సారాంశం

మానవ శరీర ఉష్ణోగ్రత 37°సె వద్ద లేక 98.6°ఫా. వద్ద నిర్వహించబడుతుంది. జ్వరము అనునది శరీర ఊష్ణోగ్రత 1°సె  పెరిగినదని వివరించుటకు ఉపయోగించు ఒక పదము. జ్వరము అనగా శరీరము యొక్క రక్షణ వ్యవస్థ వ్యాధి-కారక సూక్ష్మజీవులతో యుద్దం చేస్తుందని నమ్మవచ్చు.

జ్వరానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి కలిగించే వాహకము, వ్యవధి, మరియు జ్వరం యొక్క రకమును బట్టి అది తేలికపాటి నుండి తీవ్రత వరకూ ఉంటుంది. శరీరములోని జీవక్రియ ప్రక్రియలు అనునవి సాధారణముగా ఉష్ణోగ్రత ఆధారితమైనవి మరియు ఒక వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత  బేస్ లైన్ కంటే 1°సె  కంటే ఎక్కువగా అరుదుగా మారుతుంది.  

తేలికపాటి జ్వరమును తగ్గించుటలో దుకాణములో లభించే పారాసిటమోల్ వంటి మందులు సమర్థవంతంగా ఉంటాయి. అయితే, పరీక్షలు గనక ఒక ఇన్ఫెక్షన్ ని వెల్లడించినట్లయితే, అప్పుడు మీ డాక్టరుగారి సలహా మేరకు సముచితమైన చికిత్స అవసరమవుతుంది.

Stages of fever in Telugu

జ్వరము యొక్క దశలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి:

 

సెల్సియస్

ఫారెన్హీట్

హైపోథెర్మియా

<35°C

<95°F

మామూలుకంటే కొంచెం ఎక్కువ

35-36.7°సెంటీగ్రేడ్

95-97°ఫారెన్‌హీట్

సాధారణం

36.7-37.2° సెంటీగ్రేడ్

98-99°ఫారెన్‌హీట్

తేలిక జ్వరం

37.2 - 37.8° సెంటీగ్రేడ్

99 - 100° ఫారెన్‌హీట్

మధ్యస్థమైన జ్వరం

37.8-39.4° సెంటీగ్రేడ్

100-103°ఫారెన్‌హీట్

అధిక జ్వరం

39.4-40.5°సెంటీగ్రేడ్

103-105°ఫారెన్‌హీట్

హైపర్‌పైరెక్సియా

>40.5°C

>105°F

జ్వరము యొక్క వ్యాధినిర్ధారణ - Diagnosis of Fever in Telugu

ఏదైనా ఇన్ఫెక్షన్ లేక ఇతర కణం శరీరములో ఉన్నప్పుడు జ్వరము వస్తుంది, ఇది మీ యొక్క శరీరమును సాధారణముగా పనిచేయకుండా ఆపివేస్తుంది.  ఇది ఒక వ్యాధి కాదు అయితే ఇది అంతర్లీనముగా ఉన్న ఇన్ఫెక్షన్ లేక ఇతర వ్యాధులను సూచిస్తుంది. జ్వరము యొక్క అంతర్లీన కారణమును కనుగొనడము వలన, ఒక నిర్ధిష్టమైన చికిత్సను ప్రారంభించవచ్చు.  ఒకవేళ జ్వరము యొక్క కారణము స్పష్టముగా తెలియకపోతే, అప్పుడు డాక్టర్ రోగి యొక్క పూర్తి వైద్య చరిత్రను తీసుకుంటాడు మరియు విభిన్న గుర్తుల కొరకు చెక్ చేస్తాడు, ఈ గుర్తులు జ్వరము యొక్క అంతర్లీన కారణమును కనుగొనుటకు క్లూ(ఆధారము) ను ఇస్తాయి.  ఒక డాక్టరు సూచించగల కొన్ని పరీక్షలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • రక్త పరీక్షలు (వైవిధ్యమైన తెల్ల రక్త కణాల గణనతో సహా)
  • మూత్ర పరీక్ష మరియు కల్చర్
  • గొంతు ఉండలు లేదా శ్లేష్మము నమూనా పరీక్ష మరియు కల్చర్
  • మల పరీక్ష మరియు కల్చర్
  • ఎక్స్-కిరణాలు

ఇంటివద్ద, ఒక థర్మామీటరును ఉపయోగించి ఉష్ణోగ్రతను నమోదు చేసుకోవడం వల్ల జ్వరం యొక్క పోకడను కనిపెట్టుకొని ఉండటానికి సహాయమవుతుంది. శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి శరీరముపై థర్మామీటరును ఉంచే 4 సామాన్య చోట్లు ఉన్నాయి. అవి:

  • ఏక్సిల్లా (చంకలో)
    థర్మామీటరు యొక్క కొన భాగము చంకలో ఉంచబడుతుంది. థర్మామీటరు యొక్క స్థానము మారకుండా సుతారముగా చేతిని క్రిందికి తగ్గించి అదమండి. 1 నిముషం పాటు అలాగే ఉంచండి. సామాన్యంగా, చంక నుండి వచ్చే రీడింగులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 1°C తక్కువగా ఉంటాయి. కాబట్టి తదనుగుణంగా రీడింగును సర్దుబాటు చేసుకోండి మరియు డాక్టరు అడిగినట్లయితే వాటిని రికార్డు చేసుకోండి.
  • కర్ణభేరి
    ఒక చిన్న పిల్లవాని సందర్భములో కర్ణభేరి థర్మామీటర్లను సరియైన మార్గములో ఉంచుతారు.  చెవిలో గులిమి అనునది తప్పుడు రీడింగులను ఇస్తుంది.
  • ఓరల్ (నోటి సంబంధ)
    4 సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ వయసున్న పిల్లల యొక్క ఉష్ణోగ్రతను నోటి ద్వారా తీసుకుంటారు.  థర్మామీటర్ యొక్క కొనను నాలుక క్రింద ఉంచి సక్రమముగా నోటిని మూసివేయాలి, ఎందుకంటే తెరచి ఉంచిన నోరు ఖచ్చితముగా లేని రీడింగును ఇస్తుంది.  థర్మామీటరును ఒక నిమిషము వరకు అలాగే ఉంచాలి.
  • మల(పురీష)
    ఈ పద్ధతిని 3 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు గల పిల్లలలో ఉపయోగిస్తారు.  ఇది ఒక ఖచ్చితమైన రీడింగును ఇస్తుంది.  రెక్టల్ (మల) ఉష్ణోగ్రత అనునది శరీర ఉష్ణోగ్రత కంటే దాదాపుగా 1°C ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి తదనుగుణంగా రీడింగును సర్దుబాటు చేసుకోండి.

జ్వరము యొక్క చికిత్స - Treatment of Fever in Telugu

ఒకవేళ జ్వరం స్వల్పముగా ఉంటే మరియు తిరిగి మరలా రాకుండా ఉంటే, అప్పుడు ఆదర్శముగా ఎటువంటి చికిత్స అవసరం లేదు ఎందుకనగా అది తనంతట తానుగా తగ్గిపోతుంది.  జ్వరము అనేది, సూక్ష్మజీవులపై పోరాడడానికి శరీరము యొక్క రక్షణ వ్యవస్థ అయి ఉంటుంది. శరీరములో ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గుల కారణంగా సూక్ష్మజీవులు శరీరములో బ్రతకజాలవు. జ్వరము లేక దాని నుండి పెరిగిన లక్షణాలను అధిగమించడానికి ఇక్కడ కొన్ని సాధారణ స్టెప్స్ తీసుకోబడ్డాయి.  అవి:

  • తగినంత ద్రవాలను త్రాగాలి, ఇవి మీ శరీరమును చల్లబరచడములో సహాయపడతాయి మరియు డిహైడ్రేషన్ ను నివారిస్తాయి.
  • మీ జ్వరము తగ్గువరకు సులభముగా జీర్ణమయ్యే ఆహారమును తీసుకొనండి.
  • తగినంతగా విశ్రాంతి తీసుకోండి.
  • గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి
  • చల్లటి తాపడం చేయించుకోండి. శరీర ఉష్ణోగ్రతను చల్లబరచడానికి నుదుటిపై తడి గుడ్డను ఉంచుకోండి.
  • తాజా గాలి ప్రసరణ కొరకు ఫ్యాన్ ఆన్ చేసి ఉంచండి.

తేలికపాటి జ్వరమును తగ్గించుటలో ఒటిసి (దుకాణములో లభించే) పారాసిటమోల్ వంటి మందులు సమర్థవంతంగా ఉంటాయి. అయితే ఒకవేళ రక్త పరీక్ష ద్వారా చేసిన రోగనిర్ధారణ ఇన్ఫెక్షన్ ను ప్రదర్శిస్తే, అప్పుడు డాక్టరు యొక్క సలహా ఆధారముగా సరియైన చికిత్సా ప్రణాళికాను అనుసరించాలి.   డాక్టర్ కొన్ని యాంటిబయాటిక్స్ ను అదే విధముగా యాంటిపైరేటిక్స్ లను ఈ వ్యాధికి చికిత్స చేయుటలో సహాయ పడుట కొరకు సూచిస్తాడు.

శిశువులలో కొన్ని రోజులపాటు ఒకవేళ జ్వరం నిలిచిఉంటే, ఖచ్చితముగా హాస్పిటల్ లో చేర్పించడం అవసరమవుతుంది.

జీవనశైలి యాజమాన్యము

జ్వరము అనునది ఒక సాధారణ లక్షణము, వేరొక పదార్థము శరీరములోనికి చేరడం వలన శరీరము పని చేసే పద్ధతిలో ఏదైనా చిన్నమార్పు కలుగుటకు కారణమయితే దానిని జ్వరము అంటారు.  అందువలన, దీనిని అదిగమించడానికి ఏ విధమైన గణనీయమైన మార్పులు చేయనవసరము లేదు.  సాధారణముగా, జ్వరము, ఒత్తిడి లేక శరీరము ఎక్కువగా పనిచేయడము లేక విశ్రాంతి లేకపోవడము వలన సంభవిస్తుంది.  ఒకవేళ వస్తే, దాని కారణాలను తొలగించుటకు సరియైన చర్యలను తీసుకోవాలి.  తగినంత విశ్రాంతి తీసుకోవాలి మరియు ధ్యానం చేయాలి.  ఒకవేళ ఒక వ్యక్తి, అలర్జీలు అనగా దుమ్ము లేక అధిక సూర్యకాంతి/వేడి వంటి వాటికి గురి అయితే, ఇవి శరీరములో మార్పులకు అనగా దగ్గు లేక వడ దెబ్బ వంటివి ఏర్పడటానికి కారణమవుతాయి, వాటిని తొలగించడానికి ప్రయత్నించండి.  పబ్లిక్ రవాణా ద్వారా ప్రయాణించడాన్ని తొలగించండి, ఎందుకనగా తక్కువ ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

జ్వరమును నిర్వహించడం అనగా తగినంత విశ్రాంతిని తీసుకోవడము మాత్రమే కొన్నిసార్లు సరిపోతుందని నిరూపించబడింది.  శరీరము యొక్క హైడ్రేషన్ ని నిర్వహించడానికి తీసుకునే ద్రవాల పరిమాణమును పెంచాలి మరియు రక్తములో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను మెయిన్ టెయిన్ చేయాలి.  బరువు తక్కువగా ఉండే దుస్తులు ధరించాలి, అనగా. సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి మరియు రూములోనికి గాలి వచ్చేటట్లు చూసుకోవాలి.  వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మరియు చిన్న పిల్లల విషయములో, ఖచ్చితముగా మరియు ఎప్పటి కప్పుడు తాజాగా టీకా షెడ్యూలును పరిశీలిస్తూ ఉండాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.

Dr. Samadhan Atkale

General Physician
2 Years of Experience

Dr.Vasanth

General Physician
2 Years of Experience

Dr. Khushboo Mishra.

General Physician
7 Years of Experience

Dr. Gowtham

General Physician
1 Years of Experience

Medicines listed below are available for జ్వరము. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

OTC Medicine NamePack SizePrice (Rs.)
Myupchar Ayurveda Ashokarishta450 ml Arishta in 1 Bottle359.0
Myupchar Ayurveda Patrangasava 450ml450 ml Asava in 1 Bottle449.0
SBL Influenzinum Dilution 1000 CH30 ml Dilution in 1 Bottle110.7
Dr. Reckeweg R4 Diarrhoea Drop22 ml Drops in 1 Bottle250.8
SBL Ocimum sanctum Mother Tincture Q30 ml Mother Tincture in 1 Bottle90.2
Baksons B1 Influenza & Fever Drop30 ml Drops in 1 Bottle170.0
Schwabe Baptisia tinctoria Dilution 3X30 ml Dilution in 1 Bottle102.0
SBL Baptisia tinctoria Dilution 200 CH30 ml Dilution in 1 Bottle98.4
Baidyanath Marichyadi Bati10 gm Vati/Bati in 1 Bottle77.0
Planet Ayurveda Haritaki Powder100 gm Powder in 1 Bottle400.0
Read more...
Read on app