సారాంశం
యోనివాపు (Vaginitis) అనేది పునరుత్పత్తి (రజస్వల లేక పుష్పవతి) వయస్సు గల స్త్రీల జననాంగం (యోని), దానిచుట్టుపక్కల యోనిపెదవుల యొక్క వాపు వల్ల కలిగే నొప్పి మరియు అసౌకర్యం. ఇది సాధారణంగా బ్యాక్టీరియా లేదా ఫంగల్ (బూజు) లేదా పరాన్నజీవి సంక్రమణ వల్ల వస్తుంది. కొన్నిసార్లు, క్రీములు లేదా చొప్పించిన గర్భనిరోధక పరికరాలు వంటి ఉత్పత్తులకు అలెర్జీ ప్రతిచర్య కారణంగా యోనివాపు సంభవించవచ్చు. యోనివాపులో, యోని మరియు యోనిలో అసాధారణమైన యోని ఉత్సర్గతో పాటు వాపు, చికాకు, ఎరుపు మరియు దురద పెట్టడం ఉంటుంది. దీని సంకేతాలు మరియు లక్షణాలను గమనించి రోగ నిర్ధారణ జరుగుతుంది. అవసరమైతే, యోనివాపు యొక్క ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి యోని స్రావం ద్రవాన్ని సూక్ష్మదర్శిని కింద పరీక్షకు పంపవచ్చు. విషక్రిమినివారణా (యాంటీబయాటిక్స్) మందులను యోనివాపు చికిత్సకు ఉపయోగిస్తారు మరియు దీర్ఘకాలిక సందర్భాల్లో, నోటిద్వారా మింగే యాంటీబయాటిక్స్ మందులనూ వాడవచ్చు. ఇది పూర్తిగా చికిత్స చేయదగినది కాబట్టి ఫలితం సాధారణంగా మంచిగా వుంటుంది. యోనివాపు యొక్క సమస్యలలో చికిత్స తరువాత సంక్రమణ పునరావృతం కావడం, ఇతర వ్యాధికారక క్రిముల (హానికరమైన సూక్ష్మజీవులు) వల్ల సంక్రమణ, మరియు అరుదుగా, సంక్రమణ గర్భాశయానికి వ్యాప్తి చెందవచ్చు. యోనివాపును నివారించడానికి యోని పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.