వెంటనే ఉపశమనం అందించడానికి, మీ వైద్యుడు విరేచనాకారిని సిఫారసు చేయవచ్చు. ఈ లాక్సేటివ్స్ మలబద్ధక చికిత్సకు అప్పుడప్పుడు సహాయం చేస్తాయి, కానీ అంతర్లీనంగా ఉండే సమస్యను నయం చేయలేవు. లాక్సైటివ్ల మితిమీరిన ఉపయోగం చాలా దుష్ప్రభావాలకు దారి తీస్తుంది మరియు దీర్ఘకాలిక ఉపయోగం హానికరం కావచ్చు
వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే లాక్సైటివ్ల మితిమీరిన వాడకం మలబద్ధకం ఉన్న ప్రజలలో చాలా సాధారణం. తినడంలో లోపాలు ఉన్న వ్యక్తులలో, లాక్సైటివ్ల నిరంతరాయ వినియోగం చాలా హానికరం మరియు జీర్ణాశయం యొక్క గోడకు హాని చేయవచ్చును. కాబట్టి, ఉపశమనం పొందడానికి ఓవర్ ది కౌంటర్ లాక్సేటివ్స్ జాగ్రత్తగా వాడాలి.
లాక్సేటివ్స్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించాలి:
- మల విసర్జన చేసేటప్పుడు రక్తం రావడం.
- ముక్కు నుండి రక్తస్రావం అవ్వడం
- పొత్తి కడుపు నొప్పి.
- వికారం.
- ప్రేగు కదలికలలో మార్పు.
- బలహీనత.
మలబద్ధక చికిత్స కోసం అనేకమైన లాక్సేటివ్స్ మందుల దుకాణాలలో లభిస్తున్నాయి. ఓరల్ ఓస్మోటిక్ ఏజెంట్లు మల విసర్జన సులభం చేయటానికి పెద్దప్రేగులోకి నీటిని ఆకర్షిస్తాయి ఓరల్ బల్క్ ఫార్మర్లు మలం ఏర్పడటానికి నీటిని శోషించడం ద్వారా సరసన మార్గంలో పనిచేసి, మల విసర్జనను తేలిక చేస్తాయి. ఇతర లాక్సేటివ్స్ లో ఓరల్ స్టూల్ సాఫ్టేనెర్స్ మరియు ఓరల్ స్టిములంట్స్ కూడా ఉన్నాయి.
ఓరల్ లాక్సేటివ్స్ కొన్ని పోషకాలు మరియు ఔషధాలను శోషించడానికి శరీర సామర్ధ్యానికి అడ్డు కలగచేయవచ్చును. కొన్ని లాక్సేటివ్స్ ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కూడా కలిగిస్తాయి. లాక్సేటివ్స్ తీసుకునే ముందు, ఈ క్రింది విషయాలను సరి చూడటానికి లేబుల్ చదవడం ముఖ్యం:
- కూడుకున్న దుష్ప్రభావాలు.
- ఔషధ సంకర్షణ.
- మధుమేహం, మూత్రపిండ సమస్యలు, లేదా గర్భం వంటి ఆరోగ్య పరిస్థితుల ఉనికి.
- 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ముందుగా వైద్యులను సంప్రదించకుండా లాక్సేటివ్స్ ని ఇవ్వకూడదు.
- తినే అలవాట్లు మరియు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరంగా ఉంచవచ్చని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకం తీవ్రంగా మరియు కాలక్రమేణా తీవ్రస్థాయిలో ఉంటే, వైదేడు కొన్ని ఇతర మందులను సూచించవచ్చుఒకవేళ ఏదైనా అడ్డుపడితే, దాన్ని సరిదిద్దడానికి వైద్యులు శస్త్రచికిత్స ను సిఫార్సు చేయవచ్చు.
ఇంటి చిట్కాలు
మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో ఇంటి చిట్కాలు చాలా సహాయకరంగా ఉంటాయి. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- ఇంగువ
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చిటికెలు ఇంగువ కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి
- వాము విత్తనాలు
ఒక పాన్లో వాము విత్తనాలను దోరగా వేయించి పొడి చేసుకొని, గోరువెచ్చని నీటితో దీన్ని తాగండి
- నీళ్లు
మీరు అప్పుడప్పుడు స్వల్ప మలబద్ధత ఎదుర్కొంటున్నట్లైతే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి, ఇది ప్రేగు కదలికలను కలగజేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా క్రమంగా నీరును త్రాగుతూ ఉండాలి.
- కాఫీ
కెఫీన్ ఒక సహజమైన లాక్సేటివ్ మరియు సహజంగా ఇది చాలా తేలికపాటిది.. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ కాచుకుని తాగండి. ఎవరైనా ఈ చిట్కా మీద ఆధారపడకూడదు ఎందుకంటే కెఫీన్ నిర్జలీకరణాన్ని కలుగజేసి మరియు నిద్రవేళలో తీసుకున్నప్పుడు నిద్ర సమస్యలు కలుగజేయవచ్చు.
జీవనశైలి నిర్వహణ
- ఆహరం
మలబద్ధకం నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం నివారించడానికి, ఆహారంలో మరింత పీచు పదార్ధాలు చేర్చడం ముఖ్యం. పుష్కలమైన నీటితో పాటు పీచు పదార్ధం అధికంగా ఉండే ఆహారాలు ఉపశమనాన్ని అందించడంలో బాగా సహాయపడతాయి. ఒక సగటు మనిషికి ప్రతిరోజూ 25 గ్రాముల పీచు పదార్ధం అవసరమవుతుంది. గోధుమ రొట్టె, వోట్మీల్ వంటి తృణధాన్యాలు పీచుపదార్ధాలు అధికంగా ఉండే మంచి ఆహార వనరులు. రాజ్మా మరియు సోయాబీన్స్ వంటి పప్పుదినుసులలో కూడా పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. ఆకు కూరలు పీచు పదార్ధాలు అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా సరఫరా చేస్తాయి. అధిక పీచు పదార్ధాలకై బాదం మరియు వేరుశెనగ వంటి పప్పులను, ఆరోగ్యకరమైన కొవ్వులుగా తీసుకోవచ్చు.
- జీర్ణప్రక్రియలు సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. మలం మృదువుగా మరియు విసర్జన సులభం అవ్వడానికి కూడా నీరు సహాయపడుతుంది. పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను కూడా తీసుకోవచ్చు.
- ప్రోబయోటిక్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది.
- ఆహారం-సంబంధ మలబద్ధతను నివారించడానికి, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఎయిరేటెడ్ పానీయాలు మరియు ఘనీభవించిన ఆహారాలను తినకుండా ఉండండి
వ్యాయామం
క్రమం తప్పని శారీరక వ్యాయామం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు ప్రేగు కండరాలను ప్రేరేపిస్తుంది. వైద్యుడు కూడా పేగులు ఒక క్రమ పద్ధతిలో రూపొందించడానికి ప్రేగుల శిక్షణను సూచించవచ్చు, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.
మందులు
మీరు ఏదైనా మందులు లేదా సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లైతే, మలబద్ధకానికి కారణం ఇవి కావచ్చేమో అని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. అలా గనుక అయితే, మీరు ప్రత్యామ్నాయ మందు కోసం అభ్యర్థించవచ్చు.