పేజట్స్ వ్యాధి అంటే ఏమిటి?
పేజట్స్ వ్యాధి అనేది ఎముక తప్పుగా ఏర్పడే మరియు ఎముక వైకల్యాలకు దారితీసే ఒక వైద్య పరిస్థితి/సమస్య. ఈ వ్యాధిలో, ఏర్పడిన కొత్త ఎముక బలహీనముగా మరియు పెళుసుగా ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి (ఓస్టిపోరోసిస్) తర్వాత, ఇది రెండవ అత్యంత సాధారణ ఎముక మెటబాలిజం (జీవక్రియ) యొక్క రుగ్మత. ఈ ఎముకలు విరిగినప్పుడు, పేజట్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిలో, ఎముక పునరుద్ధరణ (renewal) చర్యలలో లోపాల కారణంగా ఫ్రాక్చర్ నయం కావడానికి చాలా సమయం పడుతుంది . ఇది సాధారణంగా కాళ్ళు, పుర్రె (స్కల్), కటి భాగం మరియు వెన్నెముకలలో కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- ఎముకల లేదా కీళ్ళ నొప్పి.
- చర్మం ఎర్రబారడం .
- సున్నితత్వం.
- ఎముకలు లేదా కీళ్ళు లో వాపు.
- ఎముకల యొక్క ఫ్రాక్చర్.
- అసాధారణ పెద్ద ఎముకలు.
- కార్టిలేజ్ యొక్క నష్టం.
- కీళ్ళు లేదా ఎముకలలో బిరుసుదనం.
- ఎముకలు విస్తరించిన కారణంగా నరాలు అణిగిపోతాయి అందువలన శరీర భాగాలు కదలికలు లేదా సంచలనాలు/అనుభూతులను కోల్పోతాయి.
- కడుపు నొప్పి.
- మలబద్ధకం.
- బలహీనత.
- అలసట.
- ఆకలి తగ్గుదల.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
దీని యొక్క ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియలేదు. అయితే, ఈ కింద పేర్కొన్న కారకాలు దీనికి కారణం కావచ్చు:
- ఆస్టియోక్లాస్ట్స్ (పాత ఎముకను శోషించే/పీల్చే కణాలు) మరియు ఆస్టియోబ్లాస్ట్స్ (కొత్త ఎముకను ఏర్పరచే కణాలు) యొక్క అసాధారణ పనితీరు
- రూబియోల (rubeola) వైరస్ వలన ఎముక కణాలలో ఏర్పడిన ఒకరకమైన సంక్రమణ/ఇన్ఫెక్షన్.
- ఈ సమస్య కుటుంబాలలో వారసత్వంగా సంక్రమించినట్లు గుర్తిచబడుతుంది కాబట్టి వంశపారంపర్యం (Heredity) కూడా ఒక కారణం.
- వయస్సు కూడా ఒక ముఖ్యం కారకం, ఇది 40 ఏళ్లలోపు వ్యక్తులు చాలా అరుదుగా కనపడుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
దీనిని వివిధ విధానాల ద్వారా నిర్ధారించవచ్చు:
- శారీరక పరిక్ష
ఇది ఎముక ఆకారం మరియు పరిమాణంలోని ఏవైనా అసమానతలను గుర్తించడంలో సహాయపడుతుంది. - రక్త పరీక్షలు
రక్తంలో ఫాస్ఫాటేస్ ఉనికిని గుర్తించడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఫాస్ఫాటేస్ పేజట్స్ వ్యాధి యొక్క సూచిక. - ఎక్స్-రే
ఇది వ్యాధిని నిర్ధారిస్తుంది మరియు ఫ్రాక్చర్ అలాగే ఎముకల యొక్క తక్కువ సాంద్రతను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది.
పూర్తి స్థాయిలో రికవరీ (నయం కావడం) అసాధ్యం అయినప్పటికీ, చికిత్సల ద్వారా ఎముక అసహజతలను తగ్గించవచ్చు మరియు వ్యాధి యొక్క ప్రభావాన్ని నియంత్రించవచ్చు. చికిత్సలు వీటిని కలిగి ఉంటాయి:
- పేజట్స్ వ్యాధి కారణంగా తీవ్రమైన ఎముక ఫ్రాక్చర్లు లేదా ఎముకల నష్టం లేదా వైకల్యం ఏర్పడితే, అప్పుడు శస్త్రచికిత్స చికిత్స యొక్క ఎంపికగా ఉంటుంది.
- వాపు నిరోధక (Anti-inflammatory) మందులు.
- అనాల్జెసిక్స్ (నొప్పి నివారితులు).
- ఆస్టియోక్లాస్ట్స్ యొక్క చర్యను నిరోధించడంలో బిస్ఫాస్ఫోనేట్ (Bisphosphonate) మందులు సహాయపడతాయి.