మెన్స్ట్రువల్ కప్ స్త్రీల ఋతుక్రమ సమయంలో ఉపయోగించే పరిశుభ్రత ఉత్పత్తుల్లో ఒకటి. ఇది చిన్నగా, సౌకర్యవంతముగా, ఫన్నెల్ ఆకారంలో ఉండే ఒక ప్లాస్టిక్ పరికరం, యోని లోకి అమరే విధంగా రూపొందించబడుతుంది. ఇది ఋతుక్రమ రక్తాన్ని సేకరించేందుకు తయారు చేయబడింది. ఇతర పరిశుభ్రత పరికరాల కంటే ఇవి ప్రత్యేకమైనవి ఎంతుకంటే వీటిని పూర్తిగా పునర్వినియోగించవచ్చు (reusable).
ఒకసారి ఋతుక్రమ రక్తముతో పూర్తిగా నిండిపొతే, పరికరాన్ని సులభంగా బయటకు తీసివేసి, శుభ్రపరచి మరియు తిరిగి లోపల అమర్చవచ్చు. ఇది టాంపూన్లు లేదా సానిటరీ ప్యాడ్స్ కంటే చవుకైన ప్రత్యామ్న్యాయం. అయినప్పటికీ, వాటి ఉపయోగం గురించి అపోహలు ఉండడం మరియు వాటి గురించి అసలు తెలియక పోవడం వలన మెన్స్ట్రువల్ కప్పులు లేదా రబ్బరు కప్పులు పెద్దగా వ్యాప్తిలోకి రాలేదు.
ఈ వ్యాసం మీకు మెన్స్ట్రువల్ కప్పును ఎలా ఉపయోగించాలో మరియు దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుపుతుంది. మెన్స్ట్రువల్ కప్పు యొక్క ప్రతికూలతలు లేదా ప్రమాదాలు అలాగే భారతదేశంలో దాని లభ్యత మరియు ధరలు కూడా ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.