ఆనెకాయలు (Calluses) అంటే ఏమిటి?
ఆనెకాయలు (Calluses) అనేవి మన చేతులు మరియు కాళ్ళ చుట్టూ చర్మం పైన కఠినమైన చర్మంతోకూడిన మచ్చలు (patches). అవి కేవలం బాధించేటివీ మరియు అసౌకర్యమైనవే కాదు, చూడడానికి కూడా ఆహ్లాదకరమైనవేం కాదు. ఆనెకాయలు ఓ తీవ్రమైన సమస్య కాదు, కానీ అవి వాటిని సులభంగా నివారించవచ్చు మరియు నయమూ చేసుకోవచ్చు.
ఆనెకాయలు మరియు ఆనెలు (corns) రెండూ ఒకటి కాదు. తరచుగా ఆనెకాయల్నే ఆనెలుగా వ్యవహరిస్తూ పొరపాటు పడటం జరుగుతోంది. ఆనెలు మరియు ఆనెకాయలు రెండూ కూడా ఘర్షణకు విరుద్ధంగా ఏర్పడే ప్రక్రియలో రక్షించుకోవడానికి చర్మపు కఠిన పొరలతో ఏర్పడ్డవే అయినా అనెకాయలు సాధారణంగా ఆనెల కంటే పెద్దవిగా ఉంటాయి. అనెకాయలు కేవలం ఆనెలు ఏర్పడేచోట్లలోనే కాక వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడతాయి మరియు అరుదుగా ఎప్పుడూ బాధాకరమైనవే.
ఆనెకాయల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆనెకాయలు ముఖ్యంగా అడుగుల కింది అరికాళ్ళు లోని మడిమెల్లో (హీల్స్) మరియు (పాదం బంతుల్లో) ముందు భాగంలో, అరచేతులు లేదా మోకాళ్లు; శరీరం భంగిమలు మరియు కదలికల నుండి కలిగే ఒత్తిడిని భరించే కేంద్రభాగాల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అవి సాధారణంగా ఈ క్రింది విధంగా కనిపిస్తాయి.
- గట్టి బుడిపె లాగా పైకి ఉబికి ఉంటాయి.
- గట్టిగా నొక్కినప్పుడు బాధాకరంగా ఉంటాయి. లేదా దాని ఉపరితలం క్రింద లోతులో సున్నితత్వంతో కూడిన నొప్పి కల్గుతుంది.
- చర్మంపై మందమైన చర్మంతో కూడిన కఠినమైన పాచ్ (మచ్చ)
- చర్మం మైనంలాగా, పొడిగా మరియు పొరలు (పొలుసులు) గా కనిపిస్తుంది
ఆనెకాయలకు ప్రధాన కారణాలు ఏమిటి?
ఆనెకాయలకు ప్రధాన కారణం ఘర్షణ లేక రాపిడి. పాదాలకు ఈ ఘర్షణ లేదా రాపిడి ఎందుకు కలుగుతుందంటే:
- పాదరక్షలు చాలా గట్టివి (hard) లేదా చాలా బిగుతు (tight )గా ఉన్నవి వేసుకోవటంవల్ల
- కొన్ని సంగీత వాయిద్యాలను వాయించడం ద్వారా
- జిమ్ పరికరాలతో పని చేయడం
- బ్యాట్ లేదా రాకెట్ ను పట్టుకుని ఆడే క్రీడలో ఆడటంవల్ల
- దీర్ఘకాలంపాటు కలం (pen) వంటి వాటిని పట్టుంకుని రాయడం మూలంగా కూడా చర్మంపై కాయలు కాస్తాయి.
- తరచుగా చాలా దూరాలకు సైకిల్ లేదా మోటారుబైక్ పై స్వారీ
- బూట్లు తో పాటు మేజోళ్ళు (సాక్స్) ధరించకపోవడంవల్ల.
- కాలిబొటనవ్రేలి గోరుచుట్టు లేక మడమ శూలలు (Bunions) ,కాలిగోళ్ల వికృతరూపాలు లేదా ఇతర వైకల్యాలు ఆనెకాయల (calluses) ప్రమాదాన్ని పెంచుతాయి.
- కొన్నిసార్లు, శరీరభాగాలన్నింటికీ సరిపోని రక్త ప్రసరణ మరియు మధుమేహం వంటి పరిస్థితులు కూడా ఆనెకాయల్ని కలిగించవచ్చు.
ఆనెకాయల నిర్ధారణను ఎలా చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఆనెకాయలను (calluses) గుర్తించడానికి డాక్టర్ కు కేవలం ఓ సాధారణ పరిశీలన చాలు. ఆనెకాయలకు కారణమైన వికృతం ఎదో కంటికి కనిపించకుండా శరీరంలోపల ఉందని అనుమానమొస్తే ఓ X- రే తీయించామని డాక్టర్చే మీకు సలహా ఇవ్వబడుతుంది.
చాలా తరచుగా, ఆనెకాయలు తమకు తాముగా అదృశ్యం అయిపోతాయి, లేదా కొన్ని సాధారణ గృహ చిట్కాల వంటి వాటి సంరక్షణతోనే సమసిపోతాయి. వైద్యులు సాధారణంగా అనేకాయల చికిత్సలో సూచించే ప్రక్రియలు కిందున్నాయి:
- పొడిగా తయారైన అదనపు చర్మాన్నితొలగించడం లేదా కత్తిరించడం.
- అనెకాయల్ని తీసివేయడానికి పొరలు (Patches) లేదా ఔషధాలు
- శాలిసిలిక్ ఆమ్లాన్ని (salicylic acid ) రాయడం ద్వారా ఆనెకాయల్ని వదిలించుకోవటం
- ఘర్షణను తగ్గించడానికి మరియు మరింతగా ఆనెకాయలు ఏర్పడకుండా ఉండేందుకు షూ ఇన్సర్ట్ను (shoe inserts) ఉపయోగించడం
- ఏర్పడదగ్గ వైకల్యాన్ని నయం చేయదగ్గ సందర్భంలో శాస్త్ర చికిత్స
- ఆనెకాయలేర్పడ్డా చోట చర్మాన్ని నానబెట్టి మృదుపర్చడం, తేమమర్దనం చేయడం, పూమిక్ స్టోన్ లేదా ఎమెరీ బోర్డు ను ఉపయోగించి మృతచర్మాన్ని తొలగించడం.
- అన్ని సమయాలలో సాక్స్లతో చక్కగా అమర్చిన బూట్లు ధరించడం