పేనిక్ అటాక్ మరియు డిసార్డర్ అంటే ఏమిటి?
పేనిక్ అటాక్ మరియు డిసార్డర్ అనేది ఒక రకమైన ఆందోళన రుగ్మత, దీనిలో ఒక నిర్దిష్ట వస్తువు, వ్యక్తి లేదా పరిస్థితికి ప్రతిస్పందనగా తీవ్రమైన దిగులు మరియు భయం కలుగుతుంది. తీవ్ర భయాందోళన (పేనిక్ అటాక్ను) ఎదుర్కొంటున్నప్పుడు, వ్యక్తి తన సొంత చర్యలు మరియు భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతున్నట్లు భావిస్తాడు. తీవ్ర భయాందోళన యొక్క ఒక ఎపిసోడ్ను పేనిక్ అటాక్ అని పిలుస్తారు, కానీ ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు తీవ్ర భయాందోళన భావనను అనుభవిస్తుంటే, వైద్యపరంగా దానిని పేనిక్ డిజార్డర్ అని పిలుస్తారు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పేనిక్ అటాక్ సమయంలో, వ్యక్తి ఇటువంటి మానసిక లక్షణాలను అనుభవిస్తాడు:
- తీవ్ర కంగారు/అధైర్యం
- తీవ్ర భయం
- ఒత్తిడి మరియు ఆందోళన
- ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు మరియు ఎవరైనా వారిని తాకడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటారు
సాధారణంగా పేనిక్ అటాక్లో కనిపించే భౌతిక లక్షణాలు:
- వేగవంతమైన హృదయ స్పందన (మరింత సమాచారం: టాఖికార్డియా కారణాలు మరియు చికిత్స)
- ఛాతి నొప్పి
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- అధికంగా చెమట పట్టుట
- మైకము
- బలహీనత
- కడుపు నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
తీవ్ర ఒత్తిడి పేనిక్ డిసార్డర్ కి దారితీస్తుంది. అయితే, ఇది వైద్య శ్రద్ద అవసరమైన ఒక మానసిక పరిస్థితి/సమస్య. అధిక/తీవ్ర ఒత్తిడి స్థాయిల యొక్క ప్రతిచర్యలు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారవచ్చు. సాధారణంగా, ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు తీవ్ర ఆందోళన లేదా ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు కాలక్రమేణా పేనిక్ డిసార్డర్ అభివృద్ధి చెందుతుంది.
సాధారణంగా చాలామంది వ్యక్తులలో, పేనిక్ అటాక్ మొదలయ్యే ఒక ప్రత్యేక ప్రేరేపకం లేదా ట్రిగ్గర్ ఉంటుంది. ఉదాహరణకు, కొందరి వ్యక్తులలో పేనిక్ అటాక్కు కారణం చుటూ రద్దీగా లేదా కిక్కిరిసినట్టు ఉండే ప్రాంతం/ప్రదేశం కావచ్చు. పేనిక్ అటాక్ యొక్క కారణాలు మారుతూ ఉంటాయి ప్రియమైన వారిని పోగొట్టుకోవడం, స్వీయ లేదా ప్రియమైన వారికి హాని కలిగించిన ప్రమాదం, భారీ ఆర్థిక నష్టాలు మొదలైనవి కారణాలు కావచ్చు.
అయినప్పటికీ, పేనిక్ అటాక్ ఎటువంటి హెచ్చరిక లేకుండా కూడా సంభవించవచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ రుగ్మత ఒక మానసిక ఆరోగ్య సంరక్షణ నిపుణులు, మానసిక వైద్యులు (psychiatrist) లేదా మనస్తత్వవేత్త (psychologist) చేత వైద్యపరంగా నిర్ధారణ చేయబడుతుంది. పేనిక్ డిసార్డర్లను నిర్వహించడం కోసం/తగ్గించడం కోసం వ్యక్తికి తన లక్షణాలను నియంత్రించుకోవడానికి రిలాక్సషన్ ఎక్ససర్సైజ్లు (relaxation exercises) మరియు బ్రీతింగ్ ఎక్ససర్సైజ్లు (breathing exercises) సిఫారసు చేయబడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, నిపుణుల చేత కౌన్సెలింగ్ (counselling) మరియు మేధావికాస ప్రవర్తనా చికిత్స (cognitive behavioural therapy) కూడా ఇవ్వవచ్చు.
తీవ్ర సందర్భాల్లో మందులు కూడా అవసరం కావచ్చు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ఆందోళన వ్యతిరేక (Anti-anxiety) మందులు సూచించబడతాయి.
పేనిక్ డిసార్డర్ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి కాదని తెలుసుకోవడం చాలా ముఖ్యం, కానీ ఇది ఒక వ్యక్తి యొక్క స్వీయ-గౌరవం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు నిర్వహించదగినవి/తగ్గించదగినవి మరియు పేనిక్ డిసార్డర్లను సకాల సహాయము/సహకారము మరియు లక్షణాల అవగాహనతో నిర్వహించవచ్చు.