మెనింజైటిస్ - Meningitis in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 10, 2018

March 06, 2020

మెనింజైటిస్
మెనింజైటిస్

మెనింజైటిస్ (మేధోమజ్జారోగం) అంటే ఏమిటి?

“మెనింజెస్” అనేవి మెదడుని, వెన్నుపామును కప్పివుంచిన కణజాల పొరలు. ఈ కణజాల పొరలు మెదడు మరియు వెన్నెముక రక్షణకు బాధ్యత వహిస్తాయి. ఈ పొరలు మరియు పొరల చుట్టుపక్కల ద్రవం యొక్క సంక్రమణ పుర్రెలో మంట మరియు వాపుకు కారణమవుతుంది. ఈ రుగ్మతని సకాలంలో రోగనిర్ధారణ చేసి చికిత్స చేయలేదంటే అది ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యాధి యొక్క ప్రారంభదశలోని నిర్దిష్ట లక్షణాలు మెడ బిగుసుకుపోవడం (stiff neck), జ్వరం, మరియు వికారం, వాంతులు, తలనొప్పితో కూడిన గందరగోళం.

  • ఈ వ్యాధి ఇతర లక్షణాలు కాంతికి సున్నితత్వం, చిరాకు మరియు తగ్గిన ఆకలి కలిగి ఉంటాయి .
  • పైన పేర్కొన్న లక్షణాలు మరింతగా వృద్ధి చెంది మార్పు చెందే స్పృహ, బలహీనమైన మెదడు విధులను మరియు మూర్ఛలను పెంచుతాయి .
  • బ్యాక్టీరియా మెనింజైటిస్ అనేది మెనింజైటిస్ యొక్క తీవ్రమైన మరియు అంటువ్యాధి రూపం. చర్మ దద్దుర్లు ఒక రకం బాక్టీరియల్ మెనింజైటిస్ యొక్క చివరి సంకేతం. మెదడు హాని, వినికిడి మరియు దృష్టి నష్టం అనేవి మెనింజై టస్కు  సంబంధం ఉన్న దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల్లో కొన్ని.
  • వైరల్ మెనింజైటిస్ అనేది అరుదుగా ప్రాణాంతక హానిని మరియు అంటుకొనే లక్షణాన్ని కల్గి ఉంటుంది, కానీ తలనొప్పులు మరియు జ్ఞాపకశక్తి సమస్యల వంటి దీర్ఘకాలిక లక్షణాలతో ప్రభావితమవుతుందిది.
  • శిలీంధ్ర (ఫంగల్) మెనింజైటిస్ వ్యాధి అరుదైనది మరియు ఇది క్యాన్సర్ లేదా ఎయిడ్స్ కల్గిన చాలా తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులలో చూడవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మెనింజైటిస్ అనేది అంటురోగమై ఉండవచ్చు లేదా అంటురోగం కాకపోనూ వచ్చు.

అంటురోగమైన మేధో మజ్జరోగం (ఇన్ఫెక్షియస్ మెనింజైటిస్) రక్తప్రసరణ ప్రవాహంలో మెదడుకు మరియు వెన్నెముకకు వ్యాప్తి చెందే సూక్ష్మజీవుల ద్వారా సంభవిస్తుంది. ఈ సూక్ష్మజీవులు మెదడుని, వెన్నుపామును కప్పివుంచిన కణజాల పొరలు మెనింజైటిస్ ను మరియు ఆ పొరల చుట్టూ ఉండే ద్రవాన్ని అంటుగా సోకుతాయి, తద్వారా మంట, వాపును కల్గిస్తాయి. మేధోమజ్జ రోగాన్ని (మెనింజైటిస్) కలిగించే కొన్ని సూక్ష్మజీవులు:

  • బాక్టీరియా - స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, నెసిరియా మింగైటైడ్స్
  • వైరస్ - ఇన్ఫ్లుఎంజా వైరస్, తట్టు వైరస్, HIV మరియు ఎకోవైరస్
  • ఫంగస్ - కాండిడా అల్బికాన్స్ , క్రిప్టోకాకస్ న్యుఫార్మాన్స్ మరియు హిస్టోప్లాస్మా

అంటురోగం కాని (coninfectious) కారణాలు:

  • క్యాన్సర్
  • రసాయనిక చికాకు
  • మందుల అలెర్జీలు
  • తలకు ​​గాయం లేదా మెదడు పుండు
  • ముఖ చర్మరోగం (లుపస్)

మెనింజైటిస్ ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మెనింజైటిస్ రుగ్మతకు ప్రారంభదశలోనే రోగనిర్ధారణ చేసి చికిత్స చేస్తే మెదడుకు కలిగే నష్టాన్ని మరియు సంభవించగల మరణాన్ని నిరోధించవచ్చు.

మెనింజైటిస్ను  నిర్ధారించడానికి క్రింది పరీక్షలను అత్యవసరంగా భావిస్తారు:

  • లంబార్ పంక్చర్ - బాక్టీరియల్ మెనింజైటిస్ను గుర్తించి, నిర్ధారించడానికి సహాయపడే సూక్ష్మజీవుల సంస్కృతి, CBC, ప్రోటీన్ మరియు గ్లూకోజ్ స్థాయిలు మరియు సి-రియాక్టివ్ ప్రోటీన్ (ఇన్ఫెక్షన్ మార్కర్) పరీక్షల కోసం సెరెబ్రోస్పానియల్ ద్రవం పరీక్షకు పంపబడుతుంది.
  • ఎలివేటెడ్ తెల్ల రక్త కణం గణనలు
  • తల యొక్క CT స్కాన్
  • మెనింజైటిస్ దద్దుర్ల కోసం సానుకూల గాజు పరీక్ష

చికిత్సలో క్రింది చర్యలు ఉంటాయి:

  • బ్యాక్టీరియా మెనింజైటిస్ను  (నరాలకు సూది ముందుగా ఎక్కించే పధ్ధతి ద్వారా) యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. ఈ యాంటీబయాటిక్స్  మందులు శరీరం నుండి సాంక్రామిక (అంటుకొనే) బాక్టీరియాను తొలగించడంలో ప్రభావవంతమైనవి.
  • ఫంగల్ మెనింజైటిస్ కు యాంటీ ఫంగల్ ఎజెంట్ మందులతో చికిత్స చేస్తారు.
  • వైరల్ మెనింజైటిస్ దానంతటదే నయమవుతుంది కానీ ఇంట్రావీనస్ యాంటీవైరల్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు.
  • మెనిన్గోకోకల్ టీకా మరియు హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా రకం బి టీకా వంటి టీకాలు కొన్ని రకాల మెనింజైటిస్కు  ప్రభావవంతంగా పని చేస్తాయి.
  • ఈ వ్యాధి ప్రబలి ఉన్న ప్రాంతాల్లో ప్రయాణం చేసే ముందు మంచి వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించడం మరియు ఈ వ్యాధికిచ్చే టీకా మందుల్ని వేయించుకుని వెళ్లడం, మెనింజైటిస్ నిరోధించడానికి సహాయపడుతుంది.



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Non-Infectious Meningitis.
  2. Runde TJ, Hafner JW. Meningitis, Bacterial. [Updated 2019 May 5]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  3. Meningitis. Paediatr Child Health. 2001 Mar;6(3):126-7. PMID: 20084221
  4. Department of Public Health [Internet]; Illinois, US; What is meningitis?
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Meningitis.

మెనింజైటిస్ వైద్యులు

Dr. Hemant Kumar Dr. Hemant Kumar Neurology
11 Years of Experience
Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మెనింజైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for మెనింజైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.