బ్లాడర్ ఇరిగేషన్ అంటే ఏమిటి?
బ్లాడర్ ఇరిగేషన్ అనేది ఏమంటే, శుభ్రమైన నీటితో లేదా సాధారణ సెలైన్తో మూత్రాశయ లోపలిభాగాన్ని శుభ్రపరిచే ప్రక్రియ. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది మరియు ఎలాంటి అవరోధం లేని మూత్రవిసర్జనకు తోడ్పడుతుంది. ముఖ్యంగా, మూత్రాశయానికి సంబంధించిన శస్త్రచికిత్సల తర్వాత ఈ ప్రక్రియతో సులభ మూత్రవిసర్జన సుసాధ్యం. బ్లాడర్ ఇరిగేషన్ వల్ల కాథెటర్లో అడ్డంకి ఏర్పడకుండా నివారించడానికి సహాయపడుతుంది. (కాథెటర్లో రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్, వాపువల్ల ఏర్పడే ఉత్పత్తుల కారణంగా అడ్డంకి ఏర్పడడం జరుగుతుంది, ఈ అడ్డంకిని బ్లాడర్ ఇరిగేషన్ ప్రక్రియ తొలగిస్తుంది.)
ఇది ఎందుకు జరుగుతుంది?
మూత్రాశయం లోపల తీవ్రమైన రక్తస్రావం ఏర్పడినప్పుడు వైద్యులు మూత్రాశయం శుబ్రపరిచే బ్లాడర్ ఇరిగేషన్ ప్రక్రియను సూచిస్తారు. ఈ ప్రక్రియ రక్తం గడ్డకట్టడాన్ని తొలగించి మూత్రం యొక్క ప్రవాహాన్ని నిరాటంకంగా జరిగేందుకు ఉపకరిస్తుంది. అంతర్గత-కాథెటర్ కల్గిన రోగులలో మూత్రం యొక్క ప్రవాహానికి దీర్ఘకాలికమైన తీవ్ర అవరోధం ఏర్పడినపుడు వివిధ సంకేతాలు మరియు వ్యాధిలక్షణాలు కనబడతాయి. .
- కాథెటర్ ద్వారా మూత్రం పొయ్యేందుకు ఎటువంటి మార్గం ఉండదు.
- కాథెటర్ చుట్టూ ఆకస్మిక మరియు తీవ్రమైనపొత్తికడుపునొప్పి కల్గుతుంది. పొత్తికడుపు (సంపూర్ణత్వం వల్ల) నిండిపోవడం మూలంగా ఇలా ఆకస్మిక మరియు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
- కాథెటర్ చుట్టూ మూత్రం యొక్క స్రావం అవుతుంది.
- దీర్ఘకాల కాథెటర్ అవరోధం తర్వాత చెమట పట్టడం పెరిగిపోవడం, వేగవంతమైన హృదయ స్పందన లేదా రక్తపోటు తగ్గుదల.
ఇది ఎవరికి కావాల్సి పడుతుంది?
బ్లాడర్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే మూత్రాశయంలో మూత్ర విసర్జన సమయంలో మూత్రపు ప్రవాహాన్ని అడ్డుకోగల రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం. మరియు అంతర్గత కాథెటర్లో కూడా మూత్రప్రవాహానికి ఏర్పడ్డ ఏదైనా అవరోధాన్ని నిరోధించడం ఈ బ్లాడర్ ఇరిగేషన్ ముఖ్య ఉద్దేశ్యం. :
- తీవ్రమైన మూత్ర నాళాల సంక్రమణం లేదా రక్తస్రావానికి కారణమయ్యే మూత్రాశయ అంటువ్యాధి.
- విస్తరించిన ప్రోస్టేట్ గ్రంధి
- ఇరుకైన మూత్రమార్గం లేదా మూత్ర మార్గ సంకోచము
- మూత్రపిండంలో రాళ్లు
- రక్తం గడ్డ కట్టడం వల్ల మూత్రాశయంలోకి కాథెటర్ను ప్రవేశపెట్టినప్పుడు అయ్యే గాయం లేదా అఘాతం.
- కోమాలోని వ్యక్తులు మరియు దీర్ఘకాలంగా మూత్రాశయంలో కాథెటర్ ఉన్నవారు.
- ప్రోస్టేట్ (TURP) ట్రాన్స్-మూత్ర విసర్జన వంటి ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన శస్త్రచికిత్సలు మరియు ప్రోస్టేట్ (HoLEP) యొక్క హోల్మియం లేజర్ ఎనూక్లియేషన్ శాస్త్ర చికిత్స
- మూత్రాశయం కణితి యొక్క ట్రాన్స్-మూత్ర విసర్జన (TURBT) మరియు మూత్రాశయం మరియు ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించిన ఇతర పద్దతులు వంటి మూత్రాశయం శస్త్రచికిత్స
- మూత్రాశయం కణితికి చేసే రేడియేషన్
బ్లాడర్ ఇరిగేషన్ ఎలా జరుగుతుంది?
మూత్రాశయాన్ని శుభ్రపరిచే ప్రక్రియను సాధారణంగా స్టెరైల్ వాటర్ లేదా సాధారణ సెలైన్తో నిర్వహిస్తారు. కొన్నిసార్లు ప్రత్యేక రసాయనాలు లేదా యాంటిబయోటిక్ మందులు అంటువ్యాధుల చికిత్సకోసం ఈ ప్రక్రియలోనే ఉపయోగిస్తారు. ఈ విధానం సాధారణంగా 3-మార్గాల కాథెటర్ సహాయంతో నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియలో, ద్రవం యొక్క పారుదల ప్రవాహాన్ని (irrigation) ఒకే సమయంలో మూత్రాశయంలోనికి బయటకు పంపడం కోసం ఉపయోగించబడుతుంది.
ఇటీవల బ్లాడర్ ఇరిగేషన్ కోసం వైర్లెస్ సెన్సార్లతో కూడిన ఆటోమేటిక్ పరికరాల్ని ఉపయోగించడంవల్ల ఈ ప్రక్రియ మరింత ప్రభావవంతమైనది మరియు సురక్షితమైనదిగా తయారైంది. ముఖ్యంగా, ఉదాహరణకు, విస్తరించిన ప్రోస్టేట్ గ్రంధి ఉన్న రోగులకు ఈ సెన్సార్ ఆటోమాటిక్ బ్లాడర్ ఇరిగేషన్ ప్రక్రియ సురక్షితమైనది గా నిరూపించబడింది.