రక్తస్రావం అంటే ఏమిటి?
శరీరం నుండి రక్తం పోవడాన్ని రక్తస్రావం అంటారు. శరీరం లోపల ఏర్పడే రక్తస్రావమును అంతర్గత రక్తస్రావం (internal bleeding) అని పిలుస్తారు, శరీరం బయట ఏర్పడే రక్తస్రావాన్ని బాహ్య రక్తస్రావం (external bleeding) అని పిలుస్తారు. శరీరం లో, రక్తం మూసివున్న రక్త నాళాలలో ప్రవహిస్తుంది; రక్త నాళాలలో ఏదైనా పగులు లేదా తెరుచుకోవడం వంటి పరిస్థితి ఏర్పడితే రక్తం రక్త నాళాల నుండి బయటకు వచ్చేస్తుంది, ఫలితంగా రక్త నష్టం జరుగుతుంది. రక్తస్రావం అనేది అంతర్లీన వ్యాధి పరిస్థితి లేదా గాయం యొక్క లక్షణం. ప్రసవ తర్వాత రక్తస్రావం మరియు ఋతు రక్తస్రావం అనేవి సాధారణ పరిస్థితులు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
రక్త స్రావానికి కారణం ఒక ఆరోగ్య సమస్య లేదా గాయం అయిప్పుడు ఆ రక్తస్రావం అనేది ఆందోళనకు గురిచేస్తుంది. శరీరానికి సహజంగా రక్తం గడ్డకట్టే జీవక్రియ ఉంది రక్తస్రావం గాయం ద్వారా సంభవించినప్పటికీ, వ్యక్తికి గడ్డకట్టడంలో రుగ్మత లేకపోతే, ఆ రక్తస్రావం సహజంగానే గడ్డకడుతుంది. రక్తస్రావం యొక్క కొన్ని సాధారణ సంకేతాలను చూద్దాం.
- నోటి, ముక్కు, చెవి, మలద్వారం మరియు మూత్రాశయపు ద్వారం లేదా చర్మం యొక్క ఉపరితలం వంటి బాహ్య రంధ్రముల నుండి రక్తం కోల్పోవడం
- జ్వరం
- తగ్గిన హేమోగ్లోబిన్ శాతం
- షాక్ (రక్త నష్టం ఆపివేయబడకపోతే) చల్లని, పాలిపోయిన అవయవాలు, తగ్గిన నాడిని కలిగి ఉంటుంది
ప్రధాన కారణాలు ఏమిటి?
శరీరానికి గాయం, ప్రమాదం లేదా దెబ్బ వలన గాయం అనేవి రక్తస్రావానికి కారణం కావచ్చు. కొన్ని సాధారణ బాధాకరమైన కారణాలు:
- చర్మానికి గాయం, లేదా కమిలిన గాయాలు వంటివి చర్మ రక్తనాళికలకు చిట్లడానికి కారణమవుతుంది
- ముక్కుకు గాయం లేదా ముక్కు పగుళ్లు ఏర్పడినప్పుడు అవి ముక్కు రక్తస్రావానికి కారణమవుతాయి
- తల గాయం కారణంగా ఇంట్రాక్రానియల్ రక్తస్రావం
- తుపాకీ తో పేల్చినప్పుడు ఏర్పడే గాయం
కొన్ని ఆరోగ్య సమస్యల ఫలితంగా రక్త నష్టం సంభవించినప్పుడు, ఆ సమస్యలను వైద్య కారణాలుగా సూచిస్తారు. వీటిలో కొన్ని కారణాలు:
- తీవ్రమైన బ్రోన్కైటిస్ (acute bronchitis)
- కాలేయ వైఫల్యం
- తక్కువ ప్లేట్లెట్ సంఖ్య
- విటమిన్ K లోపం
- రక్త క్యాన్సర్ లేదా ఇతర తీవ్రతర క్యాన్సర్
- భారీ ఋతుచక్రం
- గర్భస్రావం (abortion)
- హేమోఫిలియా (Haemophilia) - కీళ్ళలోకి ఆకస్మిక రక్తస్రావానికి కారణమవుతున్న ఒక జన్యు లోపము
కొన్ని రక్తాన్ని పల్చబరచే మందులు కూడా రక్తస్రావానికి దారితీస్తాయి.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
దెబ్బ లేదా గాయం విషయంలో, గాయపడిన అవయవం యొక్క వివిధ స్కాన్లు సహాయకారిగా ఉండవచ్చు. అనేక సార్లు, రక్త పరీక్షలు నిర్వహిస్తే తప్ప అంతర్గత రక్తస్రావం గుర్తించబడదు. కొన్ని సాధారణ విశ్లేషణ సాధనాలు మరియు పద్ధతులు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- హిమోగ్లోబిన్ (haemoglobin) మరియు హేమాటోక్రిట్ (haematocrit) శాతాన్ని చూపించే రక్త పరీక్ష
- ప్లేట్లెట్ గణన
- మల పరీక్ష
- X- రే ఇమేజింగ్
- CT స్కాన్లు
- అల్ట్రాసౌండ్
చికిత్స ప్రాధమికంగా రక్తస్రావమును ఆపడానికి ఉద్దేశింపబడుతుంది మరియు అంతర్లీన కారణం నిర్ధారణ అయిన తరువాత, చికిత్సాక్రమం దానికి అనుగుణంగా నిర్ణయించబడుతుంది. రక్తస్రావం యొక్క నిర్వహణకు ఈ క్రింది మార్గాలను పాటించవచ్చు:
- అధిక ఋతుచక్ర రక్తస్రావం కోసం హార్మోన్ల చికిత్స.
- గాయపడినప్పుడు రక్తం నష్టాన్ని నియంత్రించడానికి కట్టు కట్టడం.
- బాధాకరమైన రక్తస్రావం ఆపడానికి శస్త్రచికిత్స జోక్యం.
- రక్తస్రావం వలన ఏర్పడే హైపోటెన్షన్ను నియంత్రించడానికి కణజాల ఆక్సిజనేషన్ మరియు ఇంట్రావీనస్ ద్రవాలు.
- శస్త్ర వైద్య పరంగా కట్టుకట్టడం: కొల్లాజెన్ ఆధారిత, ఫైబ్రిన్-ఆధారిత మరియు జెలటిన్-ఆధారిత కట్టులు రక్త స్రావమును నివారించడానికి హేమాస్టాటిక్ (haemostatic) ఎజెంట్లను కలిగి ఉంటాయి.
- రక్తనాళాల సంకోచం కలిగించేవి (Vasoconstrictors): క్యాన్సర్తో ముడిపడి ఉన్న మూత్రాశయ లేదా మల రక్తస్రావం పై, రక్త నాళాలను సంకోచించడం ద్వారా రక్తస్రావాన్ని ఆపే కర్తలను ఉపయోగించడం. ఇక్కడ, రక్తస్రావం స్థలంలో ఎండోస్కోపీ ద్వారా వాటిని అందించడం జరుగుతుంది.
- రేడియోథెరపీ: ఊపిరితిత్తుల, మూత్రాశయం మరియు జీర్ణ వాహిక యొక్క క్యాన్సర్ల వలన రక్త నష్టాలలో.
- గడ్డకట్టే లోపాలు ఉన్నపుడు విటమిన్ K చికిత్స మరియ ఫైబ్రినోజెన్లు.
- గడ్డకట్టడాన్నిపెంచే యాంటిఫైబ్రినోలిటిక్స్.
- ప్లేట్లెట్లను, ఘనీభవించిన ప్లాస్మా లేదా రక్తాన్ని ఎక్కిచడం.
రక్తం యొక్క భారీ నష్టం, అంతర్గత లేదా బాహ్యంగా కావొచ్చు, అది ప్రాణాంతకం కావచ్చు. భారీ రక్తస్రావం జరిగినట్లయితే, నష్టాన్ని నివారించడానికి రక్తాన్ని ఎక్కించవచ్చు.
జాగ్రత్త - ఏ రకమైన రక్త నష్టం అయినా తక్షణ శ్రద్ధ అవసరం. కాబట్టి వైద్యుడుని వెంటనే సంప్రదించాలి. సకాలంలో నిర్ధారణ మరియు చికిత్స అనేది ఒక జీవితాన్ని కాపాడవచ్చు.