రేనాడ్స్ ఫెనోమినన్ అంటే ఏమిటి?

శరీరం తీవ్రమైన చలికి  లేదా ఒత్తిడికి గురైనపుడు అంత్య/చిట్ట చివరి భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోవటం వలన చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ రంగు (తెల్ల, నీలం మరియు ఎరుపు రంగులోకి) మారిపోతుంది దానిని రేనాడ్స్ వ్యాధి లేదా రేనాడ్స్ ఫెనోమినన్ (ఆర్ పి) అని పిలుస్తారు. ఇది అంతర్లీన కారణం ఆధారంగా ప్రాథమిక లేదా ద్వితీయంగా ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఒక వ్యక్తి ఈ పరిస్థితి యొక్క ఒక ఎపిసోడ్ను (తీవ్ర చలికి  లేదా ఒత్తిడికి) అనుభవిస్తున్నప్పుడు, లక్షణాలు అప్పుడప్పుడూ (intermittently) కనిపిస్తాయి, అవి వీటిని కలిగి ఉంటాయి:

  • ప్రభావిత భాగాలలో ఈ క్రింది అనుభూతులు (sensations) కలుగుతాయి:
    • నొప్పి.
    • సూదితో గుచ్చినట్లు అనిపించడం.
    • తిమ్మిరి.
    • జలదరింపు.
    • అసౌకర్యం.
  • నీలం, తెలుపు లేదా ఎరుపు రంగులోకి ప్రభావిత చర్మ రంగు మారిపోవడం.
  • బాధిత భాగాన్ని కదిలించడం కష్టం అవుతుంది

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రేనాడ్స్ ఫెనోమినన్ ప్రధానంగా కొంత మంది వ్యక్తులలో కాలి మరియు చేతి వేళ్లలో అతి సున్నితంగా రక్త నాళాల వలన కలుగుతుంది. ప్రాధమిక రేనాడ్స్ ఫెనోమినన్ ఇడియోపథిక్ (కారణం తెలియనిది), అయితే ద్వితీయ రేనాడ్స్ ఫెనోమినన్ రకం యొక్క కారణాలు:

  • ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మరియు ఆర్థరైటిస్ వంటి కొన్ని సమస్యలు.
  • మంచుతిమ్మిరి.
  • బీటా బ్లాకర్స్ మరియు కొన్ని కెమోథెరపీ ఏజెంట్లను కలిగి ఉండే మందులు.
  • యాంత్రిక కంపనం (Mechanical vibration).
  • ఎథెరోస్క్లెరోసిస్ (ధమనుల యొక్క సంకుచితం మరియు గట్టిపడటం).
  • ధూమపానం.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ పూర్తి ఆరోగ్య చరిత్ర మరియు క్షుణ్ణమైన శారీరక పరీక్ష ఆధారంగా జరుగుతుంది, తర్వాత ఈ కింది పరీక్షలు ఉంటాయి:

  • ఆటో ఇమ్మ్యూనిటీని గుర్తించడానికి రక్త పరీక్షలు.
  • నెయిల్ ఫోల్డ్ క్యాపిల్లారోస్కోపీ (nailfold capillaroscopy) అని పిలువబడే పరీక్షను ఉపయోగించి వేళ్లగోళ్ల క్రింద ఉండే రక్తనాళాలను పరీక్షించడం.
  • వ్రేళ్ళ కణజాలపు మైక్రోస్కోపిక్ పరీక్ష.
  • కోల్డ్ స్టిమ్యులేషన్ పరీక్ష (Cold stimulation test).

ఈ పరిస్థితి నిర్వహణ వీటిని కలిగి ఉంటుంది:

  • లైఫ్స్టయిల్ సవరింపులు/మార్పులు, అవి:
    • రేనాడ్స్ ఫెనోమినన్ దాడి  యొక్క మొదటి సంకేతం కనిపించిన వెనువెంటనే వెచ్చని నీటిలో చేతులు పెట్టడం/ఉంచడం.
    • చేతులు మరియు కాళ్ళు వెచ్చగా ఉంచడానికి చల్లని వాతావరణంలో చేతికి వెచ్చదనం కలిగించేవి (warmers) మరియు చేతి తొడుగుల (gloves)ను ఉపయోగించడం.
    • ఒత్తిడి మరియు కొన్ని రకాల మందులు వంటి ప్రేరేపకాలను నివారించడం.
    • రేనాడ్స్ ఫెనోమినన్ను నివారించడానికి ధూమపానం నిలిపివేయడం ఒక ముఖ్యమైన చర్య.
  • మందులు:
    • కాల్షియం ఛానల్ బ్లాకర్లు (calcium channel blockers) మరియు ఆంజియోటెన్సిన్-రిసెప్టర్ బ్లాకర్లు (angiotensin-receptor blockers) వంటి రక్తపోటు మందులు ఇవ్వబడతాయి, అవి రక్తనాళాలను విస్తరించడం ద్వారా ప్రభావిత భాగాలలోకి రక్త ప్రసరణను పెంచుతాయి.
    • సెయిల్డినఫిల్ (sildenafil) లేదా ప్రొస్టాసైక్లిన్ల (prostacyclins) ను ఉపయోగించి ఇతర సమస్యలకు (పుండ్లు వంటివి) చికిత్స చేయవచ్చు.
    • లక్షణాలను మెరుగుపరిచే మందులు:
      • సమయోచిత క్రీమ్లు.
      • సెలెక్టివ్-సెరోటోనిన్-రిప్టేక్ ఇన్హిబిటర్లు (SSRI,   Selective-serotonin-reuptake inhibitors).
      • కొలెస్ట్రాల్ తగ్గించే (స్టాటిన్) మందులు.

Medicines listed below are available for రేనాడ్స్ ఫెనోమినన్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Nicerbium Tablet10 Tablet in 1 Strip610.85
Cevadil 400 Capsule10 Capsule in 1 Strip68.0
Cholergol Tablet10 Tablet in 1 Strip289.1
Nirogam Raynomore Tablet120 Tablet in 1 Bottle3599.1
Cyclo 200 Mg Tablet10 Tablet in 1 Strip34.65
Cyclospasmol Capsule10 Tablet in 1 Strip29.4
Cevadil 200 Capsule10 Capsule in 1 Strip38.0
Cyclo 400 Mg Tablet10 Tablet in 1 Strip55.82
Cyclospasmol 400 Capsule10 Capsule in 1 Strip48.3
Cyclandelate Capsule10 Capsule in 1 Strip60.0
Read more...
Read on app