మీకు తెలుసా? రక్తంలో నిరంతరం పెరిగిపోతుండే చక్కర స్థాయిలు శరీరంలోని ఇతర ముఖ్య అవయవాలకు చేటు చేస్తాయని? అందుకే "చక్కర వ్యాధి మరింతగా ప్రేరేపితమయ్యే ఆరోగ్య పరిస్థితిని తెచ్చుకోకు" అంటూ మీ వైద్యులు, మీ శ్రేయస్సు కోరే ఆప్తులైన మీ కుటుంబ సభ్యులు సతతం పట్టు బట్టి మరీ మీకు చెబుతూనే ఉంటారు. సుమారు 15 నుండి 20 ఏళ్ళ దీర్ఘ కాలంపాటు చక్కర వ్యాధితో జీవిస్తున్నవారికి చక్కర వ్యాధి (ప్రభావం ఇతర అవయవాల పై బడి) వారికి మరికొన్ని జబ్బులు దాపురింపజేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. చక్కర వ్యాధిని సరిగా నియంత్రించని పక్షంలో దాని ప్రభావం వల్ల ఏఏ శరీర భాగాలకు ప్రమాదమేర్పడుతుందో ఇపుడు తెలుసుకుందాం.
కళ్ళు
నియంత్రించబడని మధుమేహం వలన, ముఖ్యంగా టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ తో నివసించే వ్యక్తుల్లో, కళ్ళ నరాలు ఎక్కువగా బాధింపబడతాయి. కంటి నాడీ కణాలపై చక్కర వ్యాధి దాడి కారణంగా 'డయాబెటిస్ రెటినోపతీ', గ్లవుకోమా, కంటిశుక్లం వంటి తీవ్రమైన డయాబెటిక్ సంబంధమైన కళ్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. దృష్టిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా సంభవించవచ్చు.
- డయాబెటిస్ రెటినోపతీ' పరిస్థితి వల్ల కంటిలో ఉన్న రెటీనా రక్తనాళాలు చిట్లడం, గడ్లు కట్టడం వంటివి జరిగి అంతర్గత రక్తస్రావానికి కారణమవుతుంది. తత్ఫలితంగా పూర్తి దృష్టి నష్టం వచ్చే ప్రమాదమూ ఉంది.
- గ్లవుకోమా-పరిస్థితిలో కంటి కండరాల లోపల ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు అనుసంధానించబడిన నరాలు దెబ్బతింటాయి. మధుమేహం లేని వ్యక్తులకు కూడా గ్లాకోమా సంభవిస్తుంది, కాని మధుమేహం సరిగ్గా నియంత్రించి, నిర్వహించబడకపోతే చక్కర వ్యాధి మరింత విషమించే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
- కంటిశుక్లం లేక కంటి పొర ఏర్పడడం. కంటి యొక్క సహజ కటకాలు సన్నని పొరను ఏర్పరుస్తాయి. అందువల్ల దృష్టి చాలా మందగిస్తుంది. మధుమేహం లేని వారిలో కంటే మధుమేహం ఉన్నవారికి ఈ కంటిశుక్లం లేక 'కంటి పొర ఏర్పడడమనే సమస్య 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- డయాబెటిస్ మాక్యులర్ ఎడెమా' - ఇది కంటి రెటీనాలో ఉండే మక్లలా ప్రాంతంలో మంట, వాపు కలిగి ఉన్న డయాబెటిస్ రెటినోపతి యొక్క ప్రగతిశీల రూపం.
మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, ప్రతి ఆరునెలలకు ఒకసారి మీ కళ్లను వైద్యుల చేత పరీక్షింపచేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కళ్ళు పొడిబారిపోవడం, కళ్ళ వెంట ఎక్కువగా నీరుగారడం, కళ్ళ దురద, కళ్ళు ఎరుపెక్కడం దృష్టిలోపాలేర్పడడం వంటి లక్షణాలు కానవచ్చినట్లైతే ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరు వైద్యుడిని సంప్రదించాలి.
ఓరల్ హెల్త్/నోటి పరిశుభ్రత
నియంత్రణ లేని చక్కర వ్యాధి మరియు పేలవమైన నిర్వహణ వల్ల వివిధ నరాల వ్యాధులకు, నోటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇంకా, నోటిలో చిగుళ్ళు, దంత సమస్యలకు దారితీస్తుంది. అధిక గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు మీ నోటి కుహరంలో ప్రమాదాన్ని కలిగిస్తాయి. చక్కర వ్యాధిని సరిగా నిర్వహించి నియంత్రించకపోతే దవడలు, దంతాలు, నోటి ప్రాంతం, నాలుక మరియు మొత్తం నోటి ఆరోగ్యం పాడైపోయే ప్రమాదముంది. నోటిలో బ్యాక్టీరియల్ మరియు ఇతర వ్యాధికారకాలైన క్రిములు చోటు చేసుకోవడం వల్ల జింజివిటిస్, కండోవిటిస్, కాన్డిడియాసిస్, పియోరియా వంటి వ్యాధులకు, చెడు శ్వాస మరియు పొడి లేదా బర్నింగ్ సమస్యలు వంటి పరిస్థితులకు దారితీస్తుంది.
చక్కర వ్యాధికి గురైన వారు సరైన నోటి పరిశుభ్రతని పాటించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పళ్ళపై ఫలకాన్ని ఏర్పరుచుకోకుండా రోజుకి కనీసం రెండుసార్లు బ్రష్ చేయాలి. ఆహారపు కణాలతో కూడిన లవణంలో గ్లూకోజ్ ఉన్నందున పళ్ళపై ఫలకం ఏర్పడుతుంది, ఇది పళ్ళపై పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర బాక్టీరియాకు ఆలవాలమై గింజివిటిస్ మరియు పార్డోంటైటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంకా, నోటి గాయాలు, పూతల సమస్యను ఎదుర్కొంటుంటే, 5-7 రోజులైనా అవి మానక పొతే తక్షణమే దంతవైద్యుడిని సందర్శించమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర వ్యాధితో బాధపడే వారు ఆరునెలలకు ఒకసారి దంత వైద్యులచేత తనిఖీ చేయించుకోవడం అనివార్యం.
హృదయం:
మధుమేహం ఉన్నవారు ఆ వ్యాధి లేనివారికంటే గుండెసంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ ఉంది. స్ట్రోక్స్ మరియు కార్డియోవాస్కులర్ వ్యాధులు బారిన పడే ప్రప్రమాదం హెచ్చు. కనుక,ఓరల్ హెల్త్ జాగ్రత్తలు, ప్రత్యేకించి టైప్ 2 మధుమేహం ఉన్న వారికి తప్పనిసరి. తరచుగా చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్నవారు అధిక రక్తపోటు, అధిక స్థాయి కొలెస్ట్రాల్, అధిక స్థాయి ట్రైగ్లిజరైడ్స్ మరియు ఊబకాయం కలిగి ఉండటం సాధారణం, మరి అలంటి వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్లు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం కారణంగా గుండె కండరాలు, రక్త నాళాలు, మరియు నరాలు బలహీనపడతాయి. చివరకు గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. అధిక ట్రైగ్లిజరైడ్స్ (కొవ్వులు) తో పాటుగా నియంత్రించని మధుమేహం (హై ఎటమాటిక్ బ్లడ్ గ్లూకోస్ స్థాయిలు) హృదయ సంబంధిత సమస్యలను మరింతగా కలిగించే ప్రమాదం ఉందని వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి.
చక్కెర వ్యాధితో బాధపడే వారు జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాలని, మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలి అని, మద్యం మరియు పొగాకు తీసుకోవడం తగ్గించడం తప్పని సరి అని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల మీ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సమతుల్యం చేయబడతాయి. అంతే కాక మార్చుకున్న మీ జీవనశైలి వివిధ హృదయ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు వైద్యులు.
కిడ్నీ మరియు పిత్తాశయం
రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు మన శరీర వడపోత వ్యవస్థ (మూత్రపిండాలు మరియు మూత్రాశయం) కు గొప్ప ముప్పును కలిగిస్తాయి. మన శరీరంలో మూత్రపిండాలు మరియు మూత్రాశయం మన శరీరం నుండి అన్ని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయని తెలుసు. నియంత్రించని మధుమేహంతో, మూత్రపిండాల యొక్క రక్త నాళాలు దెబ్బతింటాయి, తద్వారా, మన శరీర వడపోత వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుంది. కనుక చక్కెరవ్యాధి ఉన్నవారు తమ మూత్రపిండాలు మరియు మూత్రాశయం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను ప్రారంభ దశలోనే పరీక్షల ద్వారా కనుగొని చికిత్స చేయకపోతే ప్రాణాంతక ప్రమాదమని వైద్యులై చెప్తున్నారు. మూత్రపిండాల వ్యాధుల లక్షణాలైన రాత్రుల్లో పలుసార్లు మూత్రవిసర్జనకు పోవాల్సి రావడం, మూత్రానికి పొయ్యేటపుడు మంట పుట్టడం, మూత్ర పరిమాణం గణనీయంగా తగ్గినా గాని లేదా పాదాలు, మడిమల్లో (మిడి-పాదాలు) వాపు రావడం మీరు గమనించినట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.
లైంగిక ఆరోగ్యం
చక్కర వ్యాధి కల్గిన వారు-పురుషులు మరియు మహిళలు ఇద్దరూ కూడా- తమ లైంగిక ఆరోగ్య విషయంలో ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. చక్కెరవ్యాధున్న పురుషులకు అంగస్తంభన, నపుంసకత్వము, లిబిడో నష్టం, అకాల స్ఖలనం మరియు ఆలస్య స్ఖలనం వంటివి దాపురిస్తాయి. పది నుంచి పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం మధుమేహం కలిగిన 50% పురుషులు అంగస్తంభన నుండి బాధపడుతున్నారని గణనీయమైన అధ్యయనాలు చెబుతున్నాయి. అంగస్తంభనతో బాధపడుతున్న పురుషులు తరచుగా హృదయ సంబంధ వ్యాధులకు గురవుతున్నారని పరిశోధకులు గుర్తించారు.
దీనికి విరుద్ధంగా మహిళలు, ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ కు లోనైనవారు హార్మోన్ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు. పిసిఒఎస్ (పాలీసిస్టిక్ అండాశయ సిండ్రోమ్) వంటి వ్యాధులు తరచుగా మధుమేహంతో అనుసంధానించబడి ఉంటాయి, ఇది (పాలీసిస్టిక్) మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం. మధుమేహం కారణంగా సంభవించే కొన్ని ఇతర సాధారణ పరిస్థితులేవంటే పొడి యోని , లైంగిక కోరికలు లేకపోవడం, సెక్స్ సమయంలో నొప్పి, మరియు ఉద్రేకం ఇబ్బందులు.
లైంగిక సమస్యలకు పురుషులు మరియు మహిళలు కూడా వైద్యుడుని సంప్రదించాలి. దీనివల్ల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన చీకు చింతలు సులభంగా తగ్గటానికి ఎన్నో పరిష్కారాలు లభిస్తాయి. వైద్య టెక్నాలజీ మరియు తత్సంబంధ ఉత్పత్తులు, మందులు మరియు చికిత్సలు ఇటీవలికాలంలో ఎంతో పురోగమనం చెందాయి. అంగస్తంభన మరియు వంధ్యత్వం వంటి సమస్యలకు వైద్యులను సంప్రదించడం చాలా సహాయపడుతుంది. అయినప్పటికీ, చక్కెర వ్యాధి గలవారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంగస్తంభన మరియు వంధ్యత్వం వంటి లైంగిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి డాక్టర్లు షుగర్ పేషంట్లకు సిఫారసు చేసేదేమంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిం చుకొమ్మని మరియు సాధారణమైన వ్యాయామం నిత్యం చెయ్యమని. దీనివల్ల లైంగిక సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లంటున్నారు.
మానసిక ఆరోగ్యం:
దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధి ఉన్నవారు తరచూ భావోద్వేగ సంక్షోభానికి గురవుతారని మనస్తత్వవేత్తలు అంటున్నారు. మధుమేహమున్నవారు దేహారోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. చక్కెర వ్యాధి ఉన్నవారు తమ తమ జీవితంలో సంతోషంగా సంతృప్తిగా ఉన్నయెడల తమ శరీరములో చక్కెర నిల్వల ను కూడా సమర్ధవంతంగా నియంత్రించుకుంటున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి. సంతోషంగా లేని చక్కెర వ్యాధి గ్రస్తులతో పోల్చి చూద్దాం వల్ల ఇది నిరూపితమైంది అని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
కుటుంబ సభ్యులు కూడా చక్కెర వ్యాధి ఉన్న తమవారికి మానసికంగా వెన్నుదన్నుగా నిల్చి, వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేట్లు చూసుకొని, తద్వారా, వారి రక్తంలో చక్కెర నిల్వల సమతౌల్యతకు తోడ్పడాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. జీవిత సుఖ-సంతోషాలను ఆస్వాదించడంలో చక్కెర వ్యాధి ఓ అడ్డంకి కాకూడదు మరి.