కడుపులో ఇన్ఫెక్షన్ (గ్యాస్ట్రోఎన్టీరైటిస్) అంటే ఏమిటి?
కడుపులో ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా లేదా వైరస్ల వలన కలుగవచ్చు మరియు అవి జీర్ణాశయ గోడలు (లైనింగ్), ముఖ్యంగా కడుపు మరియు ప్రేగుల వాపుకు దారితీస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- బాక్టీరియా మరియు వైరస్ల వలన సంభవించే కడుపు సంక్రమణల (ఇన్ఫెక్షన్ల) యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- జ్వరం
- బరువు తగ్గడం
- ఆకలి తగ్గుదల
- వాంతులు
- వికారం
- తిమ్మిరితో కూడిన కడుపు నొప్పి
- మలంలో రక్తం లేదా అతిసారం
- తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్ ఉన్నపుడు, కలిగే సంకేతాలు మరియు లక్షణాలు:
- చలి లేదా చెమటలు
- చర్మం జిడ్డుగా మారడం
- కీళ్లు బిగుతుగా మారడం లేదా కండరాల నొప్పి
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వైరస్లు (రోటవైరస్, నర్వాక్ (Norwalk) వైరస్, మొదలైనవి) లేదా వ్యాధికారక బాక్టీరియాతో కలుషితమైన ఆహారం లేదా నీటి యొక్క వినియోగం వలన కడుపు ఇన్ఫెక్షన్లు సంక్రమించవచ్చు. ఇతర కారణాలు వీటిని కలిగిఉంటాయి:
- కలుషితమైన ఆహారం మరియు నీటిని తాకడం (కాంటాక్ట్)
- ప్లేట్లు మరియు పాత్రలు వంటి కలుషిత వస్తువులను తాకడం (కాంటాక్ట్)
- ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో వస్తువులను పంచుకోవడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- రోగ నిర్ధారణ ప్రధానంగా సంక్రమణ (ఇన్ఫెక్షన్) యొక్క లక్షణాలు మరియు డీహైడ్రేషన్ సంకేతాలు ఆధారంగా వైద్యునిచే నిర్దారించబతుంది, వాటిలో ఇవి ఉంటాయి:
- పొడిబారిన లేదా జిగటగా ఉండే నోరు
- అల్ప రక్తపోటు
- అధిక గాఢత ఉండే మూత్రం (ముదురు పసుపు మూత్రం) లేదా తక్కువగా/అసలు గాఢత లేని మూత్రం
- కళ్ళు లోతులకు పోవడం మరియు ఫాంటనెల్స్ ([fontanelles] శిశువుల తల పైన మృదువైన మచ్చలు)
- కన్నీళ్లు లేకపోవడం
- బద్ధకం లేదా కోమా (తీవ్రమైన డీహైడ్రేషన్ ఉన్న సందర్భంలో)
- పూర్తి రక్త గణన (CBC,complete blood count) పరీక్ష చేయవచ్చు, ఇది తెల్ల రక్త కణాలను (WBCs) కొలుస్తుంది . తెల్ల రక్త కణాల పెరుగుదలను సంక్రమణను (ఇన్ఫెక్షన్) సూచిస్తుంది.
- ఒక సాధారణ మల పరీక్ష లేదా మల సాగును కూడా సూచించవచ్చు (బాక్టీరియల్ సంక్రమణ ఉన్నపుడు).
కడుపు ఇన్ఫెక్షన్ చికిత్సలో ఇవి ఉంటాయి:
- అతిసారం నిర్వహణకు:
- వికారం మరియు వాంతులతో కలిపి అతిసారం ఉంటే కనుక ద్రవాలు తీసుకుంటే వాటిని శరీరం సహించలేదు (తట్టుకోలేదు), అందువల్ల సిర ద్వారా (ఇంట్రావీనస్: ఐవి) ద్రవాలను ఎక్కించడం అవసరం.
- డైయూరిటిక్స్ లేదా యాంజియోటెన్సిన్- కన్జర్వింగ్ ఎంజైమ్ (angiotensin-converting enzyme) ఇన్హిబిటర్స్ వంటి అధిక రక్తపోటు మందులను ఉపయోగించే రోగులకు వారి కడుపు ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ తాత్కాలికంగా ఈ మందులను ఆపమని మరియు ఇన్ఫెక్షన్ మెరుగైన తర్వాత తిరిగి ప్రారంభించమని వైద్యులు సలహా ఇస్తారు, .
- డీహైడ్రేషన్ నిర్వహణకు:
- ఎల్ట్రోలైట్ మరియు ద్రవ ప్రత్యామ్నాయ చికిత్సలు లేదా ఫ్రీజర్ పాప్స్ (freezer pops) యొక్క ఉపయోగం అనేవి డీహైడ్రేషన్ను సరిచేయడానికి సిఫారసు చేయబడతాయి.
- డ్రింకులు, పండ్ల రసాలను మరియు సోడాలను నివారించాలి.
- అధిక మొతాదులలో ద్రవ పదార్ధాలను తీసుకోవడం మానివేయాలి, బదులుగా చిన్న చిన్న మొతాదులలో ద్రవ పదార్ధాలను తీసుకోవాలి.
- శిశువులలో కడుపు ఇన్ఫెక్షన్ ఉన్నపుడు, డిహైడ్రేషన్ను తనిఖీ చేయటానికి శిశువు యొక్క డైపర్లను దగ్గరగా పరిశీలించాలి (సాధారణ మూత్రం విసర్జన కంటే తక్కువ విసర్జన లేదా తడి తక్కువగా ఉండే డైపర్లు).
- వికారం మరియు వాంతులు నిర్వహణ: భారీ భోజనాన్ని నివారించాలి మరియు పెరుగు, అరటిపండ్లు, తాజా ఆపిల్ పళ్ళు, ఉడకబెట్టిన కూరగాయలు, తృణధాన్యాలు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, తక్కువ మోతాదులో మాంసం మరియు రొట్టె వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా విరామం తీసుకుంటూ తినడానికి ప్రయత్నించాలి.
- బాగా విశ్రాంతి తీసుకోవడం.
- తీవ్ర విరేచనాలు ఉన్నపుడు లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు వారికి బాక్టీరియల్ సంక్రమణ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి. యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్లకు పనిచేయవు.
- జ్వరాన్ని నియంత్రించడానికి యాంటిపైరెటిక్ మందులు.
- విరేచనాలని తగ్గించడానికి లేదా ఆపడానికి మందులను వైద్యుని సలహాతో మాత్రమే తీసుకోవాలి.