సారాంశం
కడుపులో మంట కలిగేటువంటి పరిస్థితినే ‘ఆమ్లపిత్తము’ లేదా ‘ఆమ్లత్వం’ అంటారు. మనిషిలో వచ్చే ఈ తొందర పరిస్థితిని చెప్పేందుకు నేటి రోజుల్లో ‘ఎసిడిటి’ (గుండెల్లో మంట/heartburn) అనే పదాన్నే వాడటం చూస్తున్నాం. తేన్పులు, గొంతులో, ఛాతీలో చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే “నాకెంటో ‘ఎసిడిటీ’ గా ఉంది” అంటుంటారు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు. ప్రపంచవ్యాప్తంగా ఆడ, మగా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఛాతీ ప్రాంతంలో వచ్చే అతి సామాన్యమైన అనుభూతే ఈ ‘ఎసిడిటీ’ లేక ఆమ్లత్వం. ఆమ్లత్వం ప్రధానంగా ఛాతీలో మండే అనుభూతి కారణంగా గుర్తించబడింది. పొత్తికడుపు ఎగువ ప్రాంతంలో కొన్ని సార్లు ఇది చికాకు మరియు మంటను పుట్టిస్తుంది. ఆ మంటతో పాటు, తేలికపాటి నుండి ఓ మోస్తరుపాటి నొప్పి కూడా కలగొచ్చు. ఆమ్లత్వానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఏమంటే కడుపులోంచి ఆమ్లభరిత (పులుపు) ద్రవాలు ఛాతీలోని అన్నవాహిక (ఆహార గొట్టం) లోకి తిరిగి ఎగదన్నుకుని రావడమేనని పరిశోధనలు గట్టిగా సూచిస్తున్నాయి.