సోరియాసిస్ - Psoriasis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

March 06, 2020

సోరియాసిస్
సోరియాసిస్

సారాంశం

సోరియాసిస్ చర్మపు కణాల అసాధారణ వృద్ధి వల్ల ఏర్పడిన దీర్ఘకాలిక చర్మ స్థితి. ఈ చర్మ కణాలు వేగంగా వృద్ధి అవుతాయి మరియు ప్రభావిత ప్రాంతం యొక్క వాపును ప్రేరేపిస్తాయి. సోరియాసిస్ వలన సాధారణంగా చర్మంపై ఎరుపు ప్యాచెస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎరుపు పాచెస్ నొప్పికి కారణమవుతాయి మరియు భయంకరమైన దురద కలిగి వెండి-తెలుపు వంటి పొరలతో కప్పబడి ఉంటాయి. శారీరకమైన లక్షణాలు పెరుగుతున్న మరియు క్షీణిస్తున్న అనేక దశలను చూపుతాయి, కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి ఎలాంటి శాశ్వత నివారణ లేదు. అయితే, తగిన చికిత్సతో, వ్యాధి లక్షణాలు నియంత్రణలో ఉంచబడతాయి. జీవనశైలి మార్పులతో (ఒత్తిడిని నివారించడం, తేమను ఉపయోగించడం, ధూమపానం మరియు మద్యపానాన్ని తొలగించడం వంటివి) తో పాటు పాటు టార్గెట్ చికిత్స (స్థానిక అనువర్తనం, ఫోటో థెరపీ మరియు నోటి ద్వారా తీసుకొనే మందులు) సాధారణంగా ఉపశమనం యొక్క కాలం (లక్షణం లేని దశ) పొడిగింపు చేయబడుతుంది.

సోరియాసిస్ యొక్క లక్షణాలు - Symptoms of Psoriasis in Telugu

వ్యక్తులను బట్టి మరియు సోరియాసిస్ రకం బట్టి సోరియాసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ ప్యాచ్లు కొన్ని మచ్చలు నుండి పెద్ద గాయాలు వరకు ఉంటాయి. చర్మం, మోచేతులు, మోకాలు, చేతులు మరియు కాళ్ళు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు.

సోరియాసిస్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • చర్మంపై ఎరుపు  మచ్చలు కనిపించడం, ఇవి మందపాటి వెండి పొరలుగా ఉంటాయి.
  • ఈ మచ్చలు దురదలా మారుతాయి, మంటను కలిగిస్తాయి మరియు బాధ కలిగించడానికి కారణమవుతాయి.
  • కొన్నిసార్లు చర్మం అధిక పొడిగా ఉండడం లేదా స్క్రాచ్ కారణంగా రక్తస్రావం జరుగవచ్చు.
  • ప్రభావితమైన ప్రాంతాలు చర్మం,మోచేతులు, మోకాలు లేదా ఎగువ శరీర భాగం.
  • నెయిల్ సోరియాసిస్ వలన గోళ్ళ యొక్క మందం, గుంతలు అవడం మరియు రంగు మారడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. గోర్లు వాటి ఆధారం నుండి కొన్నిసార్లు ఊడిపోతాయి.
  • పస్టులర్ సోరియాసిస్ అనేది చేతులు మరియు కాళ్ళ మీద చీము నిండిన ఎర్రని-పొరలు, పగిలిన చర్మం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

సాధారణంగా, ఈ లక్షణాలు వృద్ది చెందుతున్న మరియు క్షీణిస్తున్న క్రమానుగత లేదా వలయాలను చూపుతాయి. లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల వరకూ  తీవ్రంగా ఉండవచ్చు మరియు సాధారణ స్థితికి వస్తాయి లేదా కొన్నిసార్లు అవి కూడా నయం అవుతాయి మరియు గుర్తించదగినవి కావు. ఆపై మళ్ళీ, ఈ ప్రభావాలు రేకెత్తించే లక్షణాల కారణoగా మరల కనిపిస్తాయి.

సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు క్రింది వాటితో సహా:

  • శరీరంలో ఒక వైపు లేదా ఇరువైపులా కీళ్ల ప్రమేయం.
  • ప్రభావిత కీళ్ళు బాధాకరమైనవిగా మరియు వాపు  కలిగి తాకడం వలన వెచ్చని అనుభూతి పొందవచ్చు.
  • వేళ్లు మరియు కాలి యొక్క కీళ్ళు వాపు వలన సాసేజ్-లాంటివిగా కనిపిస్తాయి మరియు ఇవి వైకల్యాలకు కారణమవుతాయి.
  • కొన్నిసార్లు, వెన్నుపూస మధ్య కీళ్ళు ప్రభావితం అవుతాయి మరియు నడుము నొప్పి లక్షణాలు (లంబర్ స్పొండిలైటిస్ ­ను పోలి ఉంటుంది) కలిగి ఉంటుంది.
  • ప్రభావిత అకిలెస్ స్నాయువు మరియు అరికాలి అంటిపట్టుకొన్న కణజాలము మడమ లేదా వెనుక పాదంలో తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. (మరింత చదవండి - మడమ నొప్పి కారణాలు మరియు చికిత్స)

సోరియాసిస్ యొక్క చికిత్స - Treatment of Psoriasis in Telugu

సోరియాసిస్ కు శాశ్వతంగా నయమయ్యే చికిత్స లేదు. చికిత్స అనేది వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు లక్షణాలను ఉపశమనం చేసుకొనే లక్ష్యంతో చేయబడుతుంది. సోరియాసిస్ చికిత్స 3 కేటగిరీలుగా విభజించబడింది- పైపూత చికిత్స, క్రమబద్ధమైన మందులు వాడుక మరియు ఫోటో థెరపీ (కాంతి చికిత్స)

  • పైపూత చికిత్స
    తేలికపాటి సోరియాసిస్ లో, పైపూత మందులు మాత్రమే సరిపోవచ్చు.  మధ్యస్థమైన లేదా తీవ్రమైన సోరియాసిస్ లో, పైపూతగా రాసే మందులతో పాటుగా నోటి ద్వారా తీసుకునే మందులు లేదా ఫోటోథెరపీ అవసరం అవుతుంది. పైపూతగా రాసే మందులలో ఇవి ఉంటాయి:
    • కోర్టికోస్టెరాయిడ్లు
    • విటమిన్ డి అనలాగ్‌లు
    • పైపూత రెటీనాయిడ్లు
    • శాలిసైలిక్ ఆసిడ్
    • కోల్ తార్
    • కాల్సినీయురిన్ ఇన్‌హిబిటర్లు
    • ఆంత్రాలిన్
    • మాయిశ్చరైజర్లు
  • క్రమబద్ధమైన మందుల వాడుక
    సోరియాసిస్ తీవ్రమైన లేదా సమయోచిత చికిత్సకు ఆటంకo కలిగితే నోటి లేదా సూది మందులు సూచించబడతాయి. సాధారణంగా, ఈ మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అందుచే అవి తక్కువ వ్యవధి కోసం ఉపయోగించబడతాయి మరియు ఇతర రకాల చికిత్సలతో ప్రత్యామ్నాయoగా చేయబడతాయి. సోరియాసిస్ కు చికిత్స చేయడానికి వాడే మందులు:
  • మెథోట్రెక్సేట్
  • సైక్లోస్పోరిన్
  • రెటీనాయిడ్లు
  • ఇమ్యునోమోడ్యులేటర్లు
  • హైడ్రాక్సీయూరియాస్
  • ఫోటో థెరపీ
  • ఆదర్శ ఫోటో థెరపీలో అల్ట్రా-వైలెట్ కిరణాల (సహజ లేదా కృత్రిమ) కు ఈ పొరల గాయాలను గురవుతాయి. సాధారణంగా తీవ్రమైన సోరియాసిస్ యొక్క మోతాదు సమయోచిత చికిత్సా ప్రయోజనాలలో లేదా క్రమబద్ధమైన మందుల వాడుకతో కలిపి ఫోటోథెరపీతో సహా నిర్వహించబడుతుంది. వివిధ రకాల తేలిక చికిత్స రూపాలలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:
    • ఎండ తగులుట
    • యువిబి ఫోటోథెరపీ
    • గోకర్‌మ్యాన్ థెరపీ
    • లేజర్ థెరపీ
    • సోరాలెన్ ప్లస్ అల్ట్రావయొలెట్ ఎ థెరపీ

జీవనశైలి యాజమాన్యము

సోరియాసిస్ ఒక వ్యక్తి యొక్క జీవనశైలిని అలాగే అతని/ ఆమె యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. సోరియాసిస్ గురించి అవగాహన అనేది ఒక వ్యక్తి సోరియాసిస్­ని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనుటలో సహాయ పడుతుంది. ఇది వ్యాధిని నయం చేయుటలో మరియు వ్యాధి ప్రభావాలకు పరిష్కారాలను కనుగొనుటలో సహాయపడుతుంది. ఈ కోలుకునే పద్ధతులలో ఈ క్రిందివి ఉంటాయి:

  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి.
  • దురద లేకుండా చేయుట
    సాధారణంగా, దురద ఒక దుష్ట వలయo లాగానే ఉంటుంది, మీరు మరింతగా గోకినపుడు అది మరింత దురదను కలిగిస్తుంది. కాబట్టి, ముఖ్యంగా సోరియాసిస్ అనేది చర్మం యొక్క పొరల కోసం, దురదను నివారించడం కోసం గోకడం మానుకోవాలి. మాయిశ్చరైజర్ల ఉపయోగం దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • బరువు నియంత్ర్రణ
    బరువు కోల్పోవడం లేదా లక్ష్యిత BMI సాధించడంలో సోరియాసిస్ లక్షణాల తీవ్రత తగ్గించడం అనేది బాగానే పనిచేస్తుంది. అంతేకాకుండా, పండ్లు, కూరగాయలు, కాయ ధాన్యాలు, క్రొవ్వు లేని మాంసం మరియు చేపలు కలిగిన ఆహారాన్ని సోరియాసిస్ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎర్రని మాంసం, అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం మరియు ఆల్కహాల్ వంటివి సోరియాసిస్­ని మరింత తీవ్రతరం చేస్తాయి.
  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి
Skin Infection Tablet
₹719  ₹799  10% OFF
BUY NOW

సోరియాసిస్ అంటే ఏమిటి? - What is Psoriasis in Telugu

మనుషులకు సోకే చర్మ వ్యాధులు వందకు పైగా ఉన్నాయి. ఈ స్థితులలో అత్యధికం ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అధిక భాగం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. తాత్కాలికమైన లేదా శాశ్వతమైన, బాధాకరమైన లేదా నొప్పిలేకుండా, దురద కలిగిన లేదా దురద లేని లక్షణాల ఆధారంగా ఈ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కారణాలు భిన్నంగా ఉంటాయి మరియు రోగనిరోధక వ్యవస్థ మరియు జన్యువుల్లోని అలెర్జీ, ఇన్ఫెక్షన్, లోపాలు కూడా కారణం కావచ్చు. లక్షణాలు వాటి తీవ్రతను బట్టి మారుతుంటాయి. కొన్ని లక్షణాలు తక్కువగా ఉంటాయి మరియు అదృశ్యం అవుతాయి, అయితే కొన్ని చాలా తీవ్రంగా ఉంటాయి మరియు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. సోరియాసిస్ ప్రపంచ జనాభాలోని 5% మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ చర్మ వ్యాదుల్లో ఒకటి.

సోరియాసిస్ అంటే ఏమిటి?

సోరియాసిస్ చర్మ కణాల పెరుగుదలను హెచ్చించుట ద్వారా చర్మం యొక్క వృద్ధి వేగవంతం అయ్యే ఒక స్థితి. ఇది చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది. కణాలు ఈ సమూహాలుగా చేరి దురదను కలిగి ఉంటాయి మరియు ఎరుపుగా మారుతాయి మరియు కొన్నిసార్లు ఇవి బాధాకరమైనవిగా కూడా  ఉంటాయి. ఇది ఎక్కువ కాలం (దీర్ఘకాలిక) ప్రభావం చూపే ఒక స్థితి, ఇది ఒక క్రమానుగత నమూనాలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా నయo అవదు మరియు అందువల్ల చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం దీని లక్షణాలను నియంత్రణలో ఉంచడమే.



వనరులు

  1. Merck Manual Consumer Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Inc.; c2018. Psoriasis.
  2. National Health Service [internet]. UK; Psoriatic arthritis
  3. National Health Service [Internet]. UK; Psoriasis
  4. National Psoriasis Foundation [Internet] reviewed on 10/23/18; Causes and triggers.
  5. American Academy of Dermatology. Rosemont (IL), US; Are triggers causing your psoriasis flare-ups?
  6. Whan B. Kim, Dana Jerome, Jensen Yeung. Diagnosis and management of psoriasis. Can Fam Physician. 2017 Apr; 63(4): 278–285. PMID: 28404701
  7. National Psoriasis Foundation [Internet] reviewed on 10/23/18; Life with Psoriasis.
  8. Gulliver W. Long-term prognosis in patients with psoriasis. Br J Dermatol. 2008 Aug;159 Suppl 2:2-9. PMID: 18700909

సోరియాసిస్ కొరకు మందులు

Medicines listed below are available for సోరియాసిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.