో కంటి యాంటిబయోటిక్.
- అలర్జీలకు యాంటిహిస్టామైన్ / వాసోకాన్స్ట్రిక్టర్ ఏజెంట్.
- యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కృత్రిమ కన్నీళ్లు మరియు పొడి కళ్ళకు కందెన లేపనాలు (lubricant ointments).
- గ్లాకోమా విషయంలో రక్తపోటును తగ్గించే మందులు.
- తీవ్ర సందర్భాల్లో సర్జరీ.