అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా అంటే ఏమిటి?
మెదడు క్యాన్సర్ లలో అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా అనేది చాలా అసాధారణమైన ఒక రకం. మెదడులో సాధారణంగా ఆస్ట్రోసైట్స్ (astrocytes) అని పిలువబడే నక్షత్ర ఆకారంలో ఉండే కణాలు ఉంటాయి. ఇతర మెదడు కణాలతో పాటు ఆస్ట్రోసైట్లు సాధారణంగా వెన్నుమూక మరియు మెదడుకు సంబంధించిన నరాల కణాలను కాపాడుతాయి. ఈ కణాలు గ్లియల్ (glial) కణాలుగా పిలువబడతాయి మరియు ఆ కణాలన్నీ కలిసి గ్లియల్ కణజాలంగా ఏర్పడతాయి; ఇటువంటి కణాల యొక్క క్యాన్సర్ ను గ్లియోమా (glioma) అని పిలుస్తారు. ఆస్ట్రోసైట్స్ యొక్క కణితులని ఆస్ట్రోసైటోమా (astrocytoma) అంటారు. అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా అనేది ఒక గ్రేడ్ III కణితి (tumour) , మరియు IVవ దశకు పురోగతి చెందితే, దీనిని గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే (glioblastoma multiforme) అని పిలుస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లయితే అది ఉన్నత గ్రేడ్ (high grade) గ్లియోబ్లాస్టోమా నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నట్లయితే అది తక్కువ గ్రేడ్ (low grade) గ్లైబ్లాస్టోమా. దురదృష్టవశాత్తు, అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమాకు చికిత్స లేదు, కానీ ఇది మరింతగా పెరగడాన్ని నిరోధించవచ్చు.
ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెదడు నిర్దిష్ట కార్యక్రమాలను నియంత్రించే ప్రత్యేక ప్రాంతాలను కలిగి ఉంది; అందువల్ల, ఈ వ్యాధి యొక్క లక్షణాలు కణితి పరిమాణం మరియు స్థానం మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, ఈ లక్షణాలను చూడవచ్చు: తలనొప్పి, వాంతులు, మగత, వ్యక్తిత్వ మార్పులు, మానసిక స్థితిలో మార్పులు, చేతులు మరియు కాళ్ళలో బలహీనత, మతిమరపు , సమన్వయ లోపాలు మరియు దృష్టి సమస్యలు.
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇటువంటి కణితుల యొక్క ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. కణాలకు అసాధారణతలను కలిగించి కణితి అభివృద్ధికి దారి తీసే కారణాల పై పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు, .
ఈ క్రింద ఉన్నవి కొన్ని కారణాలు కావచ్చు:
- జన్యుపరమైన అసాధారణతలు
- విషపదార్దాలు, రసాయనాలు మరియు హానికరమైన రేడియో ధార్మికత వంటి పర్యావరణ కారకాలు
- వ్యాధి నిరోధక శక్తి యొక్క అసాధారణత
- ఆహార విధానం
- ఒత్తిడి
ఆస్ట్రోసైటోమా (astrocytoma) అనేది ప్రత్యేకంగా కొన్ని, న్యూరోఫిబ్రోమటోసిస్ టైప్ I (neurofibromatosis type I), క్షయ వ్యాధి, లి-ఫ్రాముని సిండ్రోమ్(Li-Fraumeni syndrome) మరియు టర్కోట్ సిండ్రోమ్(Turcot syndrome) వంటి జన్యుపరమైన రుగ్మతలలో అధికంగా సంభవిస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క నిర్ధారణ కష్టం మరియు మునుపటి ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగత, క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్ష, మరియు వివిధ రకాల ఇమేజింగ్ పద్ధతులతో వివరణాత్మకంగా వైద్య పరీక్ష అనేది ఉంటుంది. మెదడు నిర్మాణాలను అధ్యయనం చేయడానికి మరియు కణితి పరిమాణం, స్థానం, మరియు విస్తీర్ణం ఆధారంగా అత్యంత కచ్చితమైన మూల్యాంకనం (evaluating ) నిర్వహించడం ద్వారా కణితికి చికిత్స చేస్తారు.
అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమాకు చికిత్స లేనప్పటికీ, కణితి యొక్క పురోగతిని నిరోధించడం ద్వారా ఈ అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమాను నిర్వహించడం జరుగుతుంది. శస్త్రచికిత్స చేసి తొలగించడం, రేడియేషన్ థెరపీ, మరియు కెమోథెరపీ వంటి వాటిని పరిస్థితిని బట్టి ఒంటిగా లేదా ఈ మూడు రకాల చికిత్సల కలయికతో ఈ ప్రాథమిక పద్ధతులను ఉపయోగించవచ్చు.
వైద్యులు, నర్సులు, మరియు ఆరోగ్య నిపుణుల బృందం పలు అంశాలను ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తి కోసం చికిత్స ఎలా కొనసాగించాలో నిర్ణయిస్తారు, అవి
- కణితి యొక్క ప్రాంతం, పరిమాణం, వ్యాప్తి మరియు ప్రమాదకర స్థాయి,
- వ్యక్తి యొక్క వయసు మరియు ఆరోగ్య స్థితి,
- ఆరోగ్య చరిత్ర, మరియు ఇతర ఆధారాలు.
శస్త్రచికిత్స చేసి కణితి యొక్క తొలగింపుకు ఒక ప్రాథమిక అంచనా చేయబడుతుంది మరియు ఇది చికిత్సకు మొదటి ఎంపికగా నిర్వహిస్తారు, తర్వాత రేడియోధార్మికత మరియు కీమోథెరపీ చేస్తారు. శస్త్రచికిత్స తొలగింపు సాధ్యం కాకపోతే, చికిత్సను ఒంటరిగా రేడియేషన్ థెరపీతో ప్రారంభించవచ్చు.
టమోజోలోమైడ్ (Temozolomide) (తేమడార్) అనేది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Food and Drug Administration (FDA)) వారి ద్వారా అనాప్లాస్టిక్ ఆస్ట్రోసైటోమా యొక్క చికిత్స కోసం పెద్ద వారిలో మాత్రమే ఆమోదించబడిన ఒకేఒక్క మందు.