బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ / అంటువ్యాధులు అంటే ఏమిటి ?
సహజంగా, శరీరం లోపల బాక్టీరియాలు ఉంటాయి, ఈ బాక్టీరియా ఏ హాని కలిగించదు కానీ శరీరం బయట వాతావరణంలో, కొన్ని ఇతర బాక్టీరియా కూడా ఉన్నాయి. ఈ ఇతరబ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే అంటువ్యాధులకు కారణమవుతుంది మరియు దానిని వ్యాధికారక బాక్టీరియా అని పిలుస్తారు. కొన్ని పరిస్థితులలో అంతర్గత సహజీవన బాక్టీరియా బలహీనమైన రోగనిరోధక శక్తి వలన మరియు వాటి అధిక పెరుగుదల వలన కూడా అవి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. బ్యాక్టీరియాతో వ్యాధులకు గురిఅయ్యే అవయవాలు ఊపిరితిత్తులు, గొంతు, ప్రేగు, చర్మం వంటివి. బాక్టీరియా సంక్రమణలు/ఇన్ఫెక్షన్లు ఒక వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాపించగలవు. అందువల్ల, వ్యక్తిగత మరియు సామజిక పరిశుభ్రతను నిర్వహించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అంటురోగాల వ్యాప్తిని నివారించాలి
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బాక్టీరియా సంక్రమణ/ ఇన్ఫెక్షన్ల యొక్క లక్షణాలు ప్రభావిత ప్రాంతం మరియు సంక్రమణ/ ఇన్ఫెక్షన్ తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. బాక్టీరియా సంక్రమణ యొక్క సాధారణ లక్షణాలు:
- దగ్గు.
- జ్వరం.
- తలనొప్పి.
- చలి.
- చెమటలు.
- కండరాల నొప్పి.
- అలసట.
- శ్వాసలో సమస్య.
- ప్రభావిత ప్రాంతంలో నొప్పి మరియు అసౌకర్యం.
- ప్రభావిత ప్రాంతం యొక్క వాపు మరియు ఎరుపు.
- ఆకలి తగ్గుదల.
ప్రధాన కారణాలు ఏమిటి?
సాధారణ సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) కలిగించే బాక్టీరియా:
- స్ట్రెప్టోకోకస్ (Streptococcus)
- స్టెఫిలకాకస్ (Staphylococcus)
- E. కోలి(E. coli)
- క్లేబ్సియెల్లా(Klebsiella)
- సూడోమోనాస్(Pseudomonas)
- మైకోబాక్టీరియం(Mycobacterium)
బాక్టీరియా సంక్రమణల /ఇన్ఫెక్షన్ల వ్యాప్తి ప్రమాదాన్ని పెంచే కారకాలు క్రింద ఉన్నాయి:
- దెబ్బలు మరియు గాయాలు.
- ఒక బాక్టీరియల్ సంక్రమణతో/ ఇన్ఫెక్షన్తో ఉన్న వ్యక్తిని తాకినప్పుడు.
- కలుషితమైన ఆహారం మరియు నీరు తీసుకోవడం.
- సంక్రమణ తో ఒక వ్యక్తి యొక్క మలం తగిలినప్పుడు.
- బాక్టీరియా సంక్రమణతో/ ఇన్ఫెక్షన్తో ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు ఆ చుక్కలను శ్వాసించడం వలన.
- కలుషితమైన భాగాలను తాకడం వంటి పరోక్ష సంబంధాలు కూడా సంక్రమణలను కలిగిస్తాయి.
ఎలా నిర్దారించాలి మరియు చికిత్సఏమిటి?
వైద్యులు క్రింది పద్ధతిలో నిర్ధారణ చేస్తారు:
- వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర గురించి సమాచారం తీసుకోవడం.
- వ్యక్తిగత భౌతిక పరీక్ష.
- రేడియోగ్రాఫిక్ అన్వేషణలు.(Radiographic findings)
- ల్యాబ్ పరీక్షలు రక్తం మరియు మూత్ర పరీక్షల వంటివి.
బ్యాక్టీరియా సంక్రమణ/ఇన్ఫెక్షన్ల యొక్క ఖచ్చితమైన చికిత్స బ్యాక్టీరియా యొక్క రకం మీద మరియు ప్రభావిత భాగం మీద ఆధారపడి ఉంటుంది. సమయోచిత, నోటి ద్వారా, లేదా సూది మందుల యాంటీబయోటిక్ చికిత్స సాధారణంగా బ్యాక్టీరియల్ సంక్రమణకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ఒకవేళ గతంలో సూచించిన చికిత్స బ్యాక్టీరియాను తగినంతగా తొలగించకపోతే వైద్యులు కొన్నిసార్లు యాంటీబయాటిక్ ను మార్చాలి.