ఫైబ్రోమైయాల్జియా - Fibromyalgia in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 01, 2018

July 31, 2020

ఫైబ్రోమైయాల్జియా
ఫైబ్రోమైయాల్జియా

ఫైబ్రోమైయాల్జియా అంటే ఏమిటి?

ఫైబ్రోమైయాల్జియా మొత్తం శరీరంలోని కండరాలను ప్రభావితం చేసే బాధాకరమైన పరిస్థితి. సాధారణంగా ఈ వ్యాధికి గురైన వ్యక్తులు ఈ వ్యాధిలేని వారికన్నా నొప్పిని మరింత ఎక్కువగా అనుభవిస్తారు. భారతదేశ ప్రజలలో, 0.5% నుండి 2% మంది దీని వలన ప్రభావితమయ్యారు. ఇది మహిళల్లో సాధారణం; పురుషులు కంటే దాదాపు 3-7 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

తరచుగా సంభవించే లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • పూర్తి శరీరంలో నొప్పి, సున్నితత్వం మరియు గట్టిదనం, ముఖ్యంగా కొన్ని భాగాలలో ఎక్కువగా ఉంటుంది
  • నీరసంగా అనిపించడం
  • సరిగ్గా నిద్రించలేకపోవడం
  • తీవ్రమైన తలనొప్పి
  • తీవ్రమైన ఋతుక్రమ సమయ నొప్పి
  • అవయవాల సంచలనాన్ని కోల్పోవడం లేదా జలదరింపు (tingling)
  • జ్ఞాపక శక్తి సమస్యలు
  • నిరాశగా అనిపించడం (మరింత సమాచారం: కుంగుబాటు లక్షణాలు)

ఈ పరిస్థితి యొక్క ప్రాబల్యం మగవారి కన్నా మహిళలలో ఎక్కువగా ఉంటుంది మరియు ప్రభావిత మహిళలు ఉదయం వేళా అలసట, మొత్తం శరీర నొప్పి, మరియు ప్రేగు మంట వ్యాధి (ఇర్రిటబిల్ బౌల్ సిండ్రోమ్) ను అనుభవిస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ సమస్యకి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియలేదు, అయినప్పటికీ జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని చెప్పబడింది. వారు ఇతరులకన్నా వేగంగా నొప్పి భావనను అనుభవిస్తారు. ఈ పరిస్థితిని కలిగించే ప్రేరేపకాలు ఈ విధంగా ఉండవచ్చు:

  • హార్మోన్ల మార్పులు
  • ఒత్తిడి స్థాయిలు
  • వాతావరణ మార్పులు

ఎలా నిర్ధారణ మరియు చికిత్స?

రోగ నిర్ధారణలో వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం ఉంటుంది, రోగిని సమస్య యొక్క తీవ్రత, సున్నితత్వ ప్రదేశం, ప్రేరేపకాలు మరియు ఇతర వివరాల గురించి ప్రశ్నించవచ్చు. లక్షణాలు తరచుగా సమస్యను స్పష్టంగా తెలియజేస్తాయి. శరీర నొప్పి మరియు అలసటకు కారణమయ్యే ఇతర సమస్య యొక్క సంభావ్యతను తొలగించటం  కోసం తప్ప, ప్రయోగశాల పరీక్షలు సాధారణంగా అవసరం ఉండదు. ఈ సమస్యను అర్థం చేసుకునేందుకు రోగికి సంవత్సరాలు పట్టవచ్చు. ఇతర వ్యాధుల సంభావ్యతను నిర్మూలించటానికి ప్రబింబనం (ఇమేజింగ్), ముఖ్యంగా ఎక్స్ - రేను జరుపవచ్చు.

చికిత్స సాధారణంగా మందుల మరియు మందుల రహిత పద్ధతుల యొక్క కలయికను కలిగి ఉంటుంది:

  • నొప్పి ఉపశమన మందులు
  • కండరాల బలం కోసం క్రమమైన వ్యాయామం
  • నిద్రను మెరుగుపరచే పద్ధతులు
  • యోగా, లేదా ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని నిర్వహించడం
  • డిప్రెషన్ లేదా ఆందోళనను  కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (cognitive behavioural therapy) ద్వారా నిర్వహించవచ్చు.

స్వీయ సంరక్షణ చిట్కాలు:

  • వ్యాయామం చేయడం మరియు ఎక్కువగా  శారీరక పనులు చేస్తూఉండడం వంటివి లక్షణాల నియంత్రణకు సహాయపడతాయి.
  • స్వీయ-సంరక్షణ శిక్షణా తరగతులు రోజువారీ కార్యకలాపాలోని  ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడతాయి.

ఇది జీవితకాలం పాటు ఒక తీవ్రమైన సమస్య కాబట్టి, సాధారణంగా లక్షణాల -ఉపశమన పద్ధతులు జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. వైద్యుణ్ణి క్రమముగా సంప్రదించడం మరియు ఈ సమస్య గురించి సలహాలు తీసుకోవడం అనేవి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వ్యాధి నియంత్రణకు సహాయపడతాయి.



వనరులు

  1. Office on women's health [internet]: US Department of Health and Human Services; Fibromyalgia
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fibromyalgia
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Fibromyalgia
  4. National Center for Complementary and Integrative Health [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Fibromyalgia: In Depth
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Fibromyalgia

ఫైబ్రోమైయాల్జియా వైద్యులు

Dr. Manoj Kumar S Dr. Manoj Kumar S Orthopedics
8 Years of Experience
Dr. Ankur Saurav Dr. Ankur Saurav Orthopedics
20 Years of Experience
Dr. Pritish Singh Dr. Pritish Singh Orthopedics
12 Years of Experience
Dr. Vikas Patel Dr. Vikas Patel Orthopedics
6 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఫైబ్రోమైయాల్జియా కొరకు మందులు

Medicines listed below are available for ఫైబ్రోమైయాల్జియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.