బద్ధకం (లెథర్జి) అంటే ఏమిటి?
ఓ వ్యక్తి యొక్క సోమరితనం మరియు శక్తిహీనత (అలసట)తో కూడిన ప్రవర్తనను “బద్ధకం” గా వివరించవచ్చు. నిద్రలేమితో పాటు పేర్కొన్న లక్షణాలను అనుభవించేవారు బద్ధకస్తులుగా ఉంటారు. మందత్వం మరియు సోమరితనం అనేవి మానసికంగా లేదా భౌతికంగానూ ఉండవచ్చు. ఈ లక్షణాలు ఓ వ్యక్తి యొక్క అంతర్గత భౌతిక లేదా మానసిక స్థితి ఉనికిని సూచిస్తుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బద్ధకస్తులైనవారు సాధారణంగా ఒకింత స్థితిభ్రాంతిని కల్గి చాలా నెమ్మదిగా కదులుతారు. మానసిక కల్లోలం, అలసట, శక్తి లేకపోవడం మరియు తగ్గిన ఆలోచించే సామర్థ్యం వంటి లక్షణాల్ని మనం బద్ధకస్తులైన వ్యక్తులలో గమనించవచ్చు. బద్ధకస్తులైన వ్యక్తులు తక్కువ అప్రమత్తంగా కూడా ఉంటారు.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
ఫ్లూ లేదా జ్వరం వంటి భౌతిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, బలహీనమైన మరియు నీరసమైన అనుభూతి మనిషిలో సాధారణం. ఏదేమైనా, ఇతర పరిస్థితులు కూడా బద్ధకానికి కారణమవుతాయి. ఆ కారణాలిలా ఉంటాయి:
- హైపర్ థైరాయిడిజం
- హైపోథైరాయిడిజం
- స్ట్రోక్
- గర్భం
- మితం మించిన మద్యపానం
- జ్వరం
- మెనింజైటిస్
- మెదడు గాయం
- మూత్రపిండ సమస్యలు
- లైమ్ వ్యాధి (ఓ రకం పేను కాటు)
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), నిద్ర లేకపోవటం లేదా సరిపోని పోషకాహారం.
- మానసిక పరిస్థితులు: నిరాశ, ఆందోళన, ప్రసూతి తర్వాతి (పోస్ట్-పార్టిమ్) మాంద్యం లేదా పూర్వ రుతుక్రమ సంబంధిత సిండ్రోమ్ వంటివి.
- కుంగుబాటునివారణా మందుల వంటి కొన్ని మందుల దుష్ప్రభావం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
బద్ధకాన్ని నిర్ధారించడానికి పూర్తిస్థాయి వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షలు అవసరం. గుండె మరియు ఊపిరితిత్తుల పరీక్షను నిర్వహించవచ్చు. డాక్టర్ మానసిక చురుకుదనాన్ని కూడా అంచనా వేస్తాడు మరియు ప్రేగు శబ్దాలు మరియు పేగుల్లో నొప్పి ఉందేమోనని కూడా తనిఖీ చేస్తారు. వైద్య పరిస్థితులు బద్ధకానికి సంభావ్య కారణం కావచ్చు, కాబట్టి ఏవేని వైద్య పరిస్థితుల ఉనికిని వ్యక్తిలో పరీక్షించడానికి పరీక్షలు మరియు ఇమేజింగ్ అధ్యయనాల శ్రేణిని వైద్యుడు నిర్వహించవచ్చు.
బద్ధకానికి చికిత్స చేయడానికి, అంతర్లీన కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. రుగ్మతకు చికిత్స దాని స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రుగ్మత మానసిక అనారోగ్యానికి సంబంధించినదైతే వైద్యులు కుంగుబాటు నివారణా మందులతో పాటు తగిన మందులను సూచించవచ్చు. తగినంత ద్రవాహారం తీసుకోవడం, సరైన నిద్ర, సమతుల్య ఆహారం మరియు ఒత్తిడి నిర్వహణ వంటి కొన్ని సాధారణ నివారణలు బద్ధకాన్ని పరిమితం చేయడంలో సహాయపడవచ్చు.