మల ద్వార క్యాన్సర్ - Anal Cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 21, 2018

March 06, 2020

మల ద్వార క్యాన్సర్
మల ద్వార క్యాన్సర్

మలద్వార క్యాన్సర్ అంటే ఏమిటి?

మలద్వార క్యాన్సర్ జీర్ణశయాంతర వ్యవస్థ యొక్క అరుదైన క్యాన్సర్. ఇది జీర్ణశయాంతర క్యాన్సర్ల రకాలలో తక్కువ శాతంగా (1.5%) ఉన్నది, అయితే దాని సంభవంలో స్థిరమైన పెరుగుదల కనపడుతున్నది. మలద్వార క్యాన్సర్ పాయువు యొక్క పురీషనాళంలోని చివరి భాగం యొక్క క్యాన్సర్.

మలద్వార క్యాన్సర్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • మలద్వారం నుండి నొప్పి మరియు రక్తస్రావం.
  • ఫిస్ట్యులాలు (మలద్వారం మరియు తుంటి చర్మం మధ్య ఇరుకైన సొరంగం-ఆకారపు సంబంధం ) లేదా లీకోప్లాకియా (leucoplakia) (తెల్లటి, మందపాటి, తెసేయాలేని మచ్చలు) ఉండటం.
  • శారీరక పరీక్షలో తేలికగా గుర్తించబడే శోషరస గ్రంథుల (lymph nodes) వాపు .
  • మల ద్వార అంచుల వద్ద క్యాన్సర్ లక్షణాలు గట్టిగా, పైకి ఉబ్బిన మరియు అంచులలో పెరిగే పుండ్లుగా స్పష్టమవుతాయి.

అసాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • మలద్వార ప్రాంతంలో గడ్డలు.
  • మల విసర్జన చేసేటప్పుడు దురద.
  • మలద్వార కండరాల వ్యాకోచమును యొక్క బలహీనమైన పనితీరు, మలం బయటకు రావడాన్ని నియంత్రిస్తుంది, ఇది మలవిసర్జన నిగ్రహం లేకుండా చేస్తుంది.
  • కాలేయం యొక్క పెరుగుదల.
  • ప్రాధమిక మలద్వార క్యాన్సర్ యొక్క విస్తృత వ్యాప్తి (ఇతర అవయవాలకు).

మలద్వార క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలు ఏమిటి?

అత్యంత సాధారణ కారణం

  • మానవ పాపిల్లోమావైరస్ (human papillomavirus) సంక్రమణ (infection), లైంగిక సంక్రమణ వ్యాధి (S T Ds), మలద్వార క్యాన్సర్లను పెంచుతున్నట్లు తెలుస్తుంది.
    • ప్రమాద కారకాలు:
    • వయస్సు మరియు లింగం
      • వృద్ధులలో మరియు మహిళల్లో ఇది చాలా సాధారణం.
    • వైద్య పరిస్థితులు
    • జీవన శైలి
      • ధూమపానం.
      • బహుళ భాగస్వాములతో లైంగిక సంబంధం కలిగి ఉండడం.
      • స్వలింగ సంపర్కం, ముఖ్యంగా మగవారిలో.

మలద్వార క్యాన్సర్ యొక్క నిర్ధారణ మరియు చికిత్స ఏమిటి?

  • వ్యాధి నిర్ధారణ
    మలద్వార క్యాన్సర్ ను వైద్య సమస్య వివరణ మరియు లక్షణాలు ఆధారంగా పూర్తిగా నిర్ధారణ చేయలేము. కణితి యొక్క అంచనా కోసం మత్తు ఇచ్చి శారీరక పరీక్షతో చేస్తారు దానితోపాటు పాటుగా, మలద్వార క్యాన్సర్ను గుర్తించటానికి వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచిస్తారు:
    • ఎండో-ఆసమ్ అల్ట్రాసౌండ్ ప్రతిబింబనం (Endo-anal ultrasound imaging)
    • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI) (Magnetic resonance imaging)
    • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ / పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్
  • చికిత్స
    • అనేక సందర్భాల్లో, మలద్వార క్యాన్సర్కు ప్రాధమిక చికిత్స కెమోథెరపీ లేదా రేడియోధార్మిక చికిత్సగా ఉంది. వృద్ధ మరియు బలహీన రోగులకు, కీమోథెరపీ మరియు యాంటిబయోటిక్ రోగనిరోధకత సవరించవలసిన అవసరం.
    • రేడియోధార్మికత యొక్క ప్రతికూలత వల్ల రేడియో నెక్రోసిస్ (radio necrosis) (రేడియేషన్ వల్ల కణజాల నష్టం లేదా మరణం) జరుగుతుంది, దీని వలన శస్త్రచికిత్స అనేది సురక్షితమైన మార్గంగా మారింది. తీవ్రమైన క్యాన్సర్లకు లేదా మరియు అధికంగా పునరావృతమయ్యే చిన్న కణితులతో బాధపడుతున్నవారికి అబ్డోమినోపెరియానాల్ (abdominoperineal )తొలగింపు (మలద్వారం తొలగింపు, పురీషనాళం యొక్క చివరి భాగం తొలగింపు) అనేది మలద్వార క్యాన్సర్లకు ప్రామాణిక చికిత్సగా మారింది.
    • శోషరస (lymph nodes) కణుతుల నిర్వహణలో రేడియేషన్ థెరపీ ఉంటుంది. రేడియో ధార్మిక చికిత్స యొక్క వైఫల్య సందర్భాలలో, శోషరస (lymph nodes) కణుతుల యొక్క శస్త్రచికిత్స తొలగింపు అవసరమవుతుంది.
    • పునరావృత మలద్వార క్యాన్సర్లకు కోలొస్టొమీ (colostomy) (పెద్దప్రేగు యొక్క తొలగింపు) తో పాటు ఉదర సంబంధ తొలగింపు అవసరమవుతుంది.
    • ఇంట్రా-ఆపరేటివ్ రేడియోథెరపీ మరియు బ్రాచీథెరపీల (రేడియోధార్మిక ఇంప్లాంట్లు ప్రవేశ పెట్టడం) వలన మలద్వార క్యాన్సర్ తర్వాత చికిత్స యొక్క పునరావృత అవకాశాలను తగ్గిస్తాయి.
    • ఇతర చికిత్సా ఎంపికలు ఫోటోడైమినమిక్ (ఒక నిర్దిష్ట తరంగ కాంతి ఉపయోగించి) చికిత్స మరియు రోగనిరోధక చికిత్సలు ఉన్నాయి.



వనరులు

  1. Dr. Sajad Ahmad Salat, Dr. Azzam Al Kadi. Anal cancer – a review. Int J Health Sci (Qassim). 2012 Jun; 6(2): 206–230. PMID: 23580899
  2. Americas: OMICS International. Anal Cancer . [internet]
  3. Robin K.S Phillips,Sue Clark. Colorectal Surgery. Elsevier Health Sciences, 2013;346 pages
  4. Mayo Foundation for Medical Education and Research. Anal cancer.[internet]
  5. Cancer Reserch UK. [internet];Risks and causes of anal cancer

మల ద్వార క్యాన్సర్ వైద్యులు

Dr. Anil Gupta Dr. Anil Gupta Oncology
6 Years of Experience
Dr. Akash Dhuru Dr. Akash Dhuru Oncology
10 Years of Experience
Dr. Anil Heroor Dr. Anil Heroor Oncology
22 Years of Experience
Dr. Kumar Gubbala Dr. Kumar Gubbala Oncology
7 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు