తలనొప్పి పరిష్కారానికై చికిత్సకై వీలయినంత త్వరగా డాక్టరు సలహా పాటించడం ముఖ్యం. మీ నొప్పి లక్షణాల ఆధారంగా మీ డాక్టరు క్రింది చికిత్సలను కొనసాగించవచ్చు.
అవగాహన పెంపొందించుకోండి
విజయవంతమైన చికిత్స కై గల కారకాలలో ఒకటి మీలో మీరు అవగాహన పెంపొందించుకోవడమే. మీరు ఏ రకం తలనొప్పిని అనుభవిస్తున్నారో దానిని తెలుసుకోవడం అవసరం. మీ డాక్టరు మీకు తలనొప్పి డెయిరీని కేటాయిస్తాడు. దానిలో మీరు మీ ఎదుర్కొంటున్న జబ్బు వివరాలను విపులంగా వ్రాస్తూ ఉండాలి. జబ్బు వివరాలతో పాటు ఎదురయ్యే కారకాలను , ఉపశమనానికై తీసుకొన్న చికిత్స, మరియు చెప్పుకొనదగిన తదుపరి అంశాలను పొందుపరచాలి.
మానసిక ఒత్తిడి నిర్వహణ
ఒత్తిడిని అదుపు చేయడం ఇదివరకు పేర్కొన్న విధంగా, నేటి పరిస్థితిలో మానసిక ఒత్తిడి తలనొప్పికి సాధారణ కారకాలలో ఒకటి. మీ డాక్టరు మీకు ఫలప్రదమైనట్టి ఒత్తిడి నివారణ ఉపాయాలను పేర్కొనవచ్చు. వాటిలో యోగా, ధ్యానం, లోతుగా శ్వాసక్రియ జరపడం వంటి వ్యాయామం, అరోమా థెరపీ, మ్యూజిక్ థెరపీ, వాటితోపాటు పెంపుడు జంతువుల, ప్రాణుల థెరపీ కూడా చేరి ఉండవచ్చు.
ధ్యానం గురించి మీ డాక్టరును సంప్రతించండి
జబ్బు లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే, లేదా అదుపు లేకుండా కొనసాగుతున్నట్లయితే, డాక్టరు మందులు సూచించవచ్చు. సాధారణంగా ఇవి మూడు రకాలుగా వర్గీకరింపబడుతాయి. :
- జబ్బు చిహ్నాల ఆధారంగా ఔషధాలు
వీటిలో సరళంగా కౌంటరులో లభ్యమయ్యే పారాసెటమాల్ , అస్పిరిన్, లేదా ఇబు ప్రోఫెన్ వంటి మందులు ఉంటాయి. అయితే హెచ్చుగా మందులు వాడటం వల్ల ప్రయోజనం కంటే ముప్పు ఎక్కువని గ్రహించాలి. భద్రత రక్షణ వివరాలకై మీ దాక్టరును సంప్రతించదం మంచిది.
- నిష్ఫలమైన మందులు
వీటి పేరును బట్టి ఇవి, తలనొప్పి చిహ్నాలను తొలగిస్తాయి తొలి చిహ్నం విస్తరించగానే ఇవి చికిత్స ప్రారంభిస్తాయి. ఈ వర్గం లో ఉపయోగించే మందులలో ఇంజక్షన్ మందులు, ఎర్గోటమిన్ మరియు సుమాట్రిప్టాన్ ఉంటాయి. అయితే వీటి కొనుగొలుకు ఔషధ సూచిక ( ప్రిస్కిప్షన్) అవసరం.
- నివారణ ఔషధాలు
ఈ రకం ఔషధాలు తరచుగా వచ్చే లేదా తీవ్రస్థాయిలో ఉండే తలనొప్పికి ఉపయోగిస్తారు. వాటిలో ట్రైసైక్లిక్ ఆంటిడిప్రెషంట్స్, అమిట్రైప్టిలిన్ వంటివి. కాల్షియం చానల్ బ్లాకర్స్, ఆమ్లోడిపైన్ వంటివి, ఆంటిహిస్టామైన్స్, ఫెనిరామిన్ వంటివి, ఆంటికాన్వల్సంట్స్ వాల్ప్రోయేట్ వంటివి, వీటిని మీ డాక్టరు సూచిస్తారు, వాటిని జాగ్రత్తగా వాడాలి.
ప్రత్యామ్నాయ థెరపీలను ప్రయత్నించండి
ఇప్పుడు కొత్త తరహా థెరపీలు లభిస్తున్నాయి, వాటిని సంరదాయకమైన థెరపీలతో సహా ఫలితాల మెరగుకై ఉపయోగించవచ్చు. వాటిలో చేరినవి :
- ఆక్యుపంచర్
- డీప్ బ్రెయిన్ స్టిములేషన్
- బయో ఫీడ్ బ్యాక్
- ప్రోగ్రెసివ్ మజుల్ రిలాక్సేషన్
- కౌన్సెలింగ్ థెరెపీ
జీవన సరళి ఔషధాలు
- తలనొప్పి సాధారణంగా జీవనసరళితో , అలవాట్లతో ముడిపడినందున, దాని నివారణ , అదుపునకు మీ జీవన విధానంలో కొద్దిపాటి, తేలిక అయిన చిన్న మార్పులను చేపట్టడం అవసరం,. అవి క్రింద పేర్కొన్నవాటికి మాత్రమే పరిమితం కావు
- రోజువారీ క్రమం తప్పకుండా నిద్రించడం
- రోజువారీ క్రమం తప్పకుండా భుజించడం
- రోజువారీ క్రమం తప్పకుండా వ్యాయామం
- క్రియాత్మకతను మానుకోవడం
- మానసిక ఒత్తిడి నిర్వహణ
- బరువు తగ్గించుకోవడం (వీలయితే)
- కాఫీని మానడం