యోని ప్రాంతంలోని సంభవించే నొప్పి, అంటే, మూత్రమార్గము క్రింద ఋతుక్రమ రక్త స్రావం బయటకు వచ్చే స్థానంలో సంభవించే నొప్పిని యోని నొప్పి అని పిలుస్తారు. ఇది గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు (నిరపాయమైన కణితులు) లేదా యోని అంటువ్యాధి లేదా వాపు వంటి తీవ్రమైన కారణాల యొక్క లక్షణం కావచ్చు లేదా కొంతమంది మహిళల్లో లైంగిక సంభోగం వంటి చిన్న కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.
తరచుగా, ప్రత్యేకించి యువతులలో, యోని నొప్పి ఋతు చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఋతుక్రమ సమయంలో నొప్పి లేదా డిస్మెనోరియా ఋతుచక్రాలు సంభవించే దాదాపు సగంమంది కంటే ఎక్కువ స్త్రీలలో ఉంటుంది. ఈ నొప్పి ఋతుచక్ర ప్రారంభంలో 1 నుండి 2 రోజులు ఉంటుంది. యోని నొప్పి తరచుగా మహిళల్లో వల్వార్ నొప్పితో ముడిపడి ఉంటుంది. యోనిలింగము, యోని మరియు లాబియా మినోరా (అంతరోష్ఠాలు) మరియు లాబియా మజోరా (యోని వెలుపలి బాహ్య ఓష్ఠాలు కండరపు ముడుతలు)తో సహా మొత్తం స్త్రీ యొక్క జననేంద్రియాల భాగాలను వల్వా సూచిస్తుంది.
ఈ వ్యాసం యోని నొప్పి యొక్క రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నిర్దారణ పద్ధతులతో పాటు దాని చికిత్స మరియు రోగసూచన గురించి చర్చిస్తుంది.