సారాంశం
రతి క్రీడలో పురుషుడి అంగం (శిశ్నము) గట్టిపడకపోవడమనే సమస్యనే “అంగస్తంభన వైఫల్యం” గా పరిగణిస్తారు. దీన్నే నపుంసకత్వము అని కూడా వ్యవహరిస్తారు. అంగస్తంభన (organ erection) అనేది నరాలు మరియు రక్తనాళాలకు సంబంధించి (మనిషిలో) జరిగే సంఘటన. ఆలోచనల ద్వారా గాని లేదా స్పర్శ ద్వారా గాని లైంగిక ప్రేరణ ఏర్పడి జరిగేదే ‘అంగస్తంభన’. మందుల సేవనం, మద్య వ్యసనం, శారీరక బలహీనత, చక్కెరవ్యాధి/మధుమేహం వంటి అనేక కారణాల వలన అంగస్తంభన వైఫల్యం సంభవిస్తుంది. అంగం గట్టిపడకపోవడమనేది మగాళ్ళలో ఒక సాధారణ రుగ్మత, కానీ ఇది జనబాహుళ్యంలో చాలామటుకు చర్చింపబడలేదు. ఈ ఆరోగ్య సమస్య యొక్క సున్నితమైన స్వభావం కారణంగా అంగస్తంభన వైఫల్యము కల్గిన పురుషులు డాక్టర్ను సంప్రదించడానికి కూడా విముఖంగా ఉంటారు. చికిత్స చేయని అంగస్తంభన వైఫల్యం జీవితభాగస్వామితో మానసిక-సామాజిక సమస్యలకు దారితీస్తుంది.