ప్రొలాక్టినోమా అంటే ఏమిటి?
ప్రొలాక్టినోమా అనేది పిట్యూటరీ గ్రంధి యొక్క నిరపాయమైన (కేన్సర్ కానిది) కణితి. స్త్రీలలో రొమ్ములు నుండి పాలు విడుదలచేసే ‘ప్రోలాక్టిన్’ అనే హార్మోన్ ను ఈ కణితి స్రవిస్తుంది. ఈ రుగ్మత అధిక హార్మోన్ ల ఉత్పత్తి కారణంగా పలు రుగ్మతల శ్రేణినే కలిగిస్తుంది. ప్రోలాక్టినోమాలు చాలా సాధారణమైనవి మరియు చిన్న కణితులు, ఇవి ఎక్కువగా మహిళలలోనే కనిపిస్తాయి, అయితే పురుషులలో సాధారణంగా పెద్ద కణితులుగా ఉంటాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ కణతి పిట్యూటరీ గ్రంధిలో తనకు దగ్గరగా ఉన్న కణజాలంతో కొట్టుకుని నరాల మరియు హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన వ్యాధిలక్షణాల శ్రేణిని కల్గిస్తుంది. కణితి ద్వారా స్రవించబడిన హార్మోన్లు కారణంగా ఇతర వ్యాధి లక్షణాలు సంభవిస్తాయి.
- ఋతు చక్రాల సంబంధమైన కలతలు, మరియు వంధ్యత్వం ఫిర్యాదుల్ని మహళలు చేయవచ్చు.
- ముట్టు (ఋతుస్రావం) కాకపోవడం లేదా ఆలస్యమైన రజస్వలత్వం సంభవించవచ్చు.
- గర్భధారణ లేకుండానే స్త్రీలలో రొమ్ములనుండి చనుబాలు కారవచ్చు. ఇది చాలా సాధారణం.
- ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉండవచ్చు, ఇది యోని పొడిదనానికి దారి తీస్తుంది, డైస్పారూనియా మరియు బోలు ఎముకల వ్యాధికి కూడా దారితీస్తుంది.
- ఈ వ్యాధిగ్రస్తులైన పురుషులు తమలో లైంగిక సామర్థ్యం తగ్గింది అని, అంగస్తంభన లోపం, లేదా వంధ్యత్వం ఏర్పడిందని ఫిర్యాదులు చేయవచ్చు.
- గుర్తించిన ఇతర లక్షణాలేవంటే తలనొప్పి, తగ్గిన పరిధీయ దృష్టి లాంటి దృష్టి మార్పులు మొదలైనవి.
కణితి తనకు దగ్గరలోని పిట్యూటరీ కణజాలంతో తాకిడి జరిగిన సందర్భాల్లో, ఇది పిట్యూటరీ గ్రంధి యొక్క భాగాలను పనిచేయకుండా ఉండే పరిస్థితికి దారితీస్తుంది. ఇది థైరాయిడ్-ఉత్తేజిత హార్మోన్ లాంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్ల లోపానికి దారి తీస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కణితి నిరపాయకార మైనది (కేన్సర్ కాని కణితి). ప్రొలాక్టిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరిగిన కారణంగానే వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు సంభవిస్తాయి.
హైపోథైరాయిడిజం, అడ్రినల్ గ్రంథి వైఫల్యం, కొన్ని మానసిక రుగ్మతలకు, జిఈఆర్డి (GERD) లేదా రక్తపోటుకు సూచించిన కొన్ని మందుల వలన ఈ రుగ్మత సంభవించవచ్చు. మత్తుమందులు (ఒపియట్స్) ప్రోలాక్టినోమాకు దారి తీయవచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వ్యాధి లక్షణాలు సంభవించిన సందర్భాలలో, ప్రోలాక్టినోమా ఉందని అనుమానం ఉంటే, వివిధ హార్మోన్ స్థాయిలు కోసం ప్రయోగశాల పరీక్షలు చేయాలి. దీని తరువాత ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT) పరీక్ష జరుగుతుంది. తాకడానికి వీలయ్యే గడ్డ విషయంలో, సిటి (CT) స్కాన్ తప్పనిసరిగా ఉండాలి.
రోగనిర్ధారణ ధ్రువీకరించబడిన తర్వాత, హార్మోన్ల అసమతుల్యత ముఖ్యమైన లక్షణాలకు కారణమైతే చికిత్స జరుగుతుంది. చికిత్స చేయకుండా అట్లాగే వదిలేస్తే చాలా ప్రోలాక్టినోమాలు పరిమాణంలో అభివృద్ధి చెందవు. నిర్దిష్ట హార్మోన్ల ప్రభావాలను ఆపే మందులు సూచించబడతాయి.
కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోధార్మికతను అనుబంధంగా ఉపయోగించవచ్చు. ఏదేమైనా, ఎన్నో దుష్ప్రభావాల వలన దీన్ని సాధారణంగా వాడరు. శస్త్రచికిత్స అనేది కొద్దిపాటి కేసుల్లో మాత్రమే అవసరమవుతుంది, ఆకస్మికంగా వ్యాధిలక్షణాలు తీవ్రమైనపుడు శస్త్రచికిత్స అవసరమవచ్చు. రోగ నిరూపణ సాధారణంగా మంచిది.