ఒరోఫారింజియల్ కాన్సర్ - Oropharyngeal Cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 04, 2019

October 29, 2020

ఒరోఫారింజియల్ కాన్సర్
ఒరోఫారింజియల్ కాన్సర్

ఒరోఫారింజియల్ క్యాన్సర్ అంటే ఏమిటి?

గొంతు క్యాన్సర్ గా పిలువబడే ఒరోఫారింజియల్ క్యాన్సర్, సాధారణంగా నోటి వెనుక భాగాన్ని దెబ్బ తీస్తుంది - నోటివెనుకభాగంలో ఉండే మృదువైన అంగిలి, టాన్సిల్స్, నాలుకలో మూడింటా ఒకభాగం నాలుక మరియు అన్నవాహికను ఈ క్యాన్సర్ దెబ్బతీస్తుంది. ఈ క్యాన్సర్ వ్యాధికి గురైన వ్యక్తి శ్వాసను, తినడాన్ని మరియు మాట్లాడే ప్రక్రియల్ని దెబ్బ తీస్తుంది. ఓరల్ క్యాన్సర్ భారతదేశంలో అత్యంత మూడు సాధారణ క్యాన్సర్లలో మొదటిది, మహిళల కంటే పురుషులకే ఇది ఎక్కువగా వస్తుంది. పొగాకు నమలడం వంటి ప్రమాదకర కారకాలకు గురయ్యే మధ్య వయస్కులు మరియు తక్కువ-ఆదాయం గల సమూహాలలో ఈ ఒరోఫారింజియల్ కాన్సర్ మరింత ఎక్కువగా ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా, ఈ క్యాన్సర్ యొక్క ప్రారంభ దశలు గుర్తించబడవు, ఎందుకంటే ఇది నొప్పిలేకుండా ఉంటుంది మరియు కొన్ని మాత్రమే భౌతిక మార్పుల్ని వెబుచ్చుతుంది గనుక తరచుగా విస్మరించబడతాయి. శోషరస గ్రంధులకు మరియు ఇతర అవయవాలకు వ్యాప్తి చెందడాన్ని బట్టి  ఈ క్యాన్సర్ లో 4 దశలు ఉన్నాయి.

ఈ క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలు:

  • నమలడంలోను, ఆహారం, నీరు మింగడంలోను కష్టం
  • దవడలో లో పెడసరం (పట్టేసినట్లుండడం) నోటిని పూర్తిగా తెరవడంలో కష్టం
  • గొంతు మంట
  • నోటిలో మానని పూతలు మరియు పుళ్ళు
  • కణితి-ప్రభావిత ప్రాంతంలో వాపు
  • నాలుకను కదిలించడంలో సమస్య
  • దంతాలు వదులై కదలడం లేదా పంటినొప్పి
  • చెవుల్లో మరియు మెడలో నొప్పి
  • బొంగురుపోయిన గోంతు (గొంతు రాసుకుపోవడం)
  • చెప్పలేని బరువు నష్టం
  • అలసట మరియు ఆకలి లేకపోవడం
  • నోరు, గొంతు లేదా మెడ వెనుక ఒక ప్రబలంగా వాపు ఏర్పడడం
  • నోటి నాలుక పైన లేదా నోటి గోడలు (లైనింగ్) మీద తెలుపు / ఎరుపు మచ్చలు
  • రక్తంతో కూడిన వాంతులు లేదా దగ్గినప్పుడు రక్తం పడటం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పొగాకు వినియోగమే నిర్ధారించబడ్డ ఒరోఫారింజియల్ కాన్సర్ లకు ప్రధాన ప్రమాద కారకం. మితం మించిన మద్యపానం కూడా ఒరోఫారింజియల్ కాన్సర్ కు దోహదం చేస్తుంది. ధూమపానంతో పాటు మితం మించిన మద్యపానం కూడా తోడవటం అనేది వ్యక్తుల్ని క్యాన్సర్ ప్రమాదానికి మరింత దగ్గర చేస్తుంది.

ఒరోఫారింజియల్ కాన్సర్ యొక్క ఇతర కారణాలు:

  • హ్యూమన్ పాపిల్లోమా (మానవ పులిపిరి సూక్ష్మజీవి) వైరస్ (HPV) సంక్రమణం
  • అతినీలలోహిత కిరణాలు (సూర్యుడు, సన్ లాంప్స్) పెదవులకు తాకడం
  • ఇదివరలో రేడియోధార్మికత లేదా రేడియేషన్కు బహిర్గతమవ్వడం
  • పోకవక్కలు, తమలపాకులు నమలడం (ఆకు-వక్క సేవనం)
  • ఆస్బెస్టాస్, సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు ఫార్మాల్డిహైడ్కు బహిర్గతమవడం
  • ఆమ్లత లేదా గ్యాస్ట్రో-ఒసిఫేగల్ రిఫ్లక్స్ వ్యాధి (జి.ఆర్.డి.)కి గురికావడం

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఒరోఫారింజియల్ కాన్సర్ లేదా క్యాన్సర్ల ముందు దశ సంభావ్య సంకేతాలను పరీక్షించదానికి దంతవైద్యుడు, ఓటోలారింగోలజిస్టు (ENT) మరియు తల మరియు మెడ వైద్యులు (సర్జన్లు) అత్యుత్తమ నిపుణులు. దాని రకం ఆధారంగా క్యాన్సర్ను నిర్ధారించడానికి అనేక పద్ధతులు అవసరం కావచ్చు:

  • వైద్య చరిత్ర మరియు ప్రమాద కారకాల గురించిన విచారణతో పాటు గొంతు, శారీరక పరీక్ష
  • గాయం యొక్క స్థానం ఆధారంగా ఎండోస్కోపీ - లారిన్గోస్కోపీ / ఫ్యరంగోస్కోపీ / నాసోఫారింగోస్కోపీ
  • ఓరల్ బ్రష్ బయాప్సీ
  • హెచ్ పివి (HPV) పరీక్ష
  • ఎక్స్-రే
  • బేరియం స్వాలో
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT లేదా CAT) స్కాన్
  • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI)
  • అల్ట్రాసౌండ్
  • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) లేదా PET-CT స్కాన్

చికిత్స ఎంపికలు అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి - క్యాన్సర్ రకం మరియు దశ, ఎదురుకాగల దుష్ప్రభావాలు మరియు వ్యక్తి గరిష్ఠ ఆరోగ్యం వంటివి. క్యాన్సర్ చికిత్సలు ఒకటి లేదా ఈ చికిత్సల కలయికను కలిగి ఉంటాయి:

  • శస్త్రచికిత్స - ప్రాధమిక కణితి శస్త్రచికిత్స, నాలుక తొలగింపు (glossectomy), ఒక భాగం యొక్క మొత్తం తొలగింపు లేదా మొత్తం దవడ (మండింబులెక్టోమీ), ఒక భాగం లేదా అంగిలి గట్టిభాగం మొత్తం తొలగింపు  (మాక్సిలెక్టోమీ), మెడ విభజన మరియు పాక్షిక లేదా మొత్తం స్వరపేటిక లేదా వాయిస్బాక్స్ యొక్క తొలగింపు (లారింగెక్టోమీ). ఇన్వాసివ్ శస్త్రచికిత్సలు కాకుండా, బృహద్ధమని సంబంధ రోబోటిక్ శస్త్రచికిత్స మరియు ట్రాన్సోరల్ లేజర్ మైక్రోసర్జరీ అనేవి ఇతర తక్కువ ఇన్వసివ్ శస్త్రచికిత్సల ఎంపికలు
  • రేడియేషన్ థెరపీ - బాహ్య కిరణం రేడియేషన్ మరియు అంతర్గత రేడియేషన్ థెరపీ రేడియేషన్ థెరపీ రూపాలు
  • కెమోథెరపీ
  • ఇమ్మ్యునోథెరపీ - పెంబ్రోలీజుమాబ్ మరియు నివోలుమాబ్ వంటి మందులు కూడా చికిత్స కోసం ఉపయోగించబడతాయి
  • టార్గెటెడ్ థెరపీ - టార్గెటెడ్ థెరపీ అనేది నిర్దిష్ట క్యాన్సర్ జన్యువులు మరియు ప్రోటీన్లను అడ్డుకుంటుంది

చికిత్స యొక్క వ్యవధి క్యాన్సర్ దశపై ఆధారపడి ఉంటుంది. ఇది 6 వారాల నుండి 6 నెలల కన్నా ఎక్కువ కాలం వరకు ఉంటుంది. క్యాన్సర్ చికిత్స ఖరీదైనది, దాదాపు 3.5 లక్షల ఖరీదు చేస్తుంది.

క్యాన్సర్ చికిత్స తరచుగా దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అందువల్ల, రోగులు వారి శారీరక, భావోద్వేగ మరియు సామాజిక అవసరాల కోసం సహాయక లేదా పాలియేటివ్ కేర్లను అందిస్తారు. వీటితో పాటు, జీవనశైలిలో మార్పులు అవసరం - మద్యం (ఆల్కహాల్) మరియు పొగాకు వినియోగాన్ని తగ్గించడం, నేరుగా ఎండలో తిరక్కుండా ఉండడం మరియు జంక్ ఫుడ్, సంతృప్త కొవ్వులు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించడం వంటివి.



వనరులు

  1. Swati Sharma et al. Oral cancer statistics in India on the basis of first report of 29 population-based cancer registries . J Oral Maxillofac Pathol. 2018 Jan-Apr; 22(1): 18–26. PMID: 29731552
  2. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Oropharyngeal Cancer Treatment (Adult) (PDQ®)–Patient Version
  3. PDQ Adult Treatment Editorial Board. Oropharyngeal Cancer Treatment (Adult) (PDQ®): Patient Version. 2019 Mar 28. In: PDQ Cancer Information Summaries [Internet]. Bethesda (MD): National Cancer Institute (US); 2002-.
  4. Sankaranarayanan R, Ramadas K, Amarasinghe H, et al. Oral Cancer: Prevention, Early Detection, and Treatment. In: Gelband H, Jha P, Sankaranarayanan R, et al., editors. Cancer: Disease Control Priorities, Third Edition (Volume 3). Washington (DC): The International Bank for Reconstruction and Development
  5. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Head and Neck Cancers