సెగ గుల్లలు అంటే ఏమిటి?
సెగ గుల్లలు రుగ్మత ఓ చర్మవ్యాధి. ఇది దీర్ఘకాలిక మంటతో కూడిన చర్మ దద్దుర్లకు దారితీస్తుంది. ఈ చర్మ వ్యాధి లక్షణమేమంటే మెరిసేటువంటి మరియు దురద పెట్టే ఎరుపు-ఊదా మచ్చలు లేదా గాయాల మాదిరిగా చర్మంపై కనిపిస్తాయి. ఈ వ్యాధి నోటి లోపలి కుహరంలోను బాధిస్తుంది. తెలుపు మరియు బూడిద రంగు మచ్చలతో కూడిన ఈ చర్మవ్యాధి పెదవులపైన మరియు నోట్లో కూడా వస్తాయి, మంట పుట్టిస్తాయి.
సెగ గుల్లలు అనేది చాలా అరుదైన స్వయంరక్షణ (ఆటోఇమ్యూన్) వ్యాధి. జననేంద్రియ ప్రాంతం, నెత్తిచర్మం, గోర్లు, కళ్ళు మరియు అన్నవాహిక (ఎసోఫేగస్) కూడా ఈ వ్యాధికి గురవుతాయి. నెమ్మదిగా, చర్మంపై ఇది సోకిన భాగం యొక్క బాహ్యరూపాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు.
సెగగుల్లల రుగ్మత ఎట్లా కనబడుతుందంటే చెట్లపైన, వృక్షాలుపైన, బండ్లపై, శిలలపై పెరిగే పూతలేని మొలకలను (lichen) పోలి ఉంటుంది. ఈ గాయాలు చదునైన మరియు పొలుసులతో కూడుకుని ఉంటాయి. ఇది సరిగ్గా నిర్ధారణ కాకపోతే, అది బూజు (ఫంగల్) లాగా పొలుసులతో కూడుకుని పెరిగేందుకు దారి తీయవచ్చు. ఈ రుగ్మత సోకిన శరీర భాగాన్ని బట్టి ఒక నిర్దిష్టమైన పేరు లేక శీర్షిక కేటాయించబడింది.
- చర్మసంబంధ (Cutaneous) సెగ గుల్లలు - చర్మం
- నోట్లో సెగ గుల్లలు - నోట్లో మరియు పెదవులపై వచ్చే గుల్లలు
- శిశ్నము పైన లేదా యోనిపైన వచ్చే గుల్లలు - జననేంద్రియ భాగం
- నెత్తిపై వెంట్రుకల కుదుళ్లకు వచ్చే సెగగుల్లలు ప్లానోపిలారిస్ - నెత్తిచర్మం
- చెవి-సంబంధమైన (Otic) సెగ గుల్లలు - చెవులు
సెగగుల్లలు తీవ్ర రూపం దాల్చినపుడు ఏర్పడే పరిస్థితిని “హరించే సెగగుల్లలు” (ఎరోసివ్ లిచెన్ ప్లానస్) అని పిలుస్తారు. ఈ రకం సెగగుల్లలు దీర్ఘకాలంపాటు బాధిస్తాయి. తత్ఫలితంగా, నోటి భాగాల్లో, మరియు జననేంద్రియ భాగాల్లో సెగగుల్లలు వచ్చి, రోజువారీ పనులకు ఇతర జీవిత కార్యకలాపాలకు భంగం కల్గిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సెగగుల్లలు క్యాన్సర్ కణాల్ని వృద్ధి చేసే ప్రమాదం ఉంది. .
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సెగ గుల్లలు క్రింది ప్రధాన లక్షణాలను కలిగి ఉంటాయి:
- చేతులు, కాళ్ళు లేదా శరీరం చర్మంపై మెరిసే మచ్చలు ఊదా-ఎరుపు రంగులో లేస్తాయి.
- తెల్లటి అతుకుల్లాంటివి (పాచెస్) లేదా చెమటకాయల్లాంటివి, బుగ్గలు లేదా నాలుకపై వచ్చి బాధిస్తాయి
- నోటిలో పూతలు (mouth ulcers)
- భోజనం చేసే సమయంలో నోటిలో మంట, సలిపే నొప్పి.
- చర్మంపై బట్టతలలా మెరిసే గుల్లలు లేదా మచ్చలు (పాచెస్)
- యోని లేదా పురుషాంగం మీద పుండు మచ్చలు
- పలుచబారిపోయే గోర్లు లేదా కఠినంగా మారే గోర్లు
- పళ్ళచిగుళ్ళ మీద పొట్టు
- అరుదైన సందర్భాల్లో, బొబ్బలు రావచ్చు
రుగ్మత సోకిన శరీరభాగాన్ని బట్టి వ్యాధి లక్షణాలు మారవచ్చు. ఆ లక్షణాలు ఇలా ఉండగలవు:
- కాళ్ళ దిగువభాగంలో పొలుసులతో కూడిన పులిపిరిలాంటి గాయాలు
- మానుతున్న చర్మ గాయం వెంబడి మచ్చలు
- చర్మ క్షీణత
- చెమట పట్టకపోవటం
- చర్మం రంగులో తీవ్ర మార్పిడి (అధిక వర్ణకవిధానం-హైపెర్పిగ్మెంటేషన్) లేదా హైపోపిగ్మెంటేషన్
పైన వివరించిన ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈ రుగ్మత మానదగింది మరియు ఒకరి నుండి మరొకరికి అంటుకోనివ్యాధి (noncommunicable disease) ఇది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సెగ గుల్లలకు కారణం స్పష్టంగా అర్థం కావటం లేదింకా, ఏమైనప్పటికీ స్వయం రోగనిరోధకత అనేది మూల కారణం. మందులు, అలెర్జీ కారకాలు, అంటువ్యాధులు లేదా గాయం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బాధింపబడినపుడు, రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాలపై దాడి చేస్తాయని భావించబడింది, తద్వారా సెగగుల్లలకు దారితీస్తుంది. తత్ఫలితంగా, చర్మంపై గుల్లలేర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో, రోగి యొక్క జన్యు చరిత్ర కూడా సెగగుల్లల గ్రహణశీలతను (susceptibility) నిర్ధారిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
చర్మం మరియు శ్లేష్మ పొర యొక్క శారీరక పరీక్ష ద్వారా ఈ వ్యాధిలక్షణం యొక్క నిర్ధారణను అర్హత కలిగిన వైద్య నిపుణుడిచే చేయబడుతుంది. వ్యాధి నిర్వహణను ప్రభావితం చేసే ఇలాంటి పరిస్థితులను తోసిపుచ్చడానికి చర్మపు జీవాణుపరీక్షను ఉపయోగించవచ్చు. పైన చెప్పిన పరీక్షలతో పాటు, హెపటైటిస్ వైరస్ సంక్రమణకు పరీక్ష చేయవలసి ఉంటుంది.
అలాగే, అంతర్లీన అలెర్జీలను గుర్తించి వాటికి చికిత్స కూడా ప్రారంభించవచ్చు.
ఈ పరిస్థితికి చికిత్స ఎంపికలు ఇలా ఉన్నాయి:
- 6-9 నెలల వ్యవధిలో సహజ రోగనిరోధక శక్తికి ప్రతిస్పందనగా సెగ గుల్లలు తమకుతాముగా నయమైపోతాయి.
- చర్మవ్యాధి లక్షణాలను నియంత్రించడానికి వైద్యులు క్రీమ్లు మరియు లోషన్లను సూచించి, వాడమని సలహా ఇవ్వవచ్చు.
- స్టెరాయిడ్స్ లేదా ఫోటో థెరపిని కూడా పరిస్థితి వ్యాప్తిపై నియంత్రణ పొందటానికి వైద్యులు ఉపయోగించవచ్చు.
- నోటిలో వచ్చే సెగ గుల్లలకు మౌత్ వాష్ లు, రిన్సెస్ మరియు జెల్ వంటివి పుండు మంటకు ఉపశమనం కలిగించవచ్చు.
- తీవ్రమైన (erosive) సెగ గుల్లలకు, దైహిక కార్టికోస్టెరాయిడ్ చికిత్స ఉపశమనం అందించడానికి ప్రారంభించబడుతుంది.
- చివరి ప్రయత్నంగా, మైకోఫీనోలేట్, అజాథియోప్రిన్ మరియు మెతోట్రెక్సేట్ వంటి రోగ నిరోధక మందులను కూడా ఇతర మందులతో పాడు వాడవచ్చు.