చేయి విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
చేయి విరగడం అంటే చేతి యొక్క ఎముకలు అనగా మణికట్టు, అరచేయి లేదా వేళ్ళి ఎముకలలో చీలిక లేదా పగులు ఏర్పడడం, ఎముకలు వంటివి. అరచేతికి సంభందించిన ఎముకలు (Metacarpal bones) చేతి మణికట్టు మరియు వేళ్ళ ఎముకలకు మధ్యన ఉంటాయి. సాధారణంగా కనిపించే చేతి ఫ్రాక్చర్ బాక్సర్స్ ఫ్రాక్చర్ (boxer’s fracture), ఇది 5 వ మెటాకార్పల్ ఎముక యొక్క ఫ్రాక్చర్. చేతి ఎముకలు ఒక క్రమమైన నిర్దిష్టతతో ఉంటాయి; అందువల్ల, చేతి ఫ్రాక్చర్లు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో కష్టాన్ని కలిగిస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చేతి ఫ్రాక్చర్ల యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
చేతి ఫ్రాక్చర్ల ఇతర సంకేతాలు మరియు లక్షణాలు:
- చేయి, వేళ్లు లేదా మణికట్టు యొక్క కదలికలో అసౌకర్యం మరియు కఠినత.
- చేయి ఆకృతి మారిపోవడం.
- పిడికిలికి ఫ్రాక్చర్ అయినప్పుడు గుంటపడినట్టు లేదా అణిగినట్టు కనిపించడం.
మణికట్టు ఫ్రాక్చర్ యొక్క ముఖ్య లక్షణం తాత్కాలికంగా తగ్గిపోయే నొప్పి తర్వాత లోతైన, సున్నితత్వంతో కూడిన మొండి నొప్పిగా తిరిగి వస్తుంది ముఖ్యంగా మణికట్టు యొక్క మధ్య భాగాన ఒత్తిడి పడినప్పుడు అది ఎక్కువ అవుతుంది.
అరుదుగా సంభవించే లక్షణాలు:
- చేయి బిగుసుకుపోవడం లేదా చేతి వైకల్యం
- రక్తనాళం లేదా నరాలకు హాని కలుగడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
చాచిన/చాపి ఉంచిన చేతి మీద నేరుగా పడడం వల్ల చేతి ఫ్రాక్చర్ సంభవించవచ్చు.
ఇతర కారణాలు:
- వాహనం ప్రమాదాలలో నేరుగా తగిలిన గాయాలు లేదా చేతులు నలిగిపోవడం వలన తగిలిన గాయాలు.
- క్రీడా (స్పోర్ట్స్) గాయాలు, ప్రత్యేకంగా స్నోబోర్డింగ్ (snowboarding) ఆడేవారిలో, చేతి ఫ్రాక్చర్లు సంభవించే ప్రమాదం ఎక్కువ.
- బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) వంటి వ్యాధులు కూడా ఒక వ్యక్తికి ఫ్రాక్చర్లు అధికంగా సంభవించేలా చేస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
పరిస్థితి యొక్క లక్షణాల గురించి తెలుసుకోవడం మరియు విరిగిన ఎముక దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను జాగ్రత్తగా పరిశీలించడం అనేవి రోగ నిర్ధారణకి సహాయం చేస్తాయి.
వైద్యులు వ్యక్తి స్నాయువులు (tendons), చేతి దృఢత్వం మరియు చేతి పనితీరును కూడా పరిశీలిస్తారు.
పరిశోధనలలో ఇవి ఉంటాయి:
- పగులును గుర్తించడంలో ఎక్స్-రేలు ఉపయోగకరంగా ఉంటాయి మరియు దాని తీవ్రతను నిర్ధారించడానికి కూడా ఉపయోగపడతాయి.
- చికిత్స తర్వాత కూడా పగులుని పరిశీలించడానికి ఎక్స్-రేలు ఉపయోగకరంగా ఉంటాయి.
శస్త్రచికిత్స కానీ (లేని) చికిత్సలో వైద్యులు బద్దకట్టులు (స్ప్లింట్), కాస్ట్ (cast) లేదా బడ్డీ టేపింగ్ వంటివి ఉపయోగించి విరిగిన ఎముకలను మళ్ళి వాటి స్థానంలోకి చేర్చుతారు/ సరిచేస్తారు
లక్షణాల ఉపశమనం కోసం అనాల్జెసిక్స్ (నొప్పి నివారణలు) ను ఉపయోగిస్తారు.
చికిత్స ప్రారంభించిన సుమారు మూడు వారాల తరువాత బిగుతుదనాన్ని తొలగించడానికి సాగదీసే (Stretching) వ్యాయామాలను ప్రారంభించవచ్చు.
కొన్ని సందర్భాల్లో, విరిగిన ఎముకలను సరిచేయడానికి ఫ్రాక్చర్ జరిగిన భాగాన్ని తెరిచి శస్త్రచికిత్స చెయ్యవలసిన అవసరం ఉంటుంది. అవసరమైతే, మరలు (screws), వైర్లు లేదా ప్లేట్లు వంటి అదనపు చిన్న పరికరాలు ఎముకల సరైన అమరిక కోసం ఎముకలోకి అమర్చబడతాయి.