అథ్లెట్స్ ఫుట్ లేక పాదానికి సోకిన బూజు అంటే ఏమిటి?
అథ్లెట్స్ ఫుట్ (పాదానికి సోకిన బూజు) అనేది పాదానికి ఉన్న వేళ్ళ మధ్య చర్మానికి దాపురించే బూజు రోగం (లేక దీన్నే పాదంలో ఫంగల్ ఇన్ఫెక్షన్) అంటారు. సాధారణంగా బొటనవేలు మధ్య చర్మాన్ని ఈ జబ్బు ప్రభావితం చేస్తుంది. ఈ జబ్బు సామాన్యంగా క్రీడాకారులకు దాపురిస్తూండడం మూలాన దీనికి
అథ్లెట్స్ ఫుట్ అన్న పేరు వాంచ్చింది. ఈ వ్యాధికి కారణమయ్యే బూజును (శిలీంధ్రం) “టినియా” అంటారు. అందుకే ఈ జబ్బును “టినియా పెడిస్” అని కూడా పిలుస్తారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- అథ్లెట్ల పాదంతో బాధపడుతున్న వ్యక్తి కాలివేళ్ళ మధ్య దురదలకు, మంటకు గురవుతాడు.
- జబ్బు సోకిన చోట చర్మానికి పొడిబారిన ఎర్రదనం , పొలుసులు లేచిన చర్మం కనబడుతుంది.
- కొంచెం రక్తస్రావంతో పాదాలపై బొబ్బలు లేదా పూతలు అరుదుగా ఉండవచ్చు.
- గోర్లు చిట్లిపోయి పెళుసుగా కనిపిస్తాయి.
- జబ్బు ప్రభావిత ప్రాంతాన్ని పదేపదే తాకినట్లయితే ఆ అంటురోగం (సంక్రమణము) చేతులు మరియు ఇతర భాగాలకు వ్యాపిస్తుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
- మైక్రోస్పోర్మ్ వంటి శిలీంధ్రాల సంక్రమణ వలన పాదాలకు బూజు సోకడం (అథ్లెట్స్ ఫుట్) జరుగుతుంది. ఇది ఒక అంటు వ్యాధి మరియు తాకడం ద్వారా లేదా, జబ్బు సోకిన సాక్స్, తివాచీలు మొదలైన వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
- అరుదుగా, బాక్టీరియా మరియు సోరియాసిస్ జబ్బులు కూడా ఈ వ్యాధిని పోలి ఉంటాయి.
- తడిసిన, అపరిశుభ్రమైన పాదాలు లేదా బాగా కత్తిరించి ఆరోగ్యాంగా నిర్వహించుకోని గోర్లు ఈ వ్యాధికి దారి తీస్తాయి.
- బహిరంగ ప్రదేశాల్లో ఒట్టి కాళ్లతో (అంటే పాదరక్షలు లేకుండా) నడవడం (బేర్ఫుట్ వాకింగ్) మరియు ఇతరులు వాడిన సాక్స్లు వాడటం అథ్లెట్స్ ఫుట్తో సంబంధం ఉన్న కొన్ని ప్రమాద కారకాలు. కార్యాలయాల్లో ఒకేచోట ఇద్దరు ముగ్గురు పనిచేసే పధ్ధతి (shared office spaces), ఈ అంటురోగం వ్యాప్తి చెందే కొన్ని ప్రాంతాల్లో జిమ్లు మరియు ఈత కొలనులు కూడా ఉన్నాయి.
- చక్కెరవ్యాధి (మధుమేహం)తో బాధపడుతున్న రోగులు లేదా ఎయిడ్స్ లాంటి ఇమ్మ్నోకాంప్రోమైడ్ పరిస్థితులు ఇటువంటి అంటురోగాలకు ఎక్కువ అవకాశం ఇస్తాయి.
- ఈ వ్యాధికి అధికమైన చెమట కూడా ఒక కారణం.
దీన్నెలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
- పాదం యొక్క భౌతిక పరీక్ష డాక్టర్ కు వ్యాధిని నిర్ధారించడానికి సహాయపడుతుంది. కొన్ని సార్లు, కారణం తెలియకపోతే, అడుగు యొక్క చర్మం బయాప్సీ ని నిర్ధారణ కొరకు నిర్వహిస్తారు.
- ఈ పరిస్థితి కి చేసే చికిత్సలో కింది ప్రక్రియలు ఉన్నాయి:
- శిలీంధ్ర నిరోధక మందులు-ఇవి (over the counter) మందుల షాపుల్లో లభిస్తాయి. మరియు వైద్యుడి సూచించిన (ప్రిస్క్రిప్షన్) ఔషధంగా అందుబాటులో ఉంటాయి. ఈ మందులు వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, 4 వారాల వరకు సూచించబడవచ్చు.
- వ్యాధికారక క్రిమి బాక్టీరియా అయినట్లయితే, యాంటీ-బాక్టీరియల్ మందులు సూచించబడతాయి. పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం, మరియు బరిగంగ ప్రదేశాల్లో పాదాలను రక్షించకోవటం ముఖ్యం. పాదాలకు సోకినా సంక్రమణం పూర్తిగా తొలగించబడకపోతే పునరావృతమవుతుంది.
స్వీయ రక్షణ (Self-care)
- తడిగా లేదా మురికి సాక్స్ మరియు బూట్లు ధరించడం మానుకోండి.
- బహిరంగ ప్రదేశాల నుండి, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ పాదాలను శుభ్రం చేసుకోండి.
- ఒకరు ఉపయోగించిన తువ్వాళ్లు, నేప్కిన్లు, సాక్స్ మరొకరు ఉపయోగించవ ద్దు.
- మీ పాదాలను రక్షించడానికి పాదం పూర్తిగా కప్పబడిన బూట్లు లేదా చెప్పులు ధరించాలి.