మైకోసిస్ ఫంగోయిడిస్ అంటే ఏమిటి?
మైకోసిస్ ఫంగోయిడిస్ అనేది తెల్ల రక్త కణాలకు సంభవించే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇది భారతదేశంలో హాజ్కిన్ కాని లింఫోమా (non-Hodgkin lymphoma) ల యొక్క అత్యంత సాధారణ రకాల్లో ఇది ఒకటి. మైకోసిస్ ఫంగోయిడిస్ ప్రధానంగా చర్మాన్ని ప్రభావితం మరియు చర్మం మీద గాయాలను/పుండ్లను కలిగిస్తుంది. ఇది సాధారణంగా 40 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువగా నివేదించబడింది. పిల్లలు మరియు యువకులను కూడా ప్రభావితమవుతారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చర్మ గాయాలు/పుండ్లు అనేవి పైకి కనిపించే అత్యంత సాధారణ లక్షణాలు. చర్మ గాయాల/పుండ్ల రకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- చర్మంపై ఎర్రని మచ్చలు
- దద్దుర్లు
- పైకి ఉబ్బినట్టు ఉండే గడ్డలు
- పైకి ఉబ్బినట్టు ఉండే లేదా గట్టిపడిన మచ్చలు
గాయాలను/పుండ్లను సాధారణంగా ఛాతీ, ఉదరం, పిరుదులు, తొడల మరియు రొమ్ము ప్రాంతంలో గమనించవచ్చు మరియు అవి చికాకు మరియు నొప్పితో కూడా ముడిపడి ఉంటాయి. ఈ చర్మ గాయాలు తామర మరియు సోరియాసిస్ వంటి ఇతర చర్మ వ్యాధుల లక్షణాల వలె కనిపిస్తాయి.
తరువాతి దశలలో, బలహీనత, జ్వరం, బరువు తగ్గుదల, ప్రేగులలో పుండ్లు, కంటి నొప్పి మరియు అస్పష్టమైన దృష్టి వంటి లక్షణాలు సంభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మైకోసిస్ ఫంగోయిడిస్ యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ పరిస్థితిలో, T- కణాలు, తెల్ల రక్త కణాలలో ఒక రకం, క్యాన్సర్ని కలిగించేవిగా మారుతాయి మరియు చర్మంపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. చర్మ ప్రమేయం ఉన్నప్పటికీ, చర్మ కణాలకు క్యాన్సర్ కలుగదు. సాధారణంగా ప్రభావితమైన వ్యక్తులలో కొన్ని జన్యువులలో అసాధారణత కనిపిస్తుంది.
పరిశోధకులు సూచించే ఇతర కారణాలు:
- హానికరమైన పదార్దాలకు (క్యాన్సర్ కలిగించేవి) బహిర్గతం కావడం
- బాక్టీరియల్ లేదా వైరల్ సంక్రమణం/ఇన్ఫెక్షన్
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు (చర్మవ్యాధి నిపుణులు) రోగి చర్మాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు మరియు రక్త కణాల అసాధారణత గుర్తించడానికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. జీవాణుపరీక్ష (బయాప్సీ), రోగ నిర్ధారణ కొరకు గాయాల/పుండ్ల నుండి కణాలను సేకరించి పరీక్షించే ఒక ప్రక్రియ, వైద్యులు దానిని సిఫార్సు చేస్తారు. జీవాణుపరీక్ష ద్వారా సేకరించిన కణాలు మైకోసిస్ ఫంగోయిడిస్ను నిర్దారించడానికి పరీక్ష కోసం పంపబడతాయి. కొన్నిసార్లు వైద్యులు బయాప్సీ ద్వారా పొందిన పరీక్ష ఫలితాలు నిర్ధారించడానికి ప్రోటీన్ పరీక్షను సిఫార్సు చేయవచ్చు. పరీక్షల యొక్క ఫలితాలు స్పష్టంగా తెలియనప్పుడు, జన్యువుల్లో మార్పులను గుర్తించడానికి జన్యు పరీక్ష (జీన్ టెస్ట్) సహాయపడుతుంది.
వ్యాధి దశ పై ఆధారపడి, డాక్టర్లు కార్టికోస్టెరాయిడ్, అల్ట్రావయొలెట్ చికిత్స (ultraviolet treatment), ఫోటోకీమోథెరపీ (photochemotherapy) మరియు ఇతర మందులను సిఫార్సు చేస్తారు.