కురుపులు అంటే ఏమిటి?
కురుపు అనేది అవయవాలలో లేదా కణాలలో చీము చేరడం మరియు ఏర్పడటం . ఇది సూక్ష్మజీవులు, చనిపోయిన కణాలు, ద్రవం మరియు ఇతర వ్యర్దాలతో నిండి ఉంటుంది. ముఖం, నోరు, దంతాలు, మూత్రపిండాలు మరియు కడుపు వంటి అవయవాలలో మరియు శరీరంలో ఏదైనా భాగంలో ఇవి సంభవించవచ్చు. అయినప్పటికీ, చర్మపు కురుపులు చాలా సాధారణమైనవి.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- చర్మపు కురుపులు యొక్క సాధారణ లక్షణాలు ఎరుపుదనం, నొప్పి, వాపు మరియు పసుపు ద్రవంతో నింపబడిన ఒక చిన్న చర్మ పొక్కు.
- అంతర్గత అవయవాలు లో కురుపులు ఉంటే, ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ఆ ప్రాంతంలో నొప్పిని అనుభవించవచ్చు.
- కురుపులు ఊపిరితిత్తులలో ఉంటే, ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు, అలసట మరియు దగ్గు ఉంటాయి. కురుపులు ఎక్కడ ఉన్నాయనే దాని ఆధారంగా, అవి అవయవ పనితీరును ఆటంకపరచవచ్చు.
- అదేవిధంగా, ఒకకురుపు గవాద బిళ్ళల (టాన్సిల్స్) చుట్టూ ఉన్నప్పుడు, మాట్లాడేటప్పుడు మరియు మ్రింగుతున్నప్పుడు నొప్పిగా ఉంటుంది.
ప్రధాన కారణాలు ఏమిటి?
- బ్యాక్టీరియా, లేదా వైరస్లు, శిలీంధ్రాలు (ఫంగస్) మరియు పరాన్నజీవులు వంటి ఇతర సూక్ష్మ జీవుల వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ల వలన కురుపులు సాధారణంగా ఏర్పడతాయి.
- ఏదైనా అవయవంలో ఒక విదేశీ సూక్ష్మ జీవులు కూడా కురుపులను అభివృద్ధి చేయగలవు.
- బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు కురుపులను అభివృద్ధి చేయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. బలహీన రోగనిరోధక వ్యవస్థకు కారణమయ్యే పరిస్థితులు:
-
కొన్ని ఇతర వ్యాధులు సోకినప్పుడే కురుపులు సంభవించాలని లేదు. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా కురుపులు రావచ్చు.
-
సరిగ్గా ఎదగని జుట్టు వెంట్రుకలు ఇన్ఫెక్షన్ కు గురై వాటి చుట్టూ కురుపులను కలిగించవచ్చు, దానిని సెగగడ్డ అని పిలుస్తారు.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్సఏమిటి?
- వైద్యులు సాధారణ వైద్య పరీక్ష ద్వారా చర్మ కురుపులు నిర్ధారించవచ్చు. కారణం నిర్ధారించడానికి, మునుపటి వైద్య చరిత్ర మరియు ఇతర ప్రదేశాల్లో కురుపుల కోసం తప్పనిసరిగా శరీర తనిఖీ అవసరం.
- ఇన్ఫెక్షన్ల అనుమానం ఉంటే, వైద్యులు రక్త పరీక్ష లేదా కురుపుల ప్రాంతంలో ద్రవంలో ఉన్న సూక్ష్మ జీవుల సాగుకి (culture of microbes) ఆదేశించవచ్చు.
- ప్రభావితమైన అవయవ యొక్క X- రే లేదా CT స్కాన్ కురుపుల ఉనికిని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది, ఇది కంటికి కనిపించదు.
- చికిత్సా కురుపుల పరిమాణం మరియు స్థానం ఆధారంగా మారుతుంది. ఇది ఒక చిన్న, చిన్న చర్మ కురుపులు ఐతే, యాంటీబయాటిక్స్తో పాటుగా వేడి నీటి కాపడం వంటి గృహ సంరక్షణ సరిపోతుంది.
- అవయవాలలోని పెద్ద కురుపుల కోసం, శస్త్రచికిత్స ఎంపికగా ఉండవచ్చు.మత్తు ఇచ్చి , వైద్యులు కురుపులలోని పదార్దాలను బయటకు తీసేస్తారు. దీనితోపాటు, సంక్రమణను పూర్తిగా శుభ్రం చేయడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి .
- కోత మరియు పారుదల వంటి శస్త్రచికిత్సకు అనేక మార్పులు ఉన్నాయి. వైద్యుడు శరీరం యొక్క భాగం మరియు చీము యొక్క పరిమాణం ప్రకారం శస్త్రచికిత్సను చేస్తాడు.