విరేచనాలు (అతిసారం) అంటే రోజుకు కనీసం మూడు సార్లు మలవిసర్జన నీళ్లలా అవుతుంది. సంక్రమణ (ఇన్ఫెక్షన్) రకాన్ని బట్టి ఈ పరిస్థితి కొన్ని రోజుల నుండి వారాల వరకు ఉంటుంది. ఇది ఉదర ఉబ్బరం, వాయువు (గ్యాస్) లేదా అపానవాయువుతో కలిసి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అతిసారం వల్ల కలిగే ద్రవ నష్టం తరచుగా డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.
సమాయంతో పాటు తరచుగా, విరేచనాలు మరింత తీవ్రంగా మారతాయి మరియు ప్రతిస్పందన తగ్గిపోవడం, మూత్రవిసర్జన, హృదయ స్పందన రేటు మరియు చర్మం రంగు కోల్పోవడం వంటి ఇతర పరిస్థితులకు దారితీస్తుంది. అతిసారం అనేది అన్ని వయసులవారిని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం, ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉండే దేశాలలో చిన్న పిల్లలలో, వ్యాధులు మరియు మరణానికి కారణాలలో అతిసారం ఒకటి.
అసలు అతిసారం ఎందుకు వస్తుంది?
ఈ క్రింద పేర్కొన్న అనేక రకాల కారణాల వల్ల అతిసారం సంభవించవచ్చు. అయితే, కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది.
- బ్యాక్టీరియా, వైరస్ లేదా పరాన్నజీవులు (పారసైట్) అతిసారం యొక్క ప్రధాన కారక జీవులు.
- వేరేచనాలకి కారణమయ్యే వైరస్లలో రోటవైరస్, అడినోవైరస్ మరియు నోరోవైరస్లు రకాలు ఉంటాయి.
- బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరింత తీవ్రమైన విరేచనాలకు కారణమవుతాయి. అతిసారానికి కారణమయ్యే బ్యాక్టీరియాలలో షిజెల్లా (Shigella), కాంఫైలోబాక్టర్ (Campylobacter), ఎస్చెరిషియా కోలి (Escherichia coli), యెర్సినియా (Yersinia), లిస్టిరియా (Listeria) మరియు సాల్మొనెల్లా (Salmonella) ఉన్నాయి.
- అతిసారానికి కారణమయ్యే ప్రధాన పరాన్నజీవులు ఎంటామీబా హిస్టోలిటికా (Entamoeba histolytica), గియార్డియా లాంబ్లియా (Giardia lamblia) మరియు క్రిప్టోస్పోరిడియం (Cryptosporidium).
- ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సిలియాక్ వ్యాధి మరియు మైక్రోస్కోపిక్ కొలైటిస్ వంటి కొన్నిప్రేగుల వ్యాధులు కూడా అతిసారానికి కారణమవుతాయి.
- గౌట్, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల కోసం మందుల ప్రతిచర్యల కారణంగా మరియు కొన్ని యాంటీబయాటిక్ల ప్రతిచర్యల కారణంగా కూడా అతిసారం సంభవిస్తుంది.
- లాక్టోస్ అసహనం (lactose intolerance) వంటి కొన్ని అలెర్జీలు అతిసారానికి కూడా కారణమవుతాయి.
- మద్యపాన దుర్వినియోగం, అనగా మద్యాన్ని అధికంగా తాగడం కూడా విరేచనాలకు కారణం కావచ్చు.
- లింఫోమా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా అతిసారానికి కారణం కావచ్చు.
విరేచనాలు ఉన్నట్లు తెలిపే సంకేతాలు
అతిసారం/విరేచనాల యొక్క లక్షణాలు అది ఎలా వచ్చిదనే దానిపై ఆధారపడి మారవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు సాధారణంగా తేలికపాటి నుండి మధ్యస్తంగా ఉంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి మరియు జ్వరం వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ సందర్భంలో మలవిసర్జన చాలా తరచుగా ఉంటుంది మరియు నీటితో కూడిన వదులుగా ఉండే మలం మరియు వాయువు బలంగా బయటకు వెలువడడం వంటివి జరుగుతాయి. అతిసారానికి కారణమయ్యే మరింత తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో, మలం చీము, శ్లేష్మం లేదా రక్తంతో కూడి ఉంటుంది.