పిల్లల్లో కుంగుబాటు - Depression in Children in Telugu

Dr. Pradeep JainMD,MBBS,MD - Pediatrics

December 01, 2018

March 06, 2020

పిల్లల్లో కుంగుబాటు
పిల్లల్లో కుంగుబాటు

పిల్లల్లో నిరాశ లేదా కుంగుబాటు  అంటే ఏమిటి?

పెద్దవారి మాదిరిగానే, పిల్లలు కూడా కుంగుబాటుతో బాధపడుతుంటారు. పిల్లలలో కుంగుబాటుతో అనేది దుఃఖించడం మరియు నిర్లిప్తత కూడిన భావనలతో గుర్తించబడుతుంది, ఇది నిరంతరంగా ఉంటుంది మరియు పాఠశాల పనితీరు, సంబంధాలు మరియు కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది.  దుఃఖించడం వంటి సమస్యలలా కాకుండా, కుంగుబాటు నుండి బయట పడడానికి ఎక్కువ సమయం మరియు శ్రద్ధ చూపడం అవసరం. పిల్లలలో డిప్రెషన్ను తీవ్రంగా పరిగణించాలి మరియు దానికి చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఒక పిల్లవాడు కుంగుబాటుతో బాధపడుతున్నాడా లేదా అని గుర్తించడానికి ఈ క్రింది లక్షణాలు ఉన్నాయా అని గమనించాలి:

  • కోపం మరియు చిన్న విషయాలకే కోపం రావడం
  • మారిపోయే ఆకలి మరియు నిద్ర క్రమాలు
  • ఆత్మహత్య ధోరణి
  • శక్తి మరియు చొరవ లేకపోవడం, దృష్టి పెట్టడంలో అసమర్థత
  • అధికంగా విమర్శించడం లేదా తిరస్కారం, త్వరగా ఏడుపు రావడం
  • సామాజిక సంబంధాల నుండి ఉపసంహరణ
  • నిరంతరంగా బాధపడటం, అపరాధం లేదా వారు వ్యర్థం అనే భావన
  • తలనొప్పి మరియు కడుపు నొప్పి చికిత్సతో తగ్గదు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అనేక పరిస్థితులు  పిల్లలో కుంగుబాటుకి కారణమవుతాయి. వాటిలో కొన్ని ఈ క్రింద ఉన్నాయి:

  • కుంగుబాటు యొక్క కుటుంబ చరిత్ర
  • మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం
  • కుటుంబంలో వివాదాలు మరియు అశాంతి వాతావరణం
  • భౌతిక అనారోగ్యం
  • భంగపరిచే కుటుంబ పరిస్థితులు

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

కనీసం ఒక పక్షం రోజుల పాటు పిల్లవాడు నిరంతరంగా బాధపడుతుంటే, వైద్య సహాయం తీసుకోవలసిన అవసరం ఉన్నదని అర్ధం. మానసిక ఆరోగ్య నిపుణుడిని సూచించే ముందు వైద్యులు సాధారణంగా శారీరక రోగాల గురించి తనిఖీ చేస్తారు. పిల్లవాడితో మరియు కుటుంబంతో మాట్లాడడం, ఆరోగ్య చరిత్ర మరియు కుటుంబ చరిత్ర తెలుసుకోవడం, స్నేహితులు మరియు ఉపాధ్యాయులతో మాట్లాడడం మరియు ఏవైన మానసిక ప్రశ్నావళిని (psychological questionnaires) ఉపయోగించి సాధారణంగా కుంగుబాటుని నిర్దారిస్తారు, అలాగే శ్రద్ద చూపడంలో లోపం / హైప్యాక్టివిటీ డిజార్డర్ ( ఏడిహెచ్డి, ADHD) మరియు అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (ఓసిడి, OCD) వంటి ఇతర సంబంధిత రుగ్మతలను కూడా తనిఖీ చేస్తారు.

కుంగుబాటును చికిత్స చేయడానికి, మొదటి ఎంపిక ఎల్లప్పుడూ మానసిక చికిత్స (psychotherapy), దానిలో కౌన్సెలింగ్ మరియు ఇతర పద్ధతులు ఉంటాయి. తీవ్రమైన కుంగుబాటును అధిగమించడానికి యాంటీడిప్రెస్సెంట్స్ను పిల్లలకు సహాయపడే రెండవ ఎంపికగా పరిగణించవచ్చు. అవసరమైతే, ఇతర సహ-రుగ్మతలకు (co-existing disorders) సంబంధించిన మందులు కూడా సూచించబడవచ్చు.



వనరులు

  1. Claudia Mehler-Wex et al. Depression in Children and Adolescents. Dtsch Arztebl Int. 2008 Feb; 105(9): 149–155. PMID: 19633781
  2. HealthLink BC [Internet] British Columbia; Depression in Children and Teens
  3. Alsaad AJ, Al Nasser Y. Depression In Children. StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  4. National Collaborating Centre for Mental Health (UK). Depression in Children and Young People: Identification and Management in Primary, Community and Secondary Care.. Leicester (UK): British Psychological Society; 2005. (NICE Clinical Guidelines, No. 28.) 3, Depression.
  5. Paul O Wilkinson. Managing depression in childhood and adolescence. London J Prim Care (Abingdon). 2009; 2(1): 15–20. PMID: 26042160

పిల్లల్లో కుంగుబాటు వైద్యులు

Dr Shivraj Singh Dr Shivraj Singh Pediatrics
13 Years of Experience
Dr. Abhishek Kothari Dr. Abhishek Kothari Pediatrics
9 Years of Experience
Dr. Varshil Shah Dr. Varshil Shah Pediatrics
7 Years of Experience
Dr. Amol chavan Dr. Amol chavan Pediatrics
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు