కొలెస్ట్రాల్ - High Cholesterol in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 21, 2018

March 06, 2020

కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్

సారాంశం

శరీరములో, కొవ్వును కాలేయము కొలెస్ట్రాల్ లేదా లిపిడ్ రూపములో ఉత్పత్తి చేస్తున్నది. శరీరమునకు కావలసిన రోజువారీ కొలెస్ట్రాల్ అవసరములు గుడ్డు పచ్చసొన, పాలు మరియు మాంసము మొదలగు వాటి ద్వారా నేరవేరుతున్నది.  శరీరములోని అనేక జీవసంబంధ విధుల కొరకు తగినంత మోతాదులలో కొలెస్ట్రాల్ అవసరము. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరోన్, కర్టిసోల్, మరియు ఆల్డోస్టెరోన్ మొదలగు హార్మోన్ల ఉత్పత్తికి ఇది అవసరము. మరియు, కొవ్వుల సరైన జీర్ణక్రియ కొరకు అవసరమయిన బైల్ లవణములు కొలెస్ట్రాల్ నందు కలవు.  ఇది విటమిన్ A, D, E మరియు K లను శరీరమునకు పట్టునట్లు చేయును. అంతేకాక, కణములలో ఇది ఒక ముఖ్యమైన భాగముగా ఉండి సెల్యులార్ నిర్మాణమును నిర్వహించుటకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ సహాయంతో సూర్యకాంతిలో, శరీరములో విటమిన్ D తయారు అవుతుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రోటీన్లు (లిపోప్రొటీన్లతో కలిపి) తో కలిసి ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ - HDL) గుండెకి  రక్షణ కలిగిస్తుంది, కాని చెడు కొలెస్ట్రాల్ అధికంగా (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ - LDL మరియు చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ - VLDL) గుండెకి వ్యాధుల ప్రమాదాన్ని పెంచవచ్చును.

శరీరములో అధికముగానున్న చెడు కొలెస్ట్రాల్ గుండె నొప్పి లేదా ఆంజినా, గుండెపోటు, స్ట్రోక్ మరియు మధుమేహ వ్యాధికి కారణమవ్వచ్చు. కొవ్వు అధికంగా ఉన్న ఆహారం, ఊబకాయము మరియు ఎప్పుడూ కూర్చొని పని చేయుట శరీరములో పెరిగే కొలెస్ట్రాల్ స్థాయిలకి ప్రధాన కారణాలు. రక్తంలోని అధిక కొలెస్ట్రాల్ రక్తనాళాల లోపల ఫలకము ఏర్పడుటకు  ప్రధాన కారణము, ఇది వివిధ రకాల హృదయనాళ (గుండె) వ్యాధుల వలన ఏర్పడుతుంది. అధిక రక్తపోటు, ధూమపానము మరియు ఊబకాయము గుండె వ్యాధుల ప్రమాదమును మరింత ఎక్కువ చేస్తాయి. కొంతమందిలో, వారసత్వ కారణముగా జన్యువులు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలని కలిగి ఉంటాయి. జీవన శైలిలో మార్పులతో, అనగా సరి అయిన బరువును సాధించుట, వేయించిన మరియు కొవ్వు పదార్ధాల వినియోగము పరిమితం చేయుట మరియు ధూమపానము మానటము వంటివి అధిక కొలెస్ట్రాల్ నిర్వహణ లో ముఖ్యమైన అంశములు. అదనముగా, ఇతర ఔషధాలతో స్టాటిన్స్ అని పిలువబడే మందులు సాధారణంగా తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుపుతాయి.

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? - What is high Cholesterol level in Telugu

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను చెప్పుకోతగ్గ ఆరోగ్య సమస్యగా చెప్పవచ్చును, ఎందుకనగా అది వివిధ వ్యాధుల ప్రమాదస్తాయిని ముఖ్యముగా గుండె మరియు రక్త ప్రసరణకు సంబంధించిన వాటిని పెంచుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్ గుండెపోటు లేక గుండెనొప్పి ప్రమాద స్తాయిలను పెంచుతూ అలాగే దానికి సంబంధించిన మెదడుకు రక్త సరఫరాను దెబ్బతీయవచ్చును. భారతదేశ నివేదికలను బట్టి, 25% నుండి 30% పట్టణ మరియు పట్టణ సరిహద్దుల ప్రజలు 15% నుండి 20% గ్రామీణ ప్రజలకన్నా, అధిక రక్త కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. దగ్గరగా ఉన్న అధిక LDL, తక్కువ HDL, మరియు ట్రైగ్లిజరైడ్స్ భారతీయ జనాభాలో తరచుగా ఎక్కువగా గుర్తించబడుతున్నాయి.

కొలెస్ట్రాల్ అనగా ఏమిటి?

కొలెస్ట్రాల్ అనేది కాలేయములో ఉత్పత్తి చేయబడిన ఒక కొవ్వు వంటి పదార్ధం. ఇది నీటిలో కరగకపోవుటవలన, కొలెస్ట్రాల్ ప్రధానంగా కొవ్వులను (లిపిడ్లుగా చెపుతారు) మరియు ప్రోటీన్లు, మరియు ఏవైతే లిపోప్రొటీన్ లుగా తెలుస్తున్నాయో. హార్మోన్ల ఉత్పత్తి వంటి అనేక ముఖ్యమైన విధులు శరీరములో నిర్వహించుటకు కొలెస్ట్రాల్ అవసరము, విటమిన్ ఎ, D, E మరియు K, వంటి కొవ్వు-కరిగించే విటమిన్లు తీసుకుంటాయి మరియు సెల్ నిర్మాణము మరియు నిర్వహణ. అయినాకూడా, రక్తములో కొలెస్ట్రాల్ స్తాయిలు సాధారణము కన్నా ఎక్కువగా పెరిగినప్పుడు, అది గుండె జబ్బులకి దారితీసి, గుండెపోటు మరియు స్ట్రోక్ రావచ్చును. అలాగే, ఈ అధికమైన కొలెస్ట్రాల్ రక్తనాళాలలో ఫలకాలుగా (కొవ్వు నిక్షేపాలుగా) ఏర్పడి మరియు వాటిని కష్టతరం చేయడానికి వివిధ పదార్థాలతో (కాల్షియం వంటివి) (అథెరోస్క్లెరోసిస్). ఇది రక్త సరఫరా సమస్యలకు దారితీస్తుంది, దీనివల్ల వివిధ శరీర అవయవాలకు తగినంత రక్తం సరఫరా జరగదు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

కొలెస్ట్రాల్ యొక్క చికిత్స - Treatment of High Cholesterol in Telugu

ఈ క్రింది పరిస్థితుతలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను  తగ్గించుటకు మందులు తప్పనిసరి:

  • జీవనశైలి మరియు ఆహార మార్పులు కొలెస్ట్రాల్ స్థాయిలకి తక్కువగా ఉన్నప్పుడు.
  • గుండెపోటు సంఘటనలు.
  • చెడు కొలెస్ట్రాల్ (LDL) అధిక స్థాయిలో ఉండుట.
  • ఎక్కువగా గుండె జబ్బు ప్రమాదం ఉన్న 40-75 సంవత్సరాల మధ్య వయస్సు వారికి.
  • మధుమేహం లేదా ఇతర గుండె వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకి.

రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుటకు వివిధ విధములైన మందులని వాడతారు. వయస్సు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, గుండె వ్యాధులు లేదా స్ట్రోక్ వృద్ధి చెందే స్తాయిని బట్టి మీ డాక్టర్ మీకు తగిన మందులని నిర్ణయిస్తారు. మందులు వీటితో కలిసి ఉంటాయి:

  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించే స్టాటిన్స్ సాధారణంగా ఉపయోగిస్తారు.
  • కాలేయములో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని స్టాటిన్స్ ఆపుతుంది.
  • PCSK9 (ప్రోప్రోటేన్ కన్వర్టేస్ సబ్టిలిసిన్ / కేక్సిన్ టైప్ 9) అనే మందులు  కాలేయంపై పనిచేసి రక్తం నుండి LDL ను తొలగించడానికి సహాయపడతాయి. అవి రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ తగ్గించుటలో కూడా సహాయపడతాయి.
  • బైల్ యాసిడ్ సీక్వెస్ట్రేట్స్ బైల్ యాసిడ్స్ పై వాటి చర్యలతో రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
  • నియాసిన్ (విటమిన్ B3 లేదా నికోటినిక్ యాసిడ్) చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది.
  • అతి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (VLDL) ను ఫైబ్రేట్లు రక్తం నుండి తీసివేస్తాయి. అవి HDL స్థాయిని కూడా పెంచుతాయి. అయితే, స్టాటిన్స్ వాడినప్పుడు, ఫైబ్రేట్ల వలన కండరాలకు సంబంధించిన సమస్యలు కలుగవచ్చును.
  • ఎజ్టిమీబీ ఆహారములోని కొలెస్ట్రాల్ ను తీసుకోనకుండా నిరోధిస్తుంది.
  • లోమిటాపైడ్ మరియు మిపోమర్సెన్ రక్తము ద్వారా కాలేయం నుండి VLDL కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది. వారసత్వ జన్యువుల కారణముగా అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉన్న రోగులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు.
  • లిపోప్రొటీన్ అఫెరిస్ అనే ఒక ప్రక్రియలో శరీరమునకు బయట ఉంచిన ఫిల్టరింగ్ మిషన్ ద్వారా రక్తములో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తీసివేస్తుంది. ఇది సాధారణంగా వారసత్వముగా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే రోగులకు ఉపయోగిస్తారు.

జీవనశైలి నిర్వహణ

జీవనశైలిలో మార్పులు అనునది అధిక కొలెస్ట్రాల్ నిర్వహణలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. మీ కొలెస్ట్రాల్ ను సరిచేసుకోనుటకు కొన్ని ముఖ్యమైన జీవనశైలి మార్పులు.

  • ఆహార మార్పులు
    • విశేషమైన జీవనశైలి అని పిలిచే ఒక ఉద్దేశము రక్తములోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుటలో సహాయపడుతుంది. ఈ విధమైన ఆహార ప్రణాళిక ప్రకారము, ఈ ఆహార చిట్కాలు అనుసరించవలసి ఉంటుంది:
    • పూర్తీ కొవ్వు (మాంసము, పాల ఉత్పత్తులు, బాగా వేయించిన ఆహారాలు ఇతర వాటితో) మీ రోజువారీ కేలరీల అవసరాలలో 7% గా ఉండాలి మరియు మొత్తంమీద మీ రోజువారీ కేలరీల మొత్తం క్రొవ్వు అవసరానికి 35% గరిష్టంగా ఉండాలి.
    • 200 గ్రాముల కొలెస్ట్రాల్ ఆహారమును రోజువారీగా తినవచ్చును.
    • ఆహారం తృణధాన్యాలు, పండ్లు మరియు అపరాలు (ఉదాహరణకు: వోట్స్, ఆపిల్స్అరటిపండ్లు, బేర్స్, నారింజపండ్లు, కిడ్నీ బీన్స్, కందులు, శనగలు). నీటిలో కరిగే పీచుతో ఉన్న కూరగాయలు మరియు పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
    • చేపలు గుండె జబ్బులకి మరియు గుండెపోటు నుండి రక్షణని ఇచ్చే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు ముఖ్య కారణము.
    • పరిమితముగా ఉప్పు మరియు పరిమితముగా ఆల్కహాల్ తీసుకొనుట రక్తములో రక్తపోటు మరియు ట్రైగ్లిజరైడ్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది.
  • శారీరక శ్రమ
    క్రమ పద్దతిలో చేయు ఏరోబిక్ వ్యాయామములు అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుటలో మరియు ఊబకాయ నిర్వహణలో కూడా సహాయపడతాయి.
  • సిగరెట్ మానివేయుట
    సిగరెట్ అలవాటును పూర్తిగా మానివేయుట కొలెస్ట్రాల్ నిర్వహణలో బాగా పనిచేస్తుంది.
  • మందులను ఉపయోగించుట
    ప్రభావవంతమైన కొలెస్ట్రాల్ నియంత్రణ కొరకు డాక్టరుచే సూచించబదిన మందులను తీసుకోవాలి.
  • కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారము
    కొన్ని రకములైన ఆహారములు కొలెస్ట్రాల్ స్తాయిలని స్తిరముగా ఉంచుటలో సహాయపడతాయి ఓట్స్ తో కలిపి అవి, బార్లీ, బీన్స్, (కిడ్నీ బీన్స్, చిక్పీస్, కాయధాన్యాలు.), వంగ మొక్క, ఓక్రా  (బెండ కాయ), గింజలు (అల్మొండ్స్వాల్నట్స్వేరుశెనగ), వేరుశనగ నూనె (పొద్దుతిరుగుడు నూనె, కుసుంభ నూనె), పండ్లు (సిట్రస్ పండ్లు, ఆపిల్స్, ద్రాక్ష), ఆహారములు స్టెరాల్స్ మరియు స్టెనాల్స్ ను కలిగి ఉన్నాయి (మొక్కల చిగుళ్ళు ఆహారములోని కొలెస్ట్రాల్ ను పీల్చుకునే), సోయా (టోఫు, సోయ్ పాలు), చేపలు (సాల్మొన్, మాకేరెల్), ఫైబర్ అనుబంధాలు విరోచనకారిగా గుర్తించారు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW


వనరులు

  1. Huff T, Jialal I. Physiology, Cholesterol. [Updated 2019 Mar 13]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cholesterol Medicines.
  3. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. High cholesterol: Overview. 2013 Aug 14 [Updated 2017 Sep 7].
  4. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; High Blood Cholesterol
  5. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Carotid Artery Disease
  6. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Peripheral Artery Disease
  7. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Stroke
  8. Health Harvard Publishing, Updated: February 6, 2019. Harvard Medical School [Internet]. 11 foods that lower cholesterol. Harvard University, Cambridge, Massachusetts.
  9. Srinivasa Rao Ch., Emmanuel Subash Y. The Effect of Chronic Tobacco Smoking and Chewing on the Lipid Profile. J Clin Diagn Res. 2013 Jan; 7(1): 31–34. PMID: 23449989
  10. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cholesterol Levels.
  11. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cholesterol Medicines

కొలెస్ట్రాల్ కొరకు మందులు

Medicines listed below are available for కొలెస్ట్రాల్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for కొలెస్ట్రాల్

Number of tests are available for కొలెస్ట్రాల్. We have listed commonly prescribed tests below: