గర్భధారణ సమయంలో కాళ్ళ తిమ్మెర్లు అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో కాళ్ళ తిమ్మిరి అనేది చాలా సాధారణ లక్షణం మరియు దాదాపు 50% గర్భిణీ స్త్రీలు అనుభవించబడుతున్నారు. కాళ్ళ తిమ్మిరి సాధారణంగా సాయంత్రం లేదా రాత్రిలో సంభవిస్తుంది మరియు గర్భధారణ యొక్క మూడవ త్రైమాసికంలో ముఖ్యంగా సాధారణం. అవి బాధాకరమైనవి, అసౌకర్యంగా ఉంటాయి మరియు రోజువారీ కార్యకలాపాలను భంగపరచవచ్చు.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ అనేది మహిళల ఓ జీవితంలో ఓ దశ. ఈ గర్భధారణ సమయంలో మహిళలు అనేక శారీరక మరియు మానసిక మార్పులను అనుభవిస్తారు. ఈ అనుభవాల ముందు కాళ్ళ తిమ్మెర్లు అనేవి గర్భవతులకు ఎంతమాత్రం తీవ్రమైన ఆందోళన విషయం కాదు. వీటికి ఓ స్పష్టమైన కారణం కూడా కలిగి ఉండకపోవచ్చు. కాళ్ళ తిమ్మిరితో కనిపించే ఇతర సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉంటాయి.
- తరచుగా తలనొప్పి
- పొత్తికడుపు నొప్పి మరియు కటి నొప్పి
- నరముల మీద ఒత్తిడి
- దిగువ నడుము నొప్పి
కండరాల నొప్పి సాధారణంగా కొన్ని సెకన్ల వరకూ ఉంటుంది, గరిష్టంగా 10 నిమిషాల వరకు కూడా ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో కాళ్ళ తిమ్మిరికి ప్రత్యేక కారణం లేదు; అయినప్పటికీ, పెరిగిన గర్భవతి బరువు రుగ్మతకారణాలలో ఒకటి కావచ్చు. గర్భస్థ శిశువు కారణంగా కొన్ని రక్తనాళాలపై అదనపు ఒత్తిడివల్ల కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గుతుంది. కండరాలు హఠాత్తుగా సంకోచించినపుడు కాళ్లలో తిమ్మిరి (ఈడ్పులు) ఏర్పడుతుంది. ఇది కూడా కండరాల బెణుకుల ప్రమాదాన్ని పెంచుతుంది . కాల్షియం మరియు సోడియం వంటి కొన్ని ఖనిజ లోపాలు కూడా కండరాల తిమ్మిరిని ప్రేరేపిస్తాయి.
దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు సాధారణంగా తెలిపిన వ్యాధి లక్షణాలు మరియు శారీరక పరీక్ష ద్వారా గర్భవతి కాళ్ళ తిమ్మిరికి కారణాన్ని విశ్లేషించి నిర్ధారిస్తారు.
రోగనిరోధక ఉపశమనం కోసం మందులు సూచించబడవచ్చు మరియు ఖనిజ పదార్ధాలు చేర్చబడతాయి. చాలా సందర్భాలలో, వైద్యపరమైన జోక్యం లేకుండానే గర్భవతి కాళ్ళ తిమ్మిరి చాలా త్వరగా ఉపశమనం పొందుతుంది.
స్వీయ రక్షణ చిట్కాలు:
- పిక్కకండరాలను సాగదీయడం వలన కాళ్ళపిక్కల్లో తిమ్మిరినొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు
- కండరాల్ని నొక్కడం (మసాజ్)వల్ల నొప్పిని తగ్గించగలదు
- నీటిని దండిగా తాగడంవల్ల కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది
- క్రమమైన (రెగ్యులర్) వ్యాయామం కండరాలు మరియు కీళ్లలో బిగుతుదనాన్ని (stiffness) తగ్గిస్తుంది, తద్వారా కండరాల తిమ్మిరిని తగ్గించుకుని రుగ్మతని మెరుగుపరుచుకోవచ్చు.
- రక్త ప్రసరణను మెరుగుపరచుకోవడానికి స్టాకింగ్స్ వాడవచ్చు.
- మీ కాళ్ళను వాలుగా (inclined) ఉంచడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు
- ఉపరితలంగా వేడికాపడం పెట్టడంవల్ల ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది