సారాంశం
హెపటైటెస్ – బి కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది హెపటైటెస్ – బి వైరస్ ( హెచ్ బి వి) కారణంగా వస్తుంది. ఈ జబ్బు రెండు రకాలుగా ఉంటుంది. అవి అక్యూట్ ( తీవ్రమైన సంక్రమణం) ఇన్ఫెక్షన్ . ఇది అకస్మాత్తుగా ఎదురవుతుంది. చికిత్స జరిపితే తక్కువ వ్యవధిలో నయమవుతుంది) మరొకటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ . ఒకసారి ఇన్ఫెక్షన్ చేరితే అది శరీరంలో ద్రవాలలో మరియు స్రావములలో నిలిచిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో హెచ్ బి వి ప్రధానంగా అరక్షిత లైంగిక చర్యల ద్వారా మరియు ఇంట్రావెనస్ మందుల ద్వారా సోకుతుంటుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పులు, పొత్తికడుపులో అసౌకర్యం, శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారాలు, తర్వాత చర్మం మరియు కళ్లు కామెర్ల కారణంగా పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కామెర్లు హెచ్చయితే వమనాలు మరియు డయారియా ప్రబలుతాయి.
దీర్ఘకాలిక హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ కాలేయమును పాడుచేస్తుంది. పైగా లీవర్ కేన్సర్ కు దారి తీస్తుంది. తీవ్రమైన హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ కు సాధారనంగా హెచ్చు మోతాదులో విశ్రాంతి, హెచ్చు స్థాయిలో ద్రవ రూపంలోని ఆహారం సేవించడం, ఆరోగ్యకరమైన ఆహారం సేవించడం మంచిది. దీర్ఘకాలిక హెపటైటెస్ బి కు కాలేయం జబ్బు లక్షణాలకు క్రమంగా సరిచూసుకోవడం అవసరం. అవసరమైతే మౌఖికంగా తీసుకొనే అంటివైరల్ ఔషధాలను సేవించాలి. ఒక మారు ఆంటి వైరల్ మందులు ప్రారంభిస్తే జబ్బుమనిషి జీవిత పర్యంతం మందులను వాడుతూ ఉండాలి. చికిత్స కొనసాగించకపోతే హెచ్ బి వి ఇన్ఫెక్షన్ లీవరు ను చేరుకొని లీవర్ కేన్సరుకు దారితీస్తుంది