హైపోపారాథైరాయిడిజం అంటే ఏమిటి?
పారాథైరాయిడ్ గ్రంధులు మెడలో థైరాయిడ్ గ్రంధికి సమీపంలో ఉండే నాలుగు చిన్న గ్రంథాలు. ఇవి శరీరంలో కాల్షియం మరియు ఫాస్పరస్ స్థాయిలను నియంత్రించడానికి మరియు నిర్వహించడానికి పారాథైరాయిడ్ హార్మోన్ను స్రవిస్తాయి. పారాథైరాయిడ్ గ్రంధులు పారాథార్మోన్ను తక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు హైపోపారాథైరాయిడిజం సంభవిస్తుంది. ఇది రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గడానికి (హైపోకెల్సిమియా) మరియు సీరం ఫాస్పరస్ స్థాయిలు పెరగడానికి (హైపెర్ఫాస్ఫేటమియా) దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హైపోపారాథైరాయిడిజం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గడం వలన సంభవిస్తాయి.
- తేలికపాటి నుండి మధ్యస్థ హైపోపారాథైరాయిడిజం యొక్క లక్షణాలు:
- జలదరింపు సంచలనాలు.
- కాలి వేళ్ళలో, చేతి వేళ్ళలో మరియు పెదాల చుట్టూ తిమ్మిరి మరియు పారెస్టెషీసియా (paraesthesia, ఒక అసాధారణ సంచలనం).
- కండరాల నొప్పులు.
- బలహీనత.
- తలనొప్పి.
- ఆందోళన లేదా భయము.
- పొడిబారిన మరియు గరుకు చర్మం.
- జుట్టు రాలుట.
- గోర్లు పెళుసుగా మారడం.
- డిప్రెషన్.
- తీవ్ర రుగ్మతని సూచించే లక్షణాలు:
- లారీగోస్పాస్మ్ (laryngospasm, స్వర నాళికల [vocal cords] యొక్క బిగుతుదనం/సంకోచం) లేదా బ్రోన్కోస్పాస్మ్ (bronchospasm, బ్రోన్కి, ఊపిరితిత్తులగోడలు యొక్క బిగుతుదనం/సంకోచం) వంటి వాటికి దారితీసే కండరాల బిగుతుదనం/సంకోచం
- కండరాల తిమ్మిరి
- దీర్ఘకాలిక హైపోపారాథైరాయిడిజం విషయంలో సంభవించే అసాధారణ లక్షణాలు:
- ఎనామెల్ హైపోప్లాసియా అని పిలిచే పళ్ళ (teeth) అభివృద్ధిలో అసారధాణతలు. ఇవి పిల్లలలో సంభవిస్తాయి.
- పంటి మూలాలు (tooth roots) సరిగ్గా ఏర్పడకపోవడం.
- పంటి కావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- బొంగురు గొంతు.
- శ్వాసలో గురక.
- డిస్ఆప్నియా (శ్వాసఅందకపోవడం).
- మూర్చ.
- స్పృహ కోల్పోవడం.
- కార్డియాక్ అరిథ్మియాస్ (హృదయ స్పందనలో అసాధారణతలు - చాలా వేగంగా, చాలా నెమ్మదిగా, లేదా క్రమరహితంగా హృదయ స్పందనలు ఉండడం).
- కళ్ళు మసక లేదా కంటిశుక్లాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పారాథైరాయిడ్ గ్రంథులు పారాథైరాయిడ్ హార్మోన్ను తక్కువగా స్రావించడం కారణంగా హైపోపారాథైరాయిడిజం ఏర్పడుతుంది.
- సాధారణ కారణాలు:
- థైరాయిడ్ లేదా మెడ శస్త్రచికిత్స సమయంలో పారాథైరాయిడ్ గ్రంధులకు గాయం ఏర్పడడం లేదా వాటిని తొలగించడం.
- ఇతర కారణాలు:
- హైపర్ థైరాయిడిజం కోసం రేడియో యాక్టీవ్ అయోడిన్ థెరపీని (radioactive iodine therapy) చేస్తున్నప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్కు హాని కలగడం .
- డిజార్జి సిండ్రోమ్ (DiGeorge syndrome), అడ్రినల్ హార్మోన్ ఇన్సఫిసియెన్సీ (adrenal hormone insufficiency) లేదా ఆడిసన్స్ వ్యాధి (Addison's disease) వంటి క్రోమోజోముల (జన్యు పదార్ధాలను కలిగి ఉన్న నిర్మాణాలు) రుగ్మతలతో ముడిపడి ఉండే కొన్ని వ్యాధుల వలన కూడా ఇది సంభవించవచ్చు.
- సీరం మెగ్నీషియం స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉండడం.
- పారాథైరాయిడ్ గ్రంధులను ప్రభావితం చేసే ఆటోఇమ్యూన్ వ్యాధులు (వ్యక్తి యొక్క సొంత రోగనిరోధక వ్యవస్థ శరీర కణాలు మరియు కణజాలం మీద దాడి చేసే ఒక వ్యాధి).
- పుట్టినప్పటి నుండి పారాథైరాయిడ్ గ్రంధులు లేకపోవడం (పుట్టుకతో వచ్చిన హైపోపారాథైరాయిడిజం).
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ లక్షణాలు, సంకేతాలు, వివరణాత్మక ఆరోగ్య చరిత్ర, మరియు క్షుణ్ణమైన వైద్య పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది.
పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:
- కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మరియు క్రియాటినిన్ స్థాయిలను పరిశీలించడానికి రక్త పరీక్షలు.
- పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్ష.
- కాల్షియం విసర్జన (excretion) అంచనా కోసం మూత్ర పరీక్ష.
- కంటిశుక్లాల తనిఖీ కోసం కంటి వైద్య పరీక్ష మరియు హృదయ లయల తనిఖీ కోసం ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) ను కూడా సూచించవచ్చు.
చికిత్సలో లక్షణాలు నుండి ఉపశమనం మరియు ఎముకలు మరియు రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ స్థాయిలు సంతులనాన్ని పునరుద్ధరించడం ఉంటాయి. ఇతర చికిత్స విధానాలలో ఇవి ఉంటాయి:
- కాల్షియం మరియు విటమిన్ D కోసం ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) ప్రత్యామ్నాయాలు మరియు మందులు సూచించబడతాయి.
- పారాథైరాయిడ్ హార్మోన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు.
- తీవ్ర సందర్భాల్లో, ఇంట్రావీనస్ (నరాలలోకి) ఇంజెక్షన్ల ద్వారా కాల్షియం ఎక్కించబడుతుంది.
- తీవ్రమైన సందర్భాల్లో ముఖ్యమైన శరీర సంకేతాల పర్యవేక్షణ (రక్తపోటు, హృదయ స్పందన రేటు, శ్వాస రేటు మరియు శరీర ఉష్ణోగ్రత) మరియు హృదయ లయ పర్యవేక్షణ అవసరం.