న్యుమోనైటిస్ అంటే ఏమిటి?
రోగనిరోధక వ్యవస్థలో రుగ్మత మరియు ఇన్ఫెక్షన్/సంక్రమణ కాని (non-infectious) కారణాల వలన ఊపిరితిత్తుల కణజాలంలో వాపు ఏర్పడడాన్ని న్యుమోనైటిస్ అని పిలుస్తారు. న్యుమోనైటిస్ కొన్ని ప్రత్యేక పదార్ధాలకు గురికావడం వలన దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక వాపును కలిగిస్తుంది మరియు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. సరైన సమయంలో తగినవిధంగా దీనిని నిర్వహించకపోతే ఊపిరితిత్తులకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
న్యుమోనైటిస్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు:
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- జ్వరం
- అలసట
- చలి
- ఛాతీ పట్టినట్టు ఉండడం
- పొడి దగ్గు
- ఆకలి తగ్గుదల
- బరువు తగ్గడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఊపిరితిత్తుల వాపుకు దారితీసే, పరిసరాలలో ఉండే కొన్ని పదార్ధాలకు నిరంతరంగా మరియు పునరావృత్తంగా గురికావడం వలన న్యుమోనైటిస్ సంభవిస్తుంది. , ఈ క్రింద పదార్దాలలో ఏవైనా వాటివలన ఊపిరితిత్తుల యొక్క వాపు రూపంలో శరీరంలో హైపర్ సెన్సిటివిటీ ప్రతిచర్యలు చూపవచ్చు, న్యుమోనైటిస్ను ట్రిగ్గర్ కొన్ని పదార్థాలు:
- ప్రోటీన్లను
- కెమికల్స్
- ఎండు గడ్డి
- పశువుల మేత
- కలుషితమైన ఆహారం
- ఎయిర్ కండీషనర్ మరియు వెంటిలేషన్ వ్యవస్థలు (ventilation systems)
- జంతువుల బొచ్చు
- పక్షుల ఈకలు లేదా రెట్టలు
- కలప దుమ్ము
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
భౌతిక పరీక్ష నిర్వహించిన తరువాతవైద్యులు ఈ కింది నిర్దారణ పరీక్షలను ఆదేశిస్తారు:
- తెల్ల రక్త కణాల మరియు ఇతర రోగనిరోధక కణాల యొక్క అధిక స్థాయిని గుర్తించడం కోసం రక్త పరీక్షలు
- ఊపిరితిత్తుల స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి సిటి (CT) స్కాన్ మరియు ఛాతీ ఎక్స్-రే
- ఊపిరితిత్తుల పనితీరును తనిఖీ చేయడానికి ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు
- ఊపిరితిత్తుల నుండి సేకరించిన ద్రవంలో తెల్ల రక్తకణాల ఉనికిని గుర్తించడానికి బ్రోన్కోఅల్వియోలార్ లావెజ్ (Bronchoalveolar lavage)
న్యుమోనైటిస్ చికిత్సలో ఇవి ఉంటాయి:
- కార్టికోస్టెరాయిడ్లు మరియు ఇతర ఇమ్మ్యూనోసప్రెస్సివ్ (immunosuppressive) మందులు
- శ్వాస యొక్క కొరత నిర్వహించడానికి ఓపియాయిడ్స్
- ఊపిరితిత్తులలో కండరాల సడలింపు (relaxation) కోసం బ్రోన్కోడైలేటర్లు
- ఆక్సిజన్ సరఫరా స్థాయిలు పెంచడానికి ఆక్సిజన్ చికిత్స
పరిసరాల నుండి అలెర్జీ కారకాన్ని తొలగించడం, అలెర్జీ కారకం నుండి దూరంగా ఉండటం మరియు పని చేసే చోటును మార్చడం వంటి ఇతర నిర్వహణ పద్ధతులు ఈ పరిస్థితిని నివారించడం కోసం అనుసరించవచ్చు.