చెవి ఇన్ఫెక్షన్ (ఓటైటిస్ మీడియా) అంటే ఏమిటి?
ఓటైటిస్ మీడియా అనేది మధ్య చెవికి సంక్రమణం (ఇన్ఫెక్షన్), ఇది కర్ణభేరి వెనుకన వాపు మరియు ఒక రకమైన ద్రవాన్ని ఏర్పరుస్తుంది. ఇది సాధారణ జలుబు (నాసోఫారింగైటిస్), గొంతు నొప్పి, లేదా శ్వాస మార్గ సంక్రమణల యొక్క ఫలితంగా సంభవించవచ్చు. ఈ సంక్రమణ అన్ని వయస్సు వారికి సంభవించినప్పటికీ, ఆరు నుంచి 15 నెలల మధ్య వయసు గల శిశువులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. దాదాపు 75 % మంది పిల్లలు 3 ఏళ్ల లోపు వయసులో ఒక్కసారైనా చెవి ఇన్ఫెక్షన్ ను అనుభవించి ఉంటారు. ఓటైటిస్ మీడియా యొక్క రకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- తీవ్ర ఓటైటిస్ మీడియా (Acute otitis media)
- ద్రవాలు స్రవించడంతో కూడిన ఓటైటిస్ మీడియా (Otitis media with effusion)
- దీర్ఘకాలిక స్రావంతో కూడిన ఓటైటిస్ మీడియా (Chronic otitis media with effusion)
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా, తీవ్ర ఓటైటిస్ మీడియాలో, మధ్య చెవి సంక్రమణం యొక్క లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి మరియు కొన్ని రోజులలోనే పరిష్కరించబడతాయి. దాని ప్రధాన లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి
- చెవినొప్పి
- జ్వరం
- ఒంట్లో నలతగా ఉండడం
- బలహీనత
- స్వల్ప వినికిడి లోపం- ద్రవం మధ్య చెవిలో ఎక్కువగా చేరిపోతే, వినికిడి లోపాన్ని అనుభవించవచ్చు (బంక చెవి).
అప్పుడప్పుడు, కర్ణభేరిలో చిల్లులు కూడా అభివృద్ధి చెందవచ్చు, మరియు చెవి నుండి చీము కూడా కారవచ్చు. పిల్లవాడికి చెవి ఇన్ఫెక్షన్ ఉన్నపుడు, ఇతర లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి
- చెవిని (లు) లాగుకోవడం లేదా రుద్దుకోవడం
- చిరాకు, ఆహారం సరిగ్గా తినకపోవడం లేదా రాత్రిపూట విశ్రాంతి లేకపోవడం
- దగ్గు లేదా ముక్కు కారడం
- అతిసారం
- మందమైన శబ్దాలు లేదా వినడంలో మార్పులు లేదా వినికిడిలో ఇతర ఇబ్బందులు
- సంతులనంలో తగ్గుదల (Loss of balance)
చంటిపిల్లలో లక్షణాలను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించవలసి ఉంటుంది, ఎందుకంటే పెద్ద పిల్లల వాలే బాధను సమర్థవంతంగా వ్యక్తపరచలేరు.
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఒక సాధారణ జలుబు కొన్నిసార్లు మధ్య చెవిలో శ్లేష్మం (mucus) ఏర్పడటానికి దారితీస్తుంది మరియు అందువల్ల యూస్టాషియాన్ ట్యూబ్ ( Eustachian tube,మధ్య చెవి నుండి ముక్కు వెనుకకు ఉండే ఒక సన్నని గొట్టం) వాపుకు గురవుతుంది లేదా నిరోధించబడుతుంది. శ్లేష్మం సరిగా బయటకు స్రవించని కారణంగా సంక్రమణ మధ్య చెవికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ క్రింది కారణాల వల్ల చెవి ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు:
- పెద్దవారితో పోలిస్తే పిల్లలలో యూస్టాషియాన్ ట్యూబ్ ( Eustachian tube) చిన్నది
- పిల్లల యొక్క అడెనోయిడ్లు పెద్దవారి కంటే చాలా పెద్దవిగా ఉంటాయి
- కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మధ్య చెవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి
- పగిలిన అంగిలి (Cleft palate) - బిడ్డ నోటి పైకప్పు (అంగిలి) మీద పగులులు ఉండే ఒక రకమైన పుట్టుకతో వచ్చే లోపం
- డౌన్ సిండ్రోమ్ - ఒక జన్యుపరమైన రుగ్మత, ప్రత్యేకంగా అభ్యాసన విషయంలో వైకల్యం మరియు అసాధారణ భౌతిక లక్షణాలు ఉంటాయి
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఓటైటిస్ మీడియా యొక్క చాలా సందర్భాలలో వైద్యున్ని సందర్శించాల్సిన అవసరం లేదు, కొన్ని రోజుల్లో దానికదే తగ్గిపోతుంది. అయినప్పటికీ, లక్షణాలు మరింత క్షీణించినట్లయితే, మధ్య చెవి ఇన్ఫెక్షన్ను సాధారణంగా ఓటోస్కోప్ (otoscope)ను ఉపయోగించి నిర్ధారణ చేస్తారు. వైద్యులు ఒటోస్కోప్ను ఉపయోగించి మధ్య చెవిలో ద్రవం యొక్క ఉనికి సంకేతాల కోసం పరిశీలిస్తారు, అది సంక్రమణను సూచిస్తుంది. చికిత్స ప్రభావవంతంగా లేనప్పుడు లేదా సమస్యలు తీవ్రతమవుతుంటే, చెవి, ముక్కు మరియు గొంతు (ENT) వైద్యుడు నిర్వహించే టీంపనోమెట్రీ (tympanometry), ఆడియోమెట్రీ (audiometry), మరియు సిటి/ ఎంఆర్ఐ (CT / MRI) స్కాన్స్ వంటి పరీక్షలు అవసరం.
చికిత్స వీటిని కలిగి ఉండవచ్చు
- నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్స్ లేదా చెవి చుక్కలు(ear drops)
- మందులు (నొప్పి మరియు జ్వరం కోసం)
- సమయానుసార పరిశీలన
- గ్రోమేట్స్ (Grommets) -పిల్లలకు మధ్య చెవి ఇన్ఫెక్షన్లు పునరావృత్తమవుతూ ఉంటే, సాధారణమైన అనస్థీషియా (ఎటువంటి నొప్పిని కలిగించకుండా) ఉపయోగించి ,గ్రోమేట్స్ అని పిలువబడే చిన్న గొట్టాలను ద్రవాన్ని బయటకు తీయడానికి కర్ణభేరిలోకి అమర్చుతారు. ఈ ప్రక్రియకు సాధారణంగా 15 నిమిషాలు పడుతుంది మరియు రోగిని అదే రోజు ద్రవాలను బయటకు కార్చవచ్చు.
- పారాసెటమాల్ మరియు ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పినివరుణులు నొప్పి లేదా జ్వరం ఉపశమనం కోసం సిఫారసు చేస్తారు.
స్వీయ - సంరక్షణ:
-
లక్షణాలు తగ్గుముఖం పట్టేంత వరకు ప్రభావిత చెవి మీద ఒక వెచ్చని ఫ్లాన్నెల్ను (flannel) ఉంచడం వలన నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.