పురుషాంగ క్యాన్సర్ అంటే ఏమిటి?
పురుషాంగ క్యాన్సర్ అంటే మెలిగ్నెంట్ లేదా క్యాన్సర్ కణాలు పురుషాంగం యొక్క కణజాలంలో అనియంత్రంగా వృద్ధి చెందడం. ఇది ఒక అరుదైన రకమైన క్యాన్సర్, సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన పురుషుల్లో కనిపిస్తుంది. సున్తీ ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అందువల్ల ముస్లిం మరియు యూదు (Jewish) పురుషులలో పురుషాంగ క్యాన్సర్ ఎక్కువగా కనిపించదు. పురుషాంగ క్యాన్సర్ ప్రభావితమైన కణాల మీద ఆధారపడి వివిధ రకాలుగా వర్గీకరించబడింది. పురుషాంగ చర్మాన్ని ప్రభావితం చేసే క్యాన్సర్ను పురుషాంగం యొక్క మెలనోమా అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పురుషాంగం మీద అసాధారణమైన పెరుగుదల లేదా గడ్డ తాకడం ద్వారం తెలియడం/గమనింపబడడం అనేది పురుషాంగ క్యాన్సర్ యొక్క మొట్టమొదటి సంకేతాలలో ఒకటి. ఇతర సంకేతాలతో వారాల పాటు నయం కాని పురుషాంగం నుండి రక్తస్రావం లేదా నిరంతరమైన చెడు వాసనతో కూడిన స్రావాలు, పురుషాంగ కోన మీద దద్దుర్లు, పురుషాంగ కాండము మీద అసాధారణ పుండ్లు ఏర్పడడం లేదా పురుషాంగ నొప్పి వంటివి ఉంటాయి. ఈ లక్షణాలతో పాటు అర్థంకాని బరువు తగ్గుదల, బద్ధకం మరియు వ్యాధి పురోగించే కొద్దీ వంటి మూత్రవిసర్జనలో నొప్పి కలుగుతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పురుషాంగ క్యాన్సర్ అభివృద్ధికి ఖచ్చితమైన కారణం పూర్తిగా తెలియలేదు; అయినప్పటికీ, కొన్ని ప్రమాద కారకాలు, ధూమపానం మరియు ఫిమోసిస్ (phimosis), అంటే పురుషాంగ ముందరి చర్మం పురుషాంగ కొనకు అంటుకుపోతుంది, అందువలన పురుషాంగానికి అధికంగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇతర కారణాలు వృద్ధాప్యం, పురుషాంగం యొక్క గాయం మరియు జననాంగ పులిపిర్ల/పొక్కుల చరిత్ర.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సాధారణ వైద్యుని (general practitioner) నుండి చికిత్స పొందిన తరువాత పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కొనసాగుతూ ఉంటే, వ్యక్తి నిపుణుడిని లేదా యూరోలాజిస్ట్ (urologist) ను సంప్రదించాలి, వారు మరింత వివరముగా పరిశోధిస్తారు. ప్రాధమిక మరియు అతి ముఖ్యమైన పరీక్ష ఒక స్థానిక జీవాణుపరీక్ష (బయాప్సీ) చేయడం. బయాప్సీలో ప్రభావిత అవయవం నుండి కణజాలం నమూనాను సేకరించి మరియు క్యాన్సర్ కణాలు లేదా ఇతర వ్యాధుల తనిఖీ కోసం మైక్రోస్కోప్ ద్వారా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. దీని తర్వాత, పెట్ (PET) స్కాన్ లేదా సిటి (CT) స్కాన్ వంటి స్కాన్లు క్యాన్సర్ వ్యాప్తిని మరియు తీవ్రతను తెలుసుకోవటానికి ఆదేశించబడతాయి. దీని ప్రకారం, శోషరస కణుపులను కలిగి ఉండడం (lymph node involvement), సాధారణ కణజాలంపై క్యాన్సర్ యొక్క వ్యాప్తి ఆధారంగా క్యాన్సర్ యొక్క దశ గుర్తించబడుతుంది. వ్యక్తి యొక్క క్యాన్సర్ దశ నిర్దారణ రోగ నిరూపణ (prognosis) మరియు రికవరీ యొక్క అవకాశాల గురించి తెలుపుతుంది.
చికిత్స ప్రభావిత ప్రాంతం యొక్క పరిమాణంపై మరియు క్యాన్సర్ వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. పురుషాంగ కొన వద్ద మాత్రమే కణితులకు మరియు చర్మం మీద మాత్రమే పరిమితమై ఉన్న క్యాన్సర్కు, ఆ భాగాన్ని తొలగించడానికి లేజర్ సర్జరీ చేయబడుతుంది. తరువాత ఆ స్థానంలో స్కిన్ గ్రాఫ్ట్ పెట్టబడుతుంది. క్యాన్సర్ యొక్క చివరి దశల చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ మరియు శస్త్రచికిత్సలు ఉంటాయి.