మెగ్నీషియం లోపం అంటే ఏమిటి?
మెగ్నీషియం లోపం అంటే శరీరంలో మెగ్నీషియం స్థాయిలు సాధారణ స్థాయిల కంటే తక్కువగా ఉండడం, ఇది హైపోమాగ్నేసెమియా (hypomagnesaemia) కు దారితీస్తుంది. మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం, ఇది దాదాపు అన్ని శరీర కణజాలాలకు, ముఖ్యంగా నరములు అవసరం. మెగ్నీషియం లోపం బోలు ఎముకల వ్యాధి ఉన్న మహిళల్లో మెనోపాజ్ తర్వాత సర్వసాధారణంగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- మెగ్నీషియం లోపం యొక్క ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు:
- మధ్యస్థమైన మరియు తీవ్రమైన మెగ్నీషియం లోపాన్ని సూచించే సంకేతాలు మరియు లక్షణాలు:
- కాళ్లలో తిమ్మిరి మరియు జలదరింపుగా అనిపించడం.
- కండరాల సంకోచం మరియు తిమ్మిరి.
- మూర్ఛలు మరియు వణుకు.
- హైపోకలేమియా (తక్కువ పొటాషియం స్థాయిలు), హైపోక్యాలసీమియా (తక్కువ కాల్షియం స్థాయిలు), మరియు సోడియం నిలుపుదల (sodium retention).
- ప్రవర్తనలో మార్పులు మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.
- కార్డియాక్ అరిథ్మియాలు (అసాధారణ హృదయ స్పందనను కలిగించే కొన్ని సమస్యలు).
- కొరోనరీ స్పాసమ్స్ (Coronary spasms, హృదయ ధమనుల [ఆర్టరీల] గోడల కండరాలు బిగుతుగా [గట్టిగా] మారడం).
- టేటనీ (చేతి వేళ్లు మరియు కాలి వేళ్ళ యొక్క కండరాలు బిగుతుగా [గట్టిగా] మారే పరిస్థితి).
మెగ్నీషియం లోపం హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు), ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు, గ్లూకోజ్ హోమియోస్టాసిస్ (సంతులనం) లో మార్పులు, బోలు ఎముకల వ్యాధి (ఎముకలు పెళుసుగా మరియు బలహీనంగా మారడానికి కారణమయ్యే ఒక ఎముక ఖనిజాల యొక్క రుగ్మత), క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ మరియు పార్శ్వపు తలనొప్పి వంటి వాటితో కూడా ముడిపడి ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మెగ్నీషియం లోపం అరుదుగా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వలన సంభవిస్తుంది. ఐతే ఇది సాధారణంగా ఇతర సమస్యలతో ముడిపడి ఉంటుంది.
మెగ్నీషియం లోపం యొక్క కారణాలు వీటిని కలిగి ఉంటాయి:
- ఇది తరచూ టైప్ II మధుమేహం మరియు క్రోన్స్ వ్యాధి, పెద్దప్రేగు పుండ్లు , సెలియాక్ వ్యాధి, షార్ట్ బౌల్ సిండ్రోమ్, మరియు విపిల్స్ వ్యాధి వంటి జీర్ణాశయ రుగ్మతలతో ముడిపడి ఉంటుంది.
- హార్మోన్ల రుగ్మతలు మరియు మూత్రపిండాలు (రీనల్) వ్యాధులు.
- మద్య దుర్వినియోగం.
- గ్యాస్ట్రోఇంటెస్టినల్ అల్సర్స్ మరియు రిఫ్లక్స్ వ్యాధులకు తీసుకునే మందుల యొక్క దీర్ఘకాల వినియోగం.
- కెమోథెరపీటిక్ ఏజెంట్లు, డైయూరేటిక్లు మరియు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వంటి మందులు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆరోగ్య చరిత్ర మరియు భౌతిక పరీక్షలతో పాటు, వైద్యులు రక్త మెగ్నీషియం స్థాయిలను కూడా తనిఖీ చేస్తారు .
సాధారణ మెగ్నీషియం స్థాయిలు 1.3 నుండి 2.1 mEq / L (0.65 నుండి 1.05 mmol / L) వరకు ఉంటాయి.
రోగ నిర్ధారణకు అవసరమైన ఇతర పరీక్షలు:
- మూత్ర మెగ్నీషియం పరీక్ష (Urine magnesium test).
- కంప్రెహెన్సివ్ మెటబోలిక్ ప్యానెల్ ( Comprehensive metabolic panel, ఎలెక్ట్రోలైట్స్, మూత్రపిండాలు మరియు కాలేయ పనితీరు, రక్త గ్లూకోజ్ మరియు రక్తంలో యాసిడ్ / బేస్ సంతులనం వంటి పరీక్షలు).
- వ్యక్తి లక్షణాలు పై ఆధారపడి, వైద్యులు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) ను కూడా ఆదేశించవచ్చు.
మెగ్నీషియం లోపం యొక్క చికిత్సలో ఇవి ఉంటాయి:
- ఓరల్ (నోటి ద్వారా తీసుకునే)మెగ్నీషియం సప్లిమెంట్లు.
- ఇంట్రావీనస్ గా మెగ్నీషియంను అందిచడం (Intravenous magnesium supplementation).
- మెగ్నీషియం ప్రత్యామ్నాయాలను రోజుకు 600mgల కనీస మోతాదుతో ప్రారంభించడం.
- నరాల (ఇంట్రావెన్సు లేదా IV) ద్వారా ద్రవాలు ఎక్కించడం.
- లక్షణాల ఉపశమనం కోసం మందులు.
- ముఖ్యంగా, అంతర్లీన కారణాన్ని అంచనా వేసి, చికిత్స అందించడం.