సారాంశం
సాధారణంగా లూజు లేదా నీళ్ళ బేదులు అనబడే అతిసార వ్యాధి (డయేరియా) జీర్ణవ్యవస్థ మార్గము యొక్క ఒక రుగ్మత. ఒక వ్యక్తి, అతడు/ఆమె ఒక రోజులో మూడు లేదా అంతకు మించిన సార్లు (లేదా మామూలు కంటే ఎక్కువగా) ద్రవ లేదా నీళ్ళ బేదులు చేస్తే, అతిసార వ్యాధి ఉన్నట్లుగా చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరమూ సుమారు 1.7 బిలియన్ల బాల్యపు అతిసార వ్యాధి కేసులు ఉంటున్నాయి. అందువల్ల, బాల్యపు అతిసారవ్యాధి 5 సంవత్సరాల లోపు పిల్లలలో పోషకాహార లోపానికి ఒక అతి ముఖ్యమైన కారణముగా ఉంది. ఇండియాలో, సంవత్సరానికి 300,000 పిల్లల మరణాలకు లెక్కకడుతూ (అదే వయసు గ్రూపు పిల్లల మొత్తం మరణాలలో 13 శాతంగా) అతిసార వ్యాధి మూడవ అతి పెద్ద కారణంగా ఉంది. తీవ్రమైన అతిసారవ్యాధి సామాన్యంగా వైరస్ లు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల కలుగుతోంది. అతిసారవ్యాధిని కలిగించే ఇన్ఫెక్షన్ మామూలుగా కలుషితమైన నీటిని త్రాగడం వల్ల మరియు ఆహారాలను సరిగ్గా చేపట్టకపోవడం వల్ల వ్యాపిస్తుంది. అలా, వ్యక్తిగత పారిశుభ్రత లేమి మరియు వాతావరణ పరిశుభ్రత ఇన్ఫెక్షన్ వ్యాప్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అతిసారవ్యాధి యొక్క తీవ్రమైన కేసులు నీరు మరియు ఎలక్ట్రోలైట్ల శీఘ్రనష్టానికి కారణం కావచ్చు తద్వారా నిర్జలత్వానికి దారితీయవచ్చు. కాబట్టి, సకాలములో చికిత్స చేయకపోతే, తీవ్ర అతిసారవ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. అతిసార వ్యాధితో హెచ్ఐవి-పాజిటివ్ కలిగిన పిల్లల యొక్క మనుగడ రేటు చాలా తక్కువగా ఉంటుంది మరియు మరణ రేటు అనునది, అతిసార వ్యాధితో హెచ్ఐవి-నెగటివ్ కలిగిన పిల్లల కంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. టీకా చికిత్సలోని నూతన విధానాలు (రోటావైరస్ టీకా), తల్లిపాలు పట్టడం, మెరుగైన పారిశుద్ద్యం, మరియు పరిశుభ్రత అనునవి చిన్న పిల్లలలో అతిసారం వచ్ఛే సందర్భాలను తగ్గించడములో సహాయపడతాయి.