పిల్లల్లో థైరాయిడ్ సమస్య అంటే ఏమిటి?
పెద్దలతో పోలిస్తే పిల్లలలో థైరాయిడ్ సమస్యలు అరుదుగా కనిపిస్తాయి, అయినప్పటికీ అవి పూర్తిగా అసాధారణం కాదు. దాని లక్షణాలు మరియు వైఖరులు పెద్దలు మరియు పిల్లలలో ఇంచుమించు ఒకేలా ఉంటాయి, అయినప్పటికీ కొన్ని స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. థైరాయిడిజం (థైరాయిడ్ యొక్క వ్యాధి) అనేది ఒక థైరాయిడ్ గ్రంథి పనిచేయడంలో లోపం వల్ల కానీ (హైపోథైరాయిడిజం) లేదా అధికంగా పని చేయడం వల్ల కానీ (హైపర్ థైరాయిడిజం) సంభవించవచ్చు. లక్షణాలు మరియు చికిత్స థైరాయిడ్ సమస్య యొక్క రకం మీద ఆధారపడి ఉంటాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిల్లలు మరియు యుక్తవయసులవారు థైరాయిడ్ తో బాధపడుతున్నప్పుడు రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆ రెండింటి సంకేతాలు మరియు లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి:
- హషిమోటోస్ థైరాయిడిటిస్ (Hashimoto’s thyroiditis): ఈ స్థితిలో,పిల్లవాడి పెరుగుదలలో స్పష్టంగా గమనించదగిన క్షీణత ఉంటుంది, సాధారణంగా మెడలో వాపు ఉంటుంది, దానిని గోయిటర్(goitre) అనే పరిస్థితిగా పిలుస్తారు. చర్మం పోడిబారిపోవడం మరియు దురద, వాపు మరియు బరువు పెరుగుట, చల్లదానానికి సున్నితత్వం, శక్తి లేకపోవడం, దృష్టి పెట్టలేకపోవడం మరియు మలబద్దకం అనేవి కొన్ని చెప్పుకోదగిన సంకేతాలు.
- గ్రేవ్స్ వ్యాధి (Grave’s disease): అధిక శక్తి మరియు హైపర్యాక్టివిటీ (hyperactivity), వస్తువులను పాడుచెయ్యడం, భయము, వేగవంతమైన పెరుగుదల శాతం, ప్రవర్తన మరియు నిద్రలో అలజడులు, వేగవంతమైన పల్స్ రేటు, బరువు కోల్పోవటం, కండరాల బలహీనత మరియు అతిసారం వంటివి ఈ పరిస్థితి యొక్క కొన్ని లక్షణాలు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
థైరాయిడిజంలో రెండు ప్రధాన కారణాలు థైరాయిడ్ గ్రంధి చాల తక్కువగా పనిచేయడం లేదా అధికంగా పనిచెయ్యడం కాబట్టి, థైరాయిడిజం వలన సంభవించే పరిస్థితులు కూడా వాటి నుండే ఉత్పన్నమవుతాయి.
- శరీరంలో రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథి యొక్క థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తిపై దాడి చేయడం ద్వారా దానిని నిరోధించినప్పుడు హషిమోటోస్ థైరాయిడిటిస్ (Hashimoto’s thyroiditis) ఏర్పడుతుంది. దాని వలన ప్రభావితం కావడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి లక్షణాలు స్పష్టంగా కనిపించే వరకు అంటే చాలా కాలం పాటు ఈ సమస్యను గుర్తించలేము.
- గ్రేవ్స్ వ్యాధి అనేది స్వీయప్రతిరక్షకార (autoimmune) వ్యాధి, ఇక్కడ ఉత్పత్తి అయినయాంటీబోడీలు, థైరాయిడ్ గ్రంధి పై తీవ్రమైన ప్రేరణను కలిగిస్తాయి, తద్వారా అధికమైన థైరాయిడ్ హార్మోన్ యొక్క ఉత్పత్తికి దారితీస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
థైరాయిడ్ సమస్యకు సంబంధించిన ఏవిధమైన కేసులలో అయినా, థైరాయిడ్ హార్మోన్లు మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయిని గుర్తించడానికి రక్త నమూనా సేకరించి పరీక్షించడం అనేది ప్రాథమిక నిర్ధారణ దశ. శారీరక పరీక్షతో సహా రోగి పరిస్థితిని గుర్తించి, నిర్ధారణ చేయవచ్చు.
చికిత్స సమస్యను బట్టి మారుతాయి .
- హషిమోటోస్ థైరాయిడిటిస్: జీవితాంతం హార్మోన్ ప్రత్యామ్నాయాలు సూచించబడతాయి. మోతాదు అనేది థైరాయిడ్ స్థాయిల పనితీరు బట్టి మారుతూ ఉంటుంది, తద్వారా హార్మోన్ స్థాయిలు నిర్వహించబడతాయి.
- గ్రేవ్స్ వ్యాధి: యాంటిథైరాయిడ్ మందులను వెంటనే మొదలుపెట్టాలి, మరియు పరిస్థితి స్థిరపడే వరకు అవి సూచించబడతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, శస్త్రచికిత్స ద్వారా థైరాయిడ్ గ్రంధి తొలగింపు అనేది చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చికిత్స సమయం అంత థైరాయిడ్ స్థాయిలు మరియు లక్షణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు.