పాదములో అనెలు (అనెక్కాయ) అంటే ఏమిటి?
పాదములో అనెలు (అనెక్కాయ) లేదా కేవలం అనెక్కాయ, అనేది అధిక రాపిడి లేదా అధిక ఒత్తిడి వలన గట్టిబడిన చర్మ ప్రాంతం/భాగం. ఇది ఎక్కువగా పాదానికి సరిపడని పాదరక్షల వలన కానీ లేదా సరైన పాద సంరక్షణ తీసుకోనప్పుడు కానీ ఏర్పడవచ్చు. భారతదేశంలో గణాంకాల ప్రకారం 10.65 కోట్ల జనాభాకి 2.6 కోట్ల మందిలో ఈ పరిస్థితి ఉంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పాదములో అనెలు యొక్క లక్షణాలు కేవలం ప్రభావిత ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. ఆ లక్షణాలు:
- గట్టిబడిన చర్మం
- ప్రభావిత ప్రాంతం శంఖాకారంలో లేదా గుండ్రని ఆకారంలోకి మారడం
- నొప్పి
- ప్రభావిత ప్రాంతం తెలుపు, పసుపు, లేదా బూడిద రంగులోకి మారడం
- నడవడంలో కఠినత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పాదములో అనెలు ప్రధానంగా కాలుకి సరిపడని బూట్లు ఉపయోగించడం మరియు పాదాల అడుగున చర్మం అధికంగా రాపిడికి గురికావడం వలన ఏర్పడతాయి. ఎత్తు మడమలు ఉన్న చెప్పులు ఈ పరిస్థితిని క్లిష్టతరం చేస్తాయి. సుత్తి లేదా క్లా (claw) ఆకారపు కాలి వేళ్ళు వంటి వేళ్ళ అసాధారణతలు కూడా పాదములో అనెలకు కారణం కావచ్చు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
దీని నిర్ధారణ వైద్యులు లేదా పాదనిపుణులు (podiatrist) చేయవచ్చు. నిర్దారణలో పాదము యొక్క భౌతిక పరీక్ష మరియు రోగి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. పాదాలను పరిశీలించడం ద్వారా పాదములో అనెలను సులభంగా గుర్తించవచ్చు. రక్తపరీక్షలు లేదా ఇమేజింగ్ పరీక్షలు ఆనెల నిర్ధారణ కోసం లేదా చికిత్స కోసం అవసరం ఉండదు.
వైద్యులు స్క్రాపింగ్ (చిన్నచిన్న ముక్కలుగా వేరు చేయడం) చేసి గట్టిపడిన భాగాన్ని తొలగించడం ద్వారా ఈ పరిస్థితికి చికిత్స చేయవచ్చు. ఆనెల పునరావృతతను నివారించడానికి మధుమేహం వంటి కొన్ని అంతర్లీన సమస్యలను కూడా నిర్వహించడం అవసరం. పాదములో అనెల చికిత్సకు ఎటువంటి పెద్ద వైద్య చికిత్సలు లేవు, రాపిడి తగ్గించడానికి సరైన చెప్పులను/బూట్లను ఎంచుకోవడమే మంచి నివారణ మార్గం. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఎక్కువగా నొప్పి నివారణ మందులు సూచించబడతాయి.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- షూ మరియు పాదం యొక్క చర్మం మధ్య రాపిడిని తగ్గించడానికి గట్టి పాదరక్షలను/షూలు ధరించడం ఆపివేయాలి.
- ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన బూట్లను ధరించాలి, పాదరక్షలు లేకుండా ఎక్కడికీ వెళ్ళరాదు.
- కాలివేళ్ళ మధ్య ఉన్ని/పత్తిని ఉపయోగించడం వలన అది ప్రభావిత ప్రాంతానికి ఉపశమనాన్ని కలిగించగలదు.
- బాధిత కాలి వేలి చుట్టూ ఉండే నొప్పిని లేదా ఒత్తిడిని నివారించడానికి వేలి గోళ్ళను కత్తిరించాలి.
- వెచ్చని నీటి తొట్టెలో 20 నిమిషాల పాటు పాదాలను ఉంచి తర్వాత ఒక ప్యూమిస్ రాయితో పాదాలను రుద్దాలి.
- అనె మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మాయిశ్చరైజర్ ను పూయడం వలన అది చర్మాన్ని మృదువుగా చెయ్యడంలో సహాయం చేస్తుంది.
చివరిగా, పాదములలో అనెలు అనేవి సరైన జాగ్రత్తతో సులభంగా నిర్వహించగల ఒక పరిస్థితి.